చంద్రబాబు అండ్ కో కుట్రలు చేసి పెన్షన్‌ను అడ్డుకోవడం దారుణం

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి

వృద్దులను మంచంపై పడుకోబెట్టి సచివాలయం వరకూ తీసుకెళ్ళే నిరసనకు మ‌ద్ద‌తు

నెల్లూరు: వయోభారం, అనారోగ్యం కారణంగా మంచానపడి లేవలేని స్థితిలో ఉన్న వృద్దులకు వలంటీర్ల ద్వారా వారి గడప ముందుకు వచ్చి పెన్షన్ ఇస్తుంటే ఓర్వలేని చంద్రబాబు అండ్ కో కుట్రలు చేసి పెన్షన్‌ను అడ్డుకోవడం దారుణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.  గ్రామ సచివాలయం వద్దకు వెళ్ళి పెన్షన్ తీసుకోలేని వృద్దులను మంచంపై పడుకోబెట్టి సచివాలయం వరకూ తీసుకెళ్ళే నిరసనకు  విజ‌య‌సాయిరెడ్డి మద్దతు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా వాస్తవం తెలుసుకుని కుట్రపూరితమైన చంద్రబాబు ఫిర్యాదులను  నమ్మకూడదని ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు. మీ పదవీకాంక్ష కోసం ఎంతమంది పెన్షనర్ల ప్రాణాలు బలి తీసుకుంటావు చంద్రబాబు…? అంటూ విజ‌య‌సాయిరెడ్డి నిల‌దీశారు.

దొంగ ఏడుపులు
వలంటీర్లపై నిమ్మగడ్డ రమేశ్ చౌదరితో ఎలక్షన్ కమిషన్‌కు కంప్లెయింట్ చేయించిన చంద్ర‌బాబు మళ్లీ దొంగ ఏడుపులు ఏడుస్తున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. వలంటీర్ల పేరు చెబితేనే ఆయనకు వెన్నులో వణుకు. ఐదు కోట్ల మంది ప్రజలు తిరస్కరించారు కాబట్టి వాళ్ల మీద కూడా పగ పెంచుకున్నారు. వృద్ధులు, వికలాంగులను ఎర్రని ఎండలో ఇళ్ల బయటకు నెట్టి శాడిస్టిక్ ఆనందం పొందుతున్నావు కదా బాబూ. వాళ్ల ఉసురు తప్పక తగులుతుంది. ఈ మూడు నెలలు పెన్షన్లు అందకపోతే చచ్చిపోతారా అంటున్నారట. ఇదే ఆఖరి ఎన్నిక అని అర్థమైందంటూ టీడీపీ నేత‌ల‌ను విజ‌యసాయిరెడ్డి హెచ్చ‌రించారు.

వసూళ్లలో ఈసారి పప్పు మాలోకం చక్రం తిప్పాడట..
 ఐదేళ్లు కష్టపడ్డవారికి కాకుండా డబ్బున్న బడాబాబులకు టికెట్లు అమ్ముకున్నారు చంద్రబాబు గారు. వసూళ్లలో ఈసారి పప్పు మాలోకం చక్రం తిప్పాడట అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. టికెట్ దొరక లేదని పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి, దిష్టిబొమ్మలు తగలబెట్టిన వారందరినీ అర్ధరాత్రి పిలిపించుకుని బుజ్జగిస్తున్నాడు. రెబెల్స్‌గా పోటీ చేయకుండా వాళ్ల రేంజిని బట్టి 2 నుంచి 10 కోట్లు ఇప్పిస్తున్నాడట. డబ్బు ముట్టనోళ్లకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల హామీ దొరికిందని కథలు చెబుతున్నారు. అసలు ఆ పార్టీ అధికారంలోకి వస్తే కదా ఏదైనా ఇవ్వడానికి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ముస్లిం మ‌త‌పెద్ద‌ల‌తో స‌మావేశం
ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులోని రామ్మూర్తి నగర్ క్యాంప్ ఆఫీసులో ఈరోజు ఉలేమాలతో (ముస్లిం మతపెద్దలు)  ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌మావేశం అయ్యారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ గారు, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఉలేమాల సమస్యలు తెలుసుకుని అండగా ఉంటామని వారికి విజ‌య‌సాయిరెడ్డి భరోసా ఇచ్చారు.

May be an image of 12 people and hospital

Best Web Hosting Provider In India 2024