YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.29-12-2022(గురువారం) ..
ఘనంగా శ్రీ గౌతమ హై స్కూల్ కల్చరల్ ఫెస్ట్ ..
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
గత సంవత్సరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలోని శ్రీ గౌతమ హై స్కూల్ కల్చరల్ ఫెస్ట్ ను గురువారం రాత్రి పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు , ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ గౌతమ హై స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, సీబీఎస్ఈ సిలబస్ కు అనుగుణంగా అత్యుత్తమ అధ్యాపకులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన చేయటం హర్షణీయమన్నారు, పాఠశాలలో ప్లే స్కూల్ ను కూడా అత్యుత్తమంగా తీర్చిదిద్ది బాల్యదశ నుంచే విద్యార్థులు పాఠశాలలకు ఆకర్షితులయ్యేలా ఆట,పాటలతో విద్యాబోధన చేయటం , విద్యార్థులు 10 వ తరగతిలో మంచి మార్కులు సాధించే విధంగా వారికి అన్ని విధాలుగా ఉత్తమమైన విద్యాభోదన చేయడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలను నడిపిస్తున్న యాజమాన్యం సరికొండ రవీంద్రబాబు -అఖిల్ లను అభినందిస్తున్నట్లు తెలిపారు, విద్యను వ్యాపార కోణంలో చూడకుండా విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే పరిశ్రమ లాగా చూడాలన్నారు .. అనంతరం గత సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు ..
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ..