వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను కూల్చడమే చంద్రబాబు ఉద్దేశం 

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు పార్ల‌మెంట్ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి

నెల్లూరు: బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న వాలంటీర్లపై టీడీపీకి కన్ను కుట్టిందని నెల్లూరు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శించారు. వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థలను కుప్పకూల్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నాడన్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి అవ్వ తాతలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇస్తున్నారన్నారు.
 
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి సకాలంలో పెన్షన్లు అందకుండా చేశారని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. వాలంటీర్లు సేవలు అందించకూడదనే నిబంధనను విధించారని  పేర్కొన్నారు. చంద్రబాబు ఎంత ద్రోహం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబుకు తగిన రీతిలో మీరు బుద్ధి చెప్పాలన్నారు. వాలంటరీ వ్యవస్థపై టీడీపీ నేతలు విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అవ్వా.. తాతల్లో చాలా మంది నడిచి వెళ్ళలేరు.. వారందరినీ సచివాలయం వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని చెబుతున్నారు.. ఇది న్యాయమా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

లింగారెడ్డి భ‌ర‌త్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
కావలి నియోజకవర్గానికి చెందిన లింగారెడ్డి భరత్ రెడ్డి ఈరోజు తన అనుచరులతో సహా తిరిగి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంద‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. నెల్లూరు రామ్మూర్తి నగర్ లోని  విజ‌య‌సాయిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ బీద మస్తాన్ రావు సమక్షంలో భరత్ రెడ్డికి కండువా కప్పి విజ‌య‌సాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
 

Best Web Hosting Provider In India 2024