100 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక 

Best Web Hosting Provider In India 2024

శ్రీ‌శైలం:  ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం పార్టీకి శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో బారీ షాక్ త‌గిలింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి బుడ్డా రాజ‌శేఖ‌ర‌రెడ్డి సొంత మండ‌లంలో ఏకంగా 100 కుటుంబాలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాయి. బోయారేవుల గ్రామంలో గత 30 సంవత్సరాలుగా టిడిపిలో కొనసాగుతున్నగ్రామ మాజీ సర్పంచులు పోతుల రమణారెడ్డి, ఆయన సతీమణి పోతుల సరస్వతి అధ్వర్యంలో 100 కుటుంబాలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సమక్షంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డమ్మీ చేరికలతో ఆర్భాటాలు చేస్తున్నారని పార్టీలో చేరిన నాయ‌కులు విమ‌ర్శించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌కు ఆక‌ర్శితులై..వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్న‌ట్లు టీడీపీని వీడిన నేత‌లు పేర్కొన్నారు. గత 30సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీలో ఏమి అభివృద్ది కనిపించలేదని ఈ గత 5 సంవత్సరాలలో జగనన్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, అందుకే వైయ‌స్ఆర్ పార్టీలో చేరామన్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు.  

Best Web Hosting Provider In India 2024