Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారు
పెన్షన్ల కోసం ఇవాళ వృద్ధులు, వికలాంగులకు కష్టాలు పడుతున్నారు
ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత మరింత పెరిగిపోయింది
చంద్రబాబు స్వార్ధం తప్ప మరేమి చూసుకోలేదు
వాలంటీర్లను అడ్డుకొని ఇపుడు మాపైనే విమర్శలు చేస్తున్నారు
చంద్రబాబు కుట్రలను ప్రజలను అర్ధం చేసుకున్నారు
వాలంటీర్ వ్యవస్థను ఎవరూ ఏమీ చేయలేరు
జన్మభూమి కమిటీల అరాచకాలు ప్రజలకు గుర్తొచ్చాయి
మేం వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనుకోవట్లేదు : సజ్జల
తాడేపల్లి: వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఈ వ్యవస్థపై చంద్రబాబు తన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారన్నారు. వాలంటీర్లను తప్పించాలని లెటర్ పెట్టించింది చంద్రబాబే అని నొక్కి చెప్పారు. ఎల్లో బ్యాచ్ చర్యలతో పెన్షన్ల కోసం ఇవాళ వృద్ధులు, వికలాంగులకు కష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. చంద్రబాబు స్వార్ధం తప్ప మరేమి చూసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదు.ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. వలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?. చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయి. అందుకే టీడీపీ వాళ్లు మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో ఎవరైతే విమర్శలు చేశారో.. ఇవాళ వాళ్లే లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచొచ్చు కదా అని అంటున్నారు.
చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ రెండ్రోజుల్లో రుచి చూపించారు
గతంలో ఒకటో తేదీన వలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు రెండోరోజుకి 60 శాతం పంపిణీ మాత్రమే జరిగింది. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అని సజ్జల ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు. ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తోంది. ఆ విషయం చంద్రబాబుకి తెలుసుకాబట్టే మాపై ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదు. ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలన్నదే ఆలోచన. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ రెండ్రోజుల్లో రుచి చూపించారు. ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారు. అది రేపు ఎన్నికల్లో తెలుస్తోంది అని సజ్జల అన్నారు
.
జన్మభూమి కమిటీలు.. టీడీపీ జలగలతో ఉండేది.. ఇవాళ చంద్రబాబుకు పెన్షనర్లు శాపాలు పెడుతున్నారని తెలిపారు. సమాజంలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదన్న ఆయన.. ఇప్పుడు 60 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యిందన్నారు. రెండు మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి అవుతుందన్నారు. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో పెన్షన్ల పంపిణీ వ్యవహరంలో టీడీపీ మాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. చంద్రబాబు మీద ప్రజలు కోపంగా ఉన్నారు.. వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏమి చేయలేరన్నారు. 20 మంది అధికారులు వైయస్ఆర్సీపీ వాళ్లు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారట.. అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారులు వాళ్ల తోత్తులు అయ్యి ఉండాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
అధికారులను డీమోరలైజ్ చేసేందుకు తప్పుడు ఆరోపణలు
అధికారుల్లో వందశాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు ఉంటారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారుల్ని డీమోరలైజ్ చేసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని సభలో పోలీసుల పాత్ర తక్కువగా ఉంటుంది. చంద్రబాబు, పురందేశ్వరి వైఫల్యాన్ని రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారు. కూటమిలో ఉన్నారు కాబట్టే పైనుంచి ఒత్తిడి చేయించి మరీ అధికారుల్ని బదిలీ చేయించారు. మేం వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనుకోవట్లేదు. మేం ప్రజలనే నమ్ముకున్నాం. రేపు మేం గెలిచాక అధికారుల వల్లే గెలిచారు అని అనడానికి వాళ్లకు ఇప్పుడు లేకుండా పోయింది అని సజ్జల పేర్కొన్నారు.
టీడీపీ కూటమి ఈసీ మీద ఒత్తిడి చేస్తున్నారు.. వారు లొంగిపోతున్నారు అని ఆరోపించారు. అఖిల భారత అధికారుల బదిలీలకు ఈసీ కారణం చెప్పాల్సి ఉండేదన్నారు.. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన మాకు లేదన్నారు.
పవన్ కల్యాణ్‌ది ఒక రాజకీయ పార్టీనా? అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమికి చెప్పడానికి ఏమీ లేదు.. కూటమి ఇచ్చే హామీలు కూడా గట్టిగా చెప్పడం లేదు.. ఇప్పటికే కూటమి మునిగిపోయింది, దివాళా తీసిందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు.. ఐదేళ్లలో షర్మిల వివేకా హత్య గురించి మాట్లాడలేదు.. ఇప్పుడు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. షర్మిల, సునితతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు.. బాబు చేతిలో వారు పావులు అయ్యారు అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.