Railway Jobs 2024 : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,113 ఖాళీలు – పరీక్ష లేకుండానే ఎంపిక, పూర్తి వివరాలివే

Best Web Hosting Provider In India 2024

South East Central Railway Recruitment 2024: సౌత్ ఈస్ట్ సెంట్రల్(South East Central Railway) రైల్వే(రాయ్‌పూర్‌) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్(Recruitment) విడుదలైంది. ఇందులో భాగంగా….1113 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… మే 01, 2024తో పూర్తి కానుంది. https://secr.indianrailways.gov.in/ వెబ్ సైట్ లోకి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు

  • ఖాళీల వివరాలు : డీఆర్ఎం ఆఫీస్, రాయ్ పూర్ డివిజన్ – 844 ఉద్యోగాలు
  • వ్యాగన్ రిపేర్ షాప్, రాయపూర్ – 269 ఉద్యోగాలు
  • అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 విద్యా విధానంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి . అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో I.T.I కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వయస్సు పరిమితి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: ఎంపిక విధానం చూస్తే… మెట్రిక్యులేషన్, ITI పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. డాక్యూమెంట్ వెరిఫికేషన్ సమయంలో మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థి SC/ST/OBC కమ్యూనిటీకి చెందినవారైతే… కుల ధ్రవీకరణపత్రాన్ని సమర్పించాలి.
  • ఎంపికైన అభ్యర్థులు సంవత్సరం పాటు అప్రెంటిస్ గా పని చేయాల్సి ఉంటుంది. రైల్వే బోర్డు నిర్ణయించిన ఆధారంగా… వేతనం చెల్లిస్తారు.
  • దరఖాస్తులు ప్రారంభం – ఏప్రిల్ 02, 2024.
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ – మే 01, 2024.
  • ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ – 7024149242
  • అధికారిక వెబ్ సైట్ – https://secr.indianrailways.gov.in/

కింద ఇచ్చిన పీడీఎఫ్ లో పూర్తి వివరాలను చూడొచ్చు….

Open PDF in New Window

WhatsApp channel

టాపిక్

South Central RailwayRailwayRecruitment
Source / Credits

Best Web Hosting Provider In India 2024