Tillu Square 4 Days Collections: కాస్త తగ్గిన టిల్లు స్క్వేర్ కలెక్షన్ల జోరు.. నాలుగు రోజుల్లో ఎంతంటే..

Best Web Hosting Provider In India 2024

Tillu Square 4 Days Collections: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా పాజిటివ్ టాక్‍తో అదిరిపోయే కలెక్షన్లను సాధిస్తోంది. మంచి క్రేజ్ మధ్య మార్చి 29న థియేటర్లలోకి వచ్చిన ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ అంచనాలను నిలబెట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. దీంతో బాక్సాఫీస్‍ను షేక్ చేసేలా ఫస్ట్ వీకెండ్ వసూళ్లను దక్కించుకుంది. డీజే టిల్లుకు సీక్వెల్‍గా వచ్చిన ఈ టిల్లు స్క్వేర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తొలి మూడు రోజులు బాక్సాఫీద్ వద్ద దుమ్మురేపిన ఈ చిత్రం నాలుగో రోజు జోరు కాస్త తగ్గింది.

నాలుగు రోజుల కలెక్షన్లు

టిల్లు స్క్వేర్ చిత్రానికి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.78కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. నాలుగో రోజైన సోమవారం ఈ చిత్రం రూ.10 కోట్ల వసూళ్లను సాధించింది. తొలి మూడు రోజుల్లో అంచనాలకు మించి రూ.68 కోట్లను ఈ చిత్రం రాబట్టింది. అయితే, వీక్ డే అయిన సోమవారం బాక్సాఫీస్ వద్ద డ్రాప్ చూసింది ఈ మూవీ.

అయితే, టిల్లు స్క్వేర్ సినిమా వారంలోగానే రూ.100 కోట్ల కలెక్షన్ల మార్కును దాటే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా పాజిటివ్ టాక్ రావటంతో ఈ మూవీకి వసూళ్లు స్టడీగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి పెద్దగా పోటీ కూడా లేదు. దీంతో టిల్లు జోష్ ఇంకొన్ని రోజులు కంటిన్యూ కానుంది. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో భారీ బ్లాక్ బాస్టర్‌గా నిలుస్తోంది.

అమెరికాలో అదుర్స్

టిల్లు స్క్వేర్ చిత్రానికి ఓవర్సీస్‍లోనూ అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఊహలకు మించి అక్కడ వసూళ్లలో దూసుకెళుతోంది.

టిల్లు క్యారెక్టర్‌లో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి టిల్లు స్క్వేర్ మూవీలో మ్యాజిక్ చేశాడు. డీజే టిల్లును మించి అదరగొట్టాడు. తన మార్క్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, గ్రేస్‍తో దుమ్మురేపాడు. ఈ సీక్వెల్‍లో సిద్ధు సరసన లిల్లీ పాత్రలో నటించారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ మూవీకి ఆమె కూడా మరో హైలైట్‍గా నిలిచారు. ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ స్క్రిప్ట్ కూడా రాశారు.

టిల్లు స్క్వేర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ దిశగా ముందుకుసాగుతోంది. ఈ చిత్రంలోని పాటలకు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి ట్యూన్స్ ఇస్తే.. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు భీమ్స్ సెసిరోలియో.

టిల్లు స్క్వేర్ చిత్రం తనకు కూడా బాగా నచ్చిందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. సిద్ధు జొన్నలగడ్డ సహా మూవీ టీమ్‍ను ఇంటికి పిలిపించుకొని ఆయన అభినందించారు. ఈ మూవీని తాను చాలా ఎంజాయ్ చేశానని వెల్లడించారు. ఈ చిత్రం విజయవంతం అవడంతో సక్సెస్ ప్రెస్‍మీట్ కూడా నిర్వహించి సంతోషం వ్యక్తం చేసింది మూవీ టీమ్.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024