Without Gym Exercise : ఇలా చేస్తే మీరు జిమ్ వెళ్లాల్సిన అవసరమే లేదు

Best Web Hosting Provider In India 2024

నేటి బిజీ ప్రపంచంలో దేనికీ సమయం లేదు. ఒకదాని తర్వాత మరొకటి. ఉదయం నుంచి రాత్రి వరకు చాలా టైట్ షెడ్యూల్. దీంతో ఆరోగ్యం చూసుకునే సమయం దొరకడం లేదు. సమయానికి భోజనం చేయడం లేదు. ఇక చెడు జీవనశైలి కారణంగా రోజురోజుకు రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో మధుమేహం, థైరాయిడ్, రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మోకాళ్ల నొప్పులు తదితర ఆరోగ్య సమస్యలు సాధారణమయ్యాయి.

ఆరోగ్యంగా ఉండటానికి శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం, శారీరక శ్రమ లేదా వ్యాయామం ఉత్తమ మార్గంగా చెబుతారు. చాలా మంది జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేస్తుంటారు. కానీ బిజీ షెడ్యూల్‌లు ఎల్లప్పుడూ జిమ్‌కి వెళ్లడానికి సమయం దొరకదు. అయితే మీరు జిమ్‌కు వెళ్లకుండానే మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

మెట్లు ఎక్కాలి

మెట్లు ఎక్కడం కాలు బలాన్ని పెంపొందించడానికి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. అలాగే, బరువును అదుపులో ఉంచుతుంది. దిగువ శరీర కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు, కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మీరు ఆఫీసు వెళ్లినా.. ఇంటి దగ్గర అయినా మెట్లు మాత్రమే ఎక్కండి. లిఫ్ట్‌ను ఎక్కువగా ఉపయోగించకూడదు. దానితో ఎలాంటి ఉపయోగం లేదు.

స్కిప్పింగ్ చేయాలి

స్కిప్పింగ్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలా కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. అలాగే రోజువారీ స్కిప్పింగ్ ఎముకల సాంద్రతను నిర్వహిస్తుంది. కాలు కండరాలను బలపరుస్తుంది. ప్రతి రోజూ ఉదయం స్కిప్పింగ్ చేయండి. మెుదట్లో తక్కువతో మెుదలుపెట్టి.. క్రమక్రమంగా పెంచుతూ ఉండాలి. ఇది మీ నుంచి చాలా చెమటను బయటకు తీస్తుంది. ఈ వ్యాయామం మీకు ఎంతో ఉపయోగరకంగా ఉంటుంది.

ట్రెక్కింగ్‌తో చాలా ప్రయోజనాలు

ట్రెక్కింగ్ కూడా ఒక రకమైన కార్డియోవాస్కులర్ వ్యాయామం. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. హైకింగ్ కేలరీలను బర్న్ చేయడం, కాళ్ల కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దగ్గరలోని ఎత్తైన ప్రదేశాలను ఎక్కండి. మీరు మానసికంగా, శారీరకంగానూ చాలా ప్రయోజనాలు పొందుతారు.

లెగ్స్ అప్ ది వాల్ వ్యాయామం

లెగ్స్ అప్ ది వాల్ వ్యాయామం మనస్సుకు విశ్రాంతినిస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది, థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచుతుంది, వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మీరు గొడగకు దగ్గరలో పడుకుని.. మీ కాళ్లను గోడపైకి పెట్టండి. ఇది మీ రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

డ్యాన్స్ చేయండి

మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచుకోవడానికి మరొక గొప్ప మార్గం డ్యాన్స్. మీ బరువు తగ్గడానికి, మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సాయపడుతుంది. డిప్రెషన్ నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు లేదా మీ రూమ్‌లో డోర్లు దగ్గరకు వేసుకుని మీకు నచ్చిన విధంగా డ్యాన్స్ చేయండి. ఇది మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024