Krishna mukunda murari april 3rd: బావని బుట్టలో వేసుకోవడానికి సంగీత తిప్పలు.. మీరా పేరు ముకుందగా మార్చిన ఆదర్శ్

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial april 3rd episode: కృష్ణ రజినిని ఫుల్ గా కౌంటర్ వేసి ఆడుకుంటుంది. ఆదర్శ్ దగ్గరకి వెళ్ళి తనని మంచి చేసుకోమని కూతురికి చెప్తుంది. ముకుంద వాళ్ళ మాటలు వింటుంది. ఆదర్శ్ ఈ సంగీతకి కనెక్ట్ అయితే రేపు నేను ముకుంద అని తెలిసినా నాకు ప్రాబ్లం లేకుండా ఉంటుందని మనసులో అనుకుంటుంది. నా కూతురు ఆదర్శ్ మరదలు పెళ్ళాం కావాల్సింది కాలేదు ఇప్పుడు అతడి పెళ్ళాం పోయింది నా కూతురు పెళ్ళాం అవుతుందని రజిని అంటుంది. నేను అసలు ఆపాలని అనుకోవడం లేదు మీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నానని ముకుంద చెప్తుంది.

 

రజినీతో చేతులు కలిపిన ముకుంద

ముకుంద మాటలకు షాక్ అవుతూ మాకు హెల్ప్ చేస్తే నీకు ఏం వస్తుందని రజినీ అడుగుతుంది. ఆదర్శ్ భార్యని పోగొట్టుకుని బాధలో ఉన్నాడు మీ సంగీతకు దగ్గర అయితే అంతా హ్యాపీనే కదా మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి చేస్తానని చెప్తుంది. మీరా చాలా మంచిదని సంగీత అమాయకంగా అంటుంది. సంగీత కాఫీ పట్టుకుని ఆదర్శ్ రూమ్ వచ్చి తనని నిద్రలేపుతుంది. పొద్దున్నే నా గదిలోకి ఎందుకు వచ్చావ్ వెళ్లిపొమ్మని చిరాకు పడతాడు. అమ్మ బావ దగ్గరకు వెళ్ళు అంటుంది, నువ్వేమో నన్ను కసురుకుంటావ్ నన్ను ఎవరూ అర్థం చేసుకోరని సంగీత ఏడుపు మొహం పెడుతుంది.

ఆదర్శ్ కి త్వరగా దగ్గర అవమని కూతురికి రజినీ హితబోధ చేస్తుంది. హద్దులలో ఉండకపోతే ఇంట్లో నుంచి బయటకి పొమ్మంటున్నాడని చెప్తుంది. అయితే ఏదో ఒకటి కావాలని చెప్పి మీ బావని అడుగుతూ తన వెనుక తిరగమని అంటుంది. మొత్తానికి తల్లికూతుళ్ళు మాత్రం కాస్త చిరాకు పెడుతూనే కామెడీ చేస్తున్నారు. ముకుంద శ్రీనివాస్ కి ఫోన్ చేస్తుంది. ఇల్లు అమ్మడానికి ఇంక ఎన్ని రోజులు పడుతుందని అడుగుతుంది. ఇల్లు అమ్మడానికి ఇన్ని పాట్లు పడుతున్నావ్. ఇల్లు అమ్మడం ఇష్టం లేక సాకులు చెప్తే బాగోదని అంటుంది. నువ్వు ఎక్కడ దొరికిపోతావోనని భయంగా ఉందని శ్రీనివాస్ అంటాడు. బాగానే ఉన్నానని చెప్పి నాన్న అని పిలవడం అక్కడే ఉన్న కృష్ణ వింటుంది.

 

మీరా మాటలు వినేసిన కృష్ణ

తనకి ఎవరూ లేరని చెప్పింది కదా మరి నాన్న అంటుంది ఏంటని మనసులో అనుకుంటుంది. ముకుంద కృష్ణని తన మాటలు వినేసిందా ఏంటని షాక్ అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ నాన్న అని పిలుస్తున్నావ్ అని కృష్ణ అడిగేస్తుంది. పాత ఇంటి ఓనర్ తో మాట్లాడుతున్నా ఆయన్ని నాన్న అని పిలవడం అలవాటని చెప్పి కవర్ చేస్తుంది. కానీ కృష్ణ మాత్రం నమ్మదు. కృష్ణని నమ్మించడం కోసం డ్రామా మొదలుపెట్టేస్తుంది. తన మాటలు నమ్మేసిన కృష్ణ వెళ్ళిపోతుంది. సంగీత మళ్ళీ ఆదర్శ్ దగ్గరకి వస్తుంది. ఏంటి అంటే ఏం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది.

ఆదర్శ్ చిరాకుగా ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు. ఏం లేదు హాయిగా నిద్రపోయాను ఏసీ బాగుంది అని ఏదేదో వాగుతుంది. ఐస్ క్రీమ్ తినాలని ఉందని చెప్తుంది. కొనిస్తానని చెప్పి కొట్టబోయేసరికి పారిపోతుంది. పెద్ద బావకు అసలు మనసు లేదు ఐస్ క్రీమ్ అడిగితే కర్ర తీసుకుని కొడతానని అంటున్నాడు ఈ విషయం అమ్మకి చెప్తే అమ్మ కర్ర పట్టుకొస్తుందని భయపడుతుంది. అప్పుడే మధు వచ్చి ఐస్ క్రీమ్ ఇస్తాడు. చిన బావ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకుని పెద్ద బావ ఇచ్చాడని చెప్పాలని అనుకుంటుంది. మధు సంగీతకి లైన్ వేస్తాడు.

 

కృష్ణ మీరా ఇంటి ఓనర్ ని నాన్న అని పిలుస్తుంది. అది విని చాలా బాధేసింది. ఎవరు కొంచెం ప్రేమ చూపించినా కనెక్ట్ అయిపోతుంది. తనని మనలో ఒకరిగా చూసుకోవాలి. తనకి ఫోన్ కొనిద్దామని చెప్తుంది. అందుకు మురారి సరే అంటాడు. రేవతి భవానీతో ముకుంద పిండ ప్రదాన కార్యక్రమం గురించి మాట్లాడుతుంది.

తరువాయి భాగంలో..

ఇప్పుడే ముకుందకి పెద్ద ఖర్మ చేశాం. దాని పిండం ఒక్క కాకి కూడా ముట్టలేదు అనేసరికి మీరా కూలబడిపోతుంది. ముకుంద గుర్తుకు వచ్చిందని ఏడుస్తుంది. తన జ్ఞాపకాలు కూడా మర్చిపోవాలని భవానీ అంటుంది. ఏ బాధ లేకుండా ఎప్పటికీ గుర్తుంచుకునే దారి ఉందని చెప్పి మీరా పేరు ఇక నుంచి ముకుంద అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024