వంచన చేసే చంద్రబాబు పార్టీకి సమాధి కడ‌దాం

Best Web Hosting Provider In India 2024

మంచిచేసే జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం 

సూళ్ళూరుపేట వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కిలివేటి సంజీవయ్య 

తిరుప‌తి: వంచన చేసే చంద్రబాబు పార్టీకి సమాధి కట్టి..మంచిచేసే జగనన్న ప్రభుత్వాన్ని  మ‌ళ్లీ తెచ్చుకుందామ‌ని సూళ్ళూరుపేట వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. మేమంతా సిద్ధం బ‌స్ యాత్ర‌లో భాగంగా నాయుడుపేట‌లో ఏర్పాటు చేసిన బహిరంగ స‌భ‌లో ఎమ్మెల్యే సంజీవ‌య్య మాట్లాడారు.

ఎమ్మెల్యే సంజీవ‌య్య ఏమ‌న్నారంటే..

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, అంబేడ్కర్ కలలు కన్న సమ సమాజం, శ్రీశ్రీ వంటి కవులు కలలు కన్న మరో ప్రపంచం…ఈ కలలన్నీ నిజం చేస్తూ నవశకాన్ని నిర్మిస్తున్న నిర్మాత, సంక్షేమదాత, అభివృద్ధి ప్రదాత, యువత భవితను మార్చి రాస్తున్న విధాత, నా దైవం సీఎం వైయ‌స్‌ జగన్‌ గారికి నమస్కారం. 
తిరుపతి జిల్లా మేమంతా సిద్ధం సభకు స్వాగతం. 
జగనన్నా అంటే జనం
జగనన్న వెంటే ఈ జనం
ఆయన పిలుపు ఒక ప్రభంజనం
ఆయన పేరే ఒక రణ నినాదం
మన జగన్‌ నినాదంతో దిక్కులు పిక్కటిల్లాలి
శతృవుల గుండెల్లో భూకంపం పుట్టాలి
నాతో గొంతు కలిపి జైజగన్ అనండి.
జై జగన్ జై జగన్
ఒక పేద దళిత కుంటుంబంలో పుట్టి, సాధారణ ప్రభుత్వ ఉద్యోగినైన నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేని చేసారు. ఇప్పుడు మూడో సారి మీ సైనికుడిగా నన్ను పోటీలో నిలిపారు. అందుకు ధన్యవాదాలు. 
మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు వలలో, మగ్గాలో, మేకలో ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించామని గొప్పలు చెప్పుకున్న నాయకుల్ని చూసాం. 
ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అనే పెత్తందారీ వ్యవస్థకు మూలపురుషుడు చంద్రబాబును చూసాం. 
బీసీల తోకలు కత్తిరిస్తాం అనే చంద్రబాబు అహంకారాన్ని చూసాం.
నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మమ్మలన్ని అందరినీ ఆదరించి, మీ అందరి చేతుల్లో ఉండాల్సింది పనిముట్లు కాదు, రాజ్యాధికారం అని..మా వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను, మంత్రులను చేసి సామాజికసాధికారత కల్పించిన ఏకైక పాలకులు మీరే సార్. 

నన్నే తీసుకుంటే ఆలయ ప్రవేశంలేని సామాజిక వర్గం నాది. అలాంటిది టీటీడీ బోర్డులో నాకు చోటిచ్చిన గొప్ప నాయకులు మీరు. జగనన్న పాలనలో సామాజిక న్యాయానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇంత గొప్ప అవకాశాన్ని మీరు నాకు అందించినందుకు…జన్మ జన్మలకీ రుణపడే ఉంటాను. 
మా నియోజకవర్గంలో, మన ప్రభుత్వ హయాంలో,  మీసారధ్యంలో సుమారు 1400 కోట్లతో అభివృద్ధి పనులు చేసాం. 
2,400 కోట్లు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత మీకే దక్కింది. 
అందుకు ఈ సూళ్లూరుపేట ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటారు.
మాదో చిన్న విన్నపం…2024 లో మీరు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు..
అప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత – ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేందుకు, స్వర్ణముఖి నదిలో సబ్ సర్పేజ్ డ్యామ్‌లు, నాయుడుపేట నడిబొడ్డులో పోతునవెన్నువాను కాలువ ఆధునీకరణ, చెంబేడు రిజర్వాయిర్, తడలో మత్స్యకార సోదరులకు ఆశ్రమ పాఠశాల, ఎస్సీఎస్టీలకు ఆశ్రమ పాఠశాల నిర్మించాలని కోరుకుంటున్నాను. 
వంచన చేసే చంద్రబాబు పార్టీకి సమాధికట్టి
మంచిచేసే జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం
తిరుపతి జిల్లాలోని 7 నియోజక వర్గాలు, పార్లమెంట్ స్థానాలు గెలిపించి జగనన్నకు గిఫ్టుగా ఇచ్చి, 175కు 175 అనే జగనన్న టార్గెట్‌లో భాగస్వాములు అయ్యేందుకు మీరు సిద్ధమా…
అయితే మే నెల 13వ తారీకున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి, వేయించి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా గురుమూర్తి గారిని గెలిపించాలని అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను.
 

Best Web Hosting Provider In India 2024