Ayalaan Telugu OTT: శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ తెలుగు వెర్ష‌న్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

Ayalaan Telugu OTT: ఈ ఏడాది త‌మిళంలో సంక్రాంతికి థియేట‌ర్ల‌లో రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది అయ‌లాన్ మూవీ. శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టించిన ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 96 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 2024లో కోలీవుడ్‌లో అత్య‌ధిక వ‌సూళ్లను ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

తెలుగులో రిలీజ్ కావాల్సింది…

త‌మిళంతో పాటు తెలుగులోనూ అయ‌లాన్ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు భావించారు. కానీ సంక్రాంతికి తెలుగులో స్ట్రెయిట్ సినిమాల పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో రెండు వారాలు ఆల‌స్యంగా తెలుగు వెర్ష‌న్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. భారీగా ప్ర‌మోష‌న్స్ చేశారు. ఈ ప్ర‌మోష‌న్స్‌లో శివ‌కార్తికేయ‌న్ కూడా పాల్గొన్నాడు.

వీఎఫ్ఎక్స్ స‌మ‌స్య‌ల కార‌ణంగా తెలుగు వెర్ష‌న్ రిలీజ్ వాయిదాప‌డింది. థియేట‌ర్ల‌లోనే కాదు ఓటీటీలో కూడా తెలుగు వెర్ష‌న్ ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌ల‌కు నోచుకోలేదు. తెలుగుకు సంబంధించి డ‌బ్బింగ్ ప‌నులు మొత్తం పూర్త‌యినా అటు థియేట‌ర్లు, ఇటు ఓటీటీలో అయ‌లాన్ మూవీ రిలీజ్ కాక‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

స‌న్ నెక్స్ట్‌లో…

థియేట‌ర్ల‌లో మిస్స‌యిన ఈ మూవీ తాజాగా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయ‌లాన్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను స‌న్ నెక్స్ట్ ద‌క్కించుకున్న‌ది. ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ తెలుగు వెర్ష‌న్ ఏప్రిల్ 19న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

అయ‌లాన్ క‌థ ఏదంటే?

తామిజ్ (శివ‌కార్తికేయ‌న్‌) ఓ రైతు. జాబ్ కోసం సిటీకి వ‌చ్చిన తామిజ్‌కు టాట్టూ అనే ఏలియ‌న్‌తో ఫ్రెండ్‌షిప్ ఏర్ప‌డుతుంది. పెట్రోల్‌, డీజీల్‌కు ప్ర‌త్యామ్నాయంగా నోవా గ్యాస్‌ను క‌నిపెట్టే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు సైంటిస్ట్ఆ ర్య‌న్ (శ‌ర‌ద్ ఖేల్క‌ర్‌). నోవా గ్యాస్‌ను వెలికితీయాడానికి స్పార్క్ అనే గ్ర‌హ‌శ‌క‌లాన్ని ఉప‌యోగిస్తుంటాడు.

ఇండియాలో ఎవ‌రికి తెలియ‌కుండా ఓ మైన్‌లో ర‌హ‌స్యంగా నోవా గ్యాస్‌ ప్ర‌యోగం చేస్తుంటాడు ఆర్య‌న్‌. ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌యోగాన్ని అడ్డుకొని ఆర్య‌న్ ద‌గ్గ‌ర ఉన్న స్పార్క్‌ను సొంతం చేసుకోవ‌డానికి త‌న గ్ర‌హం నుంచి టాట్టూ భూమిపైకి వ‌స్తుంది. ఆర్య‌న్ ప్ర‌యోగాన్ని అడ్డుకోవ‌డంలో టాట్టూకు తామిజ్ ఎలాంటి స‌హాయం చేశాడు? ఈ ప్ర‌య‌త్నంలో వీరిద్ద‌రు ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు? అన్న‌ది యాక్ష‌న్ అంశాల‌తో అయ‌లాన్ మూవీలో చూపించాడు డైరెక్ట‌ర్ ర‌వికుమార్‌.

ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌…

అయ‌లాన్ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. ఎలియ‌న్ పాత్ర‌కు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవ‌ర్ అందించాడు. హీరో శివ‌కార్తికేయ‌న్‌తో పాటు సిద్ధార్థ్ రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా ఈ సినిమా కోసం ప‌నిచేశారు. అయ‌లాన్ మూవీకి ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించాడు.

సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో రూపొందిన అయ‌లాన్ సినిమా షూటింగ్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగింది. 2016లో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఎన్నో అడ్డంకుల‌ను దాటుకొని 2024లో ఈ మూవీ రిలీజైంది.

అమ‌ర‌న్‌…

అయ‌లాన్ త‌ర్వాత అమ‌ర‌న్ పేరుతో ఓ బ‌యోపిక్ మూవీ చేస్తున్నాడు శివ‌కార్తికేయ‌న్‌. ఇండియ‌న్ ఆర్మీ అధికారి మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అగ్ర హీరో క‌మ‌ల్‌హాస‌న్ నిర్మిస్తోన్న ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియాసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అమ‌ర‌న్‌తో పాటు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌తో శివ‌కార్తికేయ‌న్ ఓ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024