TSPSC VAS Results : టీఎస్పీఎస్సీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

Best Web Hosting Provider In India 2024

TSPSC VAS Results : తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాత పరీక్ష ఫలితాలను(TSPSC Veterinary Assistant Surgeon Results) టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. గతేడాది జులై 13న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్పీఎస్సీ(TSPSC) వెబ్ సైట్ లో ఉంచింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Class A) 170 పోస్టులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Class B) 15 పోస్టులు మొత్తం 185 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లను త్వరలో పరిశీలిస్తామని బోర్డు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెటర్నరీ, పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Class-A & B) 185 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

టీఎస్పీఎస్సీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు

Step 1 : TSPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ సందర్శించండి

Step 2 : హోమ్‌పేజీలో “VAS Class A General Ranking List ” లింక్ పై క్లిక్ చేయండి.

Step 3 : క్లాస్ బి పోస్టుల ఫలితాల కోసం “VAS Class B General Ranking List ” లింక్ పై క్లిక్ చేయండి.

Step 4 : PDF లిస్ట్ లో హాల్ టికెట్ నెంబర్, మార్కులు నమోదు చేశారు.

Step 5 : అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకుని, భవిష్యత్తు సూచన కోసం డౌన్‌లోడ్ చేసుకోండి.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Class A) తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Class B) తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(National Remote Sensing Centre) లో వివిధ ఉద్యోగాల(Recruitment) భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన కింద భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ప్రక్రియ మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగియనుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. https://www.nrsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్లను పూర్తి చేయవచ్చు.

ఖాళీల వివరాలు

రీసెర్చ్ సైంటిస్ట్ – 20

జూనియర్ రీసెర్చ్ ఫెలో- 27

ప్రాజెక్ట్ సైంటిస్ట్-I – 06

ప్రాజెక్ట్ సైంటిస్ట్-II – 04

ప్రాజెక్ట్ అసోసియేట్-I- 02

ప్రాజెక్ట్ అసోసియేట్-II – 12

ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు. పోస్టులను బట్టి అర్హతలను పేర్కొన్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కొన్ని పోస్టులకు రాతపరీక్షలు, ఇంటర్వూలు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కొన్ని పోస్టులకు రాత పరీక్షలు లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.nrsc.gov.in/ అప్లై చేసుకోవచ్చు

WhatsApp channel

టాపిక్

Trending TelanganaTelangana NewsTspscExam ResultsTs Govt Jobs
Source / Credits

Best Web Hosting Provider In India 2024