Uggani: మరమరాలతో ఇలా స్పైసీగా ఉగ్గాని చేసుకోండి, ఈ రాయలసీమ రెసిపీ అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Uggani: బొరుగులు లేదా మరమరాలతో చేసే ఉగ్గాని రాయలసీమలో వెరీ స్పెషల్. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఉగ్గాని తినాలనుకుంటే రాయలసీమ వెళ్ళక్కర్లేదు. మీరు ఇంట్లోనే పావుగంటలో వండేయ్యొచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. కాస్త స్పైసీగా చేసుకుంటే సాయంత్రం పూట స్నాక్ గా టేస్టీగా ఉంటుంది. రాయలసీమలో ఉగ్గానిని బ్రేక్ఫాస్ట్ గా కూడా తింటారు. కారం అధికంగా లేకుండా చేస్తే పిల్లలు దీన్ని ఇష్టంగా తినే అవకాశం ఉంది. వారికి బ్రేక్ఫాస్ట్ రెసిపీగా లేదా స్నాక్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది.

ఉగ్గాని రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మరమరాలు – 200 గ్రాములు

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

ఎండుమిర్చి – రెండు

నూనె – మూడు స్పూన్లు

కారం – అర స్పూను

ఎండుమిర్చి – రెండు

ఉప్పు – రుచికి సరిపడా

ఆవాలు – ఒక స్పూన్

జీలకర్ర – ఒక స్పూన్

కరివేపాకు – గుప్పెడు

ఉల్లిపాయ – ఒకటి సరిపడా

పుట్నాల పప్పు – గుప్పెడు

నిమ్మరసం – ఒక స్పూను

ఉగ్గాని రెసిపీ

1. మరమరాలను నీళ్ళల్లో వేసి మూడు నిమిషాలు నానబెట్టండి. తర్వాత చేత్తోనే పిండి ఒక గిన్నెలో వేయండి.

2. ఆ గిన్నెలో ఉన్న మరమరాల్లో రుచికి సరిపడా ఉప్పును కలపండి.

3. తర్వాత పచ్చిమిర్చి ,కరివేపాకును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.

4. అలాగే పుట్నాల పప్పు, ఎండుమిర్చి కూడా వేసి మెత్తని పొడిలా చేసుకోండి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

6. నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోండి.

7. ఆ మిశ్రమంలోనే ఉల్లిపాయ తరుగు, కరివేపాకులు వేసి రెండు నిమిషాలు వేయించండి.

8. ఆ తర్వాత టమోటో తరుగును వేయండి. టమోటో మగ్గాక పసుపు, కారం, ముందుగా రుబ్బుకున్న పచ్చిమిర్చి కరివేపాకు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోండి.

9. అందులో పుట్నాల పప్పు, ఎండుమిర్చి పొడిని కూడా వేసి బాగా కలపండి.

10. అలాగే కొత్తిమీర తరుగును, రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోండి.

11. ముందుగా పిండి పక్కన పెట్టుకున్న మరమరాలను అందులో వేసి పులిహోర కలుపుకున్నట్టు బాగా కలుపుకోండి.

12. అంతే ఉగ్గాని రెడీ అయినట్టే. పైన నిమ్మరసం జల్లుకొని తింటే రుచి అదిరిపోతుంది.

సాయంత్రం పూట స్నాక్ గా ఇది టేస్టీగా ఉంటుంది. పిల్లలకు పచ్చిమిర్చి, కారం తక్కువగా వేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. స్పైసీ ఫుడ్ ను ఇష్టంగా తినే వారికి ఇందులో పచ్చిమిర్చి, కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. దీని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ గా కూడా తినొచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా పెట్టినా కూడా వారు ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చడం ఖాయం.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024