వైయ‌స్ఆర్ సీపీలో చేరిన కాటంరెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి

Best Web Hosting Provider In India 2024

తిరుప‌తి: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీల‌క నేత కాటంరెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర‌లో భాగంగా ఎద్దల చెరువు వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్‌ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో వైయస్ఆర్ సీపీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి పోటీ చేశారు. 

సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…

ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరినీ కలవలేకోయాం అని బాధపడవద్దు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్‌ అని ప్రస్తావిస్తూ.. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుయజేస్తున్నాను.

6వ తేదీన కావలిలో “కావలి సిద్ధం” సభ కూడా మీ దగ్గరే జరుగుతుంది. మీ అందరినీ అప్పుడు వీలైనంతవరకు ఆ రోజు కలిపించమని విష్టుకు చెబుతున్నాను. ఎంతమందిని వీలైతే అంతమందిని కలిపిస్తాడు. ధన్యవాదాలు.

Best Web Hosting Provider In India 2024