Best Web Hosting Provider In India 2024

శ్రీసత్యసాయి జిల్లాలో ఊరూరా భారీ గజమాలలు, పూలవర్షంతో స్వాగతం
శ్రీసత్యసాయి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీసత్యసాయి జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోంది. మండుటెండలోనూ తమ అభిమాన నేత కోసం గంటల తరబడి వేచి ఉండి, తమ ఊరికి రాగానే పూలవర్షంతో స్వాగతం పలికి, గజమాలలతో సత్కరిస్తున్నారు. ముదిగుబ్బలో మండుటెండలోనూ సీఎం వైయస్.జగన్కు జన నీరాజనం పలికారు. బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జనం పొటెత్తారు. రెండు చోట్ల భారీ గజమాలతో ముఖ్యమంత్రికి గ్రామస్తులు స్వాగతం పలికారు.
బత్తలపల్లిలో రోడ్డుకు రెండువైపులా దారిపొడవునా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ అభివాదం చేశారు. రాళ్ల అనంతపురం గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్న సీఎం వైయస్ జగన్..
2.50 నిమిషాలకు ముదిగుబ్బ చేరుకున్నారు. ఈ గ్రామంలోనూ ముఖ్యమంత్రికి గజమాలతో స్వాగతం పలికారు. కాలే ఎండను సైతం లెక్కచేయకుండా అభిమానులు బారుల తీరారు. బస్సుపై నుంచి ప్రజలకు వైయస్ జగన్ అభివాదం చేశారు.
3.27 గంటల వరకు సుమారు 37 నిమిషాల పాటు ముదిగుబ్బలో జనంతోనే సీఎం వైయస్.జగన్ గడిపారు.
4.27 గంటలకు వైయస్ జగన్ బస్సు యాత్ర నాగారెడ్డి పల్లి చేరుకుంది. నాగారెడ్డి పల్లి వద్ద కూడా ముఖ్యమంత్రికి గజమాలతో ప్రజలు స్వాగతం పలికారు.