Vijay Deverakonda: నాది పొగరు కాదు.. దాన్ని ఏదో ఒక రోజు సాధిస్తా: విజయ్ దేవరకొండ

Best Web Hosting Provider In India 2024

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుంది. వరుస ప్లాఫ్‍ల్లో ఉన్న విజయ్‍కు ఈ చిత్రం చాలా ముఖ్యంగా మారింది. దీంతో ఫ్యామిలీ స్టార్ కోసం దూకుడుగా ప్రమోషన్లను చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఏప్రిల్ 2) హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. లైగర్ సినిమా ప్రమోషన్ల సమయంలో రూ.200 కోట్ల కలెక్షన్లు వస్తాయని తాను చేసిన కామెంట్లపై ఈ ఈవెంట్‍లో విజయ్ మాట్లాడారు.

నాది పొగరు కాదు

కెరీర్ తొలినాళ్లతో తన సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించాలని తాను కలలు కన్నానని విజయ్ దేవరకొండ చెప్పారు. అయితే, తాను హీరోగా నటించిన నాలుగో సినిమా ‘గీతగోవిందం’తోనే అది నెరవేరిందని విజయ్ చెప్పారు. అప్పుడు తనకు ఎంతో ప్రేమ, ప్రశంసలను వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా.. గీతగోవిందంను బీట్ చేసే సినిమా రాలేదని విజయ్ అంగీకరించారు. తాను రూ.200 కోట్లు సాధిస్తానని ఓ సినిమా (లైగర్) సమయంలో చెప్పానని, అయితే అది జరగలేదని అన్నారు. అయితే, ఆ స్టేట్‍మెంట్ ఇవ్వడం తన పొగరు కాదని, ఏదో ఒక రోజు దాన్ని సాధిస్తానని అన్నారు.

బలుపు కాదు.. కాన్ఫిడెన్స్

రూ.200 కోట్ల స్టేట్‍మెంట్ ఎందుకు ఇచ్చావని చాలా మంది తనతో అన్నారని, అలా చెప్పడం తప్పు అని వారించారని విజయ్ తెలిపారు. తాను కచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని సాధిస్తానని, ఇది పొగరు కాదని, ఆత్మవిశ్వాసమని అన్నారు. “రూ.200 కోట్లు కొడతానని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవటం తప్పు. దాని వల్ల నేను ఎన్నో తిట్లు, అవమానాలు ఎదుర్కొంటున్నా. ఏదో ఒక రోజు నేను రూ.200 కోట్లు కొడతాను. అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి.. నేను పడుతూనే ఉంటా.. ఇప్పుడు కూడా దీన్ని పొగరు, బలుపు అనుకునే వారు ఉంటారు. కానీ ఇది నా మీద నాకు ఉన్న కాన్ఫిడెన్స్. నా నమ్మకం. ప్రతీ రోజు లేచినప్పుడు.. పనికి వెళ్లేటప్పుడు అదే నమ్మకంతో ఉంటా” అని విజయ్ దేవరకొండ అన్నారు.

మనం స్టార్ అవ్వలేమా ఏంటి..

“ఇంకొకరు స్టార్ అయితే.. మేం అవ్వలేమా ఏంటి.. నేను స్టార్ అయితే.. మీరు అవ్వలేరా ఏంటి.. ఇంకొకరు రూ.200 కోట్లు కొడితే.. మనం కొట్టలేమా ఏంటి” అంటూ ఫ్యామిలీ స్టార్ స్టైల్‍లో విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఒకవేళ తనకు ఏ అవార్డులు వచ్చినా.. అవి దర్శకుడు పరుశురామ్ కాళ్ల దగ్గరకే అని ఎమోషనల్‍గా చెప్పాడు విజయ్. పరుశురామ్ లేకపోతే ఇలాంటి అవకాశం తన లైఫ్‍లో ఉండేది కాదని అన్నాడు.

విజయ్ దేవరకొండ – పరుశురామ్ కాంబినేషన్‍లో 2018లో వచ్చిన గీతగోవిందం సినిమా రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. విజయ్ కెరీర్లో ఇప్పటికే అదే బిగ్ సక్సెస్‍గా ఉంది. ఇప్పుడు వారిద్దరి కాంబోలో ఫ్యామిలీ స్టార్ వస్తుండటంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుంది.

ఫ్యామిలీ స్టార్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించగా.. గోపీసుందర్ సంగీతం అందించారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024