Ponnam Vs Padi Kaushik Reddy : పొన్నం ఆవేశం స్టార్, బూతుపురాణం ఏడో గ్యారంటీ- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

Ponnam Vs Padi Kaushik Reddy : మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) మరోసారి ఫైర్ అయ్యారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఆవేశం స్టార్ గా పొన్నం మారారని విమర్శించారు. కరీంనగర్(Karimnagar) లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆర్డీవో, ఎమ్మార్వో లను మంత్రి పొన్నం బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందుకు ఆడియోనే నిదర్శనమన్నారు. ఆడియో లీక్ తో హన్మకొండ ఆర్డీవోపై చర్యలు తీసుకుంటే మంత్రి పొన్నంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో, ఎమ్మార్వోలకి నా నుంచి ఒక్క ఫోన్ కాల్ ఉన్నా ఎలాంటి ఛాలెంజ్ కైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజలు ఫోన్ చేస్తే ఇష్టానుసారం మాట్లాడుతున్న పొన్నంకు మంత్రి పదవి కుక్కకి బొక్క దొరికినట్లుందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలతో పొన్నం బూతుపురాణాన్ని ఏడో గ్యారంటీగా ఇస్తున్నారని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

దానం నాగెందర్ పై చర్యలు తీసుకోవాలి

బీఆర్ఎస్(BRS) నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్(Danam Nagender) వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు‌. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారడంపై స్పీకర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంటనే స్పీకర్ అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానంపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా పోరాడుతామన్నారు.

పొన్నం ఆడియో లీక్ దుమారం

హుజురాబాద్(Huzurabad) అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. కమలాపూర్ మండలంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో చెక్కుల పంపిణీకి అంతా సిద్ధం చేశాక, మంత్రి పొన్నం ఫోన్ లో హన్మకొండ ఆర్డీవో, కమలాపూర్ ఎమ్మార్వోతో ఎమ్మెల్యేతో చెక్కులు పంపిణీ చేయకుండా మీరే చేయండని సూచించారు. హుజురాబాద్ లో ఎమ్మెల్యే తమ పార్టీ కానందున ఎమ్మెల్యేతో కాకుండా అధికారులే పంపిణీ చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో అధికారులు చెక్కులు ఎమ్మెల్యేతో పంపిణీ చేయకుండా వారే పంపిణీ చేశారు. పొన్నం ఫోన్ లో అధికారులతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్(Ponnam Audio Viral) గా మారింది. మంత్రి పొన్నం ఆడియో బయటకు రావడంతో ఆర్డీవోపై చర్యలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) అధికారుల పక్షాన పొన్నం తీరుపై మండిపడుతున్నారు.

పాడి పై కాంగ్రెస్ కస్సుబస్సు

మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Ponnam vs Padi) విమర్శించడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎమ్మెల్సీగా, విప్ గా పని చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి సబ్జెక్టు నాలెడ్జ్ లేకుండా చైల్డ్ మెంటాల్టితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలే ఉరికిచ్చి కొడుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. పొన్నంపై కౌశిక్ విమర్శలు, పాడి పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Ponnam PrabhakarHuzurabad Assembly ConstituencyTrending TelanganaTelangana NewsTelangana CongressBrsTs Politics
Source / Credits

Best Web Hosting Provider In India 2024