
Best Web Hosting Provider In India 2024

Phone Tapping Case : తెలంగాణలో సంచలనమైన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) రోజుకో మలుపు తిరుగుతుంది. రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నిఘా పెట్టారని, వాళ్ల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన మరో సీనియర్ అధికారి దయాకర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1, ఎస్ఐబీ మాజీ చీఫ్ కు ఈ అధికారి సన్నిహితుడిగా తెలుస్తోంది. దయాకర్ రెడ్డి సుదీర్ఘకాలంగా ఎస్‌ఐబీలో(SIB) పనిచేశారు. ఈ కేసులో దయాకర్ రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయనతో పాటు ఓ ఇన్‌స్పెక్టర్ కు స్పెషల్ టీం నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు(Praneeth Rao), అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేశారు. వీరి విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్నాయని సమాచారం. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన పోలీసులు ఎదుట విచారణ హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ప్రభాకర్ రావు లొంగిపోతున్నారా?
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (SIB Ex Chief Prabhakar Rao)పోలీసుల ఎదుట లొంగిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ అరెస్టైన ఎస్ఐబీ అధికారులు ప్రభాకర్ రావు ఏం చెబితే అదే చేశామని వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం మరింత ముదరక ముందే ప్రభాకర్ రావు లొంగిపోవాలని నిర్ణయానికి వచ్చనట్లు తెలుస్తోంది. ఆయన విచారణ బృందం ఎదుట హాజరై అప్రూవర్ గా మారితే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక ములుపు తిరగనుంది. ఈ కేసులో మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును(Radha Kishan Rao) అరెస్టు చేసిన పోలీసులు…10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును అశ్రయించారు. కౌంటర్ దాఖలు చేయాలని రాధాకిషన్‌కు కోర్టు నోటీసులు జారీచేసింది. ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నలుగు ఉన్నతాధికారులను అరెస్టు చేశారు. ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్(Telegraph Act) నమోదుపై కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
త్వరలో మాజీ మంత్రులకు నోటీసులు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case)రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తుంది. టాస్క్ ఫోర్స్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల టైంలో ఓ పార్టీకి చెందిన డబ్బులు పోలీసు వాహనాల్లోనే(Money shifting in Police Vehicles) తరలించినట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ వాహనాలను తనిఖీలు చేయరనే ఉద్దేశంతో కొందరు కీలక నేతల డబ్బును తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ కేసు రాజకీయ మలుపు తీసుకుంది. త్వరలో కొందరు రాజకీయ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని, వీరిలో మాజీ మంత్రులు(Ex Ministers Phone Tapping Case) కూడా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్