Anchor Rashmi Gautam: నెటి‍జన్‍‍కు యాంకర్ రష్మి స్ట్రాంగ్ కౌంటర్.. అందుకోసం ఒక్క ఫొటో పెడితే చాలంటూ ఘాటు రిప్లై

Best Web Hosting Provider In India 2024

Anchor Rashmi Tweet: బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా రష్మి గౌతమ్ వెలుగొందుతున్నారు. అందంతో పాటు మాటకారితనంతో మెప్పిస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు. కొన్ని హాట్ రోల్స్ కూడా చేశారు. రష్మికి సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ కూడా బాగానే ఉంది. కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీతో పాటు పలు షోలకు రష్మి ఆమె యాంకర్‌గా చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. కొన్ని విషయాలపై ఆమె స్పందిస్తుంటారు.

జొమాటో కొత్త సర్వీస్‍పై రష్మి ట్వీట్

శాకాహారుల కోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఇటీవలే ఓ ప్యూర్ వెజ్ మోడ్‍ను తీసుకొచ్చింది. శాకాహారాన్ని డెలివరీ చేసేందుకు ప్రత్యేక డెలివరీ ఏజెంట్లను ఏర్పాటు చేసింది. దీనిపై కొందరి నుంచి విమర్శలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై రష్మీ నేడు స్పందించారు. జొమాటో నిర్ణయానికి ఆమె మద్దతునిచ్చారు.

ఎవరైనా శాకాహారాన్ని ఎంపిక చేసుకుంటే.. ప్యూర్ వెజ్ గ్రీన్ టీ షర్ట్ తిరుగుతూ కనిపిస్తే కొందరి సెంటిమెంట్లు ఎందుకు దెబ్బ తింటాయో తనకు అర్థం కావడం లేదని, ఎవరైనా వివరించండి అంటూ రష్మి గౌతమ్ నేడు ట్వీట్ చేశారు. దీనికి చాలా మంది రిప్లైలు ఇచ్చారు.

అటెన్షన్ కోసమే..

అందరి దృష్టిని తనవైపు మరల్చుకోవడం కోసమే రష్మి ప్రయత్నిస్తుంటారని ఓ యూజర్.. ఆ ట్వీట్‍కు కామెంట్ చేశారు. అటెన్షన్, రీచ్ కష్టాలు.. ఇది ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ రాసుకొచ్చారు. దీంతో రష్మికి కోపం వచ్చింది. దీనికి ఆమె స్ట్రాంగ్‍గా రిప్లై ఇచ్చారు.

ఒక్క ఫొటో చాలు..

తాను ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే జూమ్ చేసి.. సొల్లు కార్చుకుంటూ.. అవసరం లేని అటెన్షన్ ఇస్తారని రష్మి ఘాటుగా స్పందించారు. అటెన్షన్ కోసమే అయితే తాను ఒక్క ఫొటో పెడితే చాలనేలా రియాక్ట్ అయ్యారు. “రీచ్ కోసం నేను ఈ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క పిక్ చాలు.. జూమ్ చేసి.. చేసి సొల్లు కూర్చుకుంటూ అవసరం లేదని అటెన్షన్ ఇస్తారు. ఇప్పుడు మీరు మీ అటెన్షన్ పొందారని అనుకుంటున్నా. దీని కోసం మీరు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారో” అని రష్మి ఘాటుగా రిప్లై ఇచ్చారు.

తనను కించపరిచేలా కామెంట్ చేసిన యూజర్‌పై దీటుగా స్పందించిన రష్మిని నెటిజన్లు అభినందిస్తున్నారు. చెంపదెబ్బ కొట్టినట్టు బాగా రిప్లై ఇచ్చారని కొందరు కామెంట్లు చేశారు. రష్మికే తమ మద్దతు అని రాసుకొస్తున్నారు. ఇలా స్ట్రాంగ్‍గా కౌంటర్ ఇవ్వడం అవసరమే అని కొందరు అభిప్రాయపడ్డారు.

టీవీ షోల్లో రష్మి అదరగొడుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఆమె.. మరిన్ని కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తున్నారు. అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. మెగాస్టార్ హీరోగా నటించిన భోళా శంకర్ చిత్రంలో గతేడాది రష్మి నటించారు. హాస్టల్ బాయ్స్ మూవీలోనూ క్యామియో రోల్‍లో కనిపించారు. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు ఈ గ్లామరస్ యాంకర్. అయితే, కొన్నిసార్లు ట్రోలింగ్‍కు కూడా గురవుతుంటారు. అయినా, తన అభిప్రాయాలను గట్టిగా చెబుతుంటారు రష్మి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024