మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు

Best Web Hosting Provider In India 2024

విలువలను, విశ్వసనీయతలను గెలిపించడానికి మీరు సిద్ధమా?

పెద‌కూర‌పాడు ప్ర‌చార‌స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపే

గతంలో లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. 

రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం

2014లో ఇచ్చిన హామీల్లో చంద్ర‌బాబు ఒక్కటైనా అమలు చేశారా?

ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?

తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన

ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు

ఇంటింటికీ కేజీ బంగారం, ఇంటింటికీ బెంజికారు కొనిస్తాం అంటున్నాడు..నమ్ముతారా? 

పెదకూరపాడు :  మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు ను నిర్ణ‌యించ‌బోతుంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. విలువలను, విశ్వసనీయతలను గెలిపించడానికి మీరు సిద్ధమా? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని పాలనను 59 నెలల్లో చూశారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్ని కొనసాగింపు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపే అన్నారు. గతంలో లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామ‌ని సీఎం వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు.  శుక్రవారం  పల్నాడు జిల్లా పెదకూరపాడు క్రోసూరు సెంటర్‌లో బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.   

 ఈ సందర్భంగా బహిరంగ సభలో  ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏమన్నారంటే.::

సమయం 2.10.. ఎండాకాలం..మిట్టమధ్యాహ్నం అయినా కూడా ఏమాత్రం ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతో ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకూ,  ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ ముందుగా మీ బిడ్డ.. మీ వైయ‌స్ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. 

 ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు.
మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఈ ఎన్నికలు.నేను ప్రతిఒక్కరినీ కూడా గుర్తు గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు.. మళ్లీ మోసపోవడమే. ప్రతిఒక్కరినీ కూడా ఈ విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు చరిత్ర చెబుతున్న సత్యం ఇది అని గుర్తించమని కోరుకుంటున్నాను. సాధ్యాంకాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇది అన్నది ప్రతి ఒక్కరినీ ఆలోచించమని కోరుతున్నాను.

చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే.
చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని మళ్లీ నిద్రలేపడమే. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపితే ఏమవుతుంది? గతంలో జరిగినట్లు మళ్లీ ఇంటింటికీ లకలక లకలక అంటూ మీ రక్తం తాగేందుకు మళ్లీ వస్తుంది. ప్రతిఒక్కరినీ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని కోరుతున్నాను.

విలువలను, విశ్వసనీయతలను గెలిపించడానికి మీరు సిద్ధమా?

చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా?.
మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. దేవుడి దయతో మీరు నమ్మి మీ జగన్‌కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత ఐదేళ్లలో ప్రతిఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మక మార్పులు తీసుకునిరాగలిగాం. గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా, గతంలో మన రాష్ట్రంలో జరగనివిధంగా ఈ 59 నెలల కాలంలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు బటన్లు నొక్కిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగింది.

ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా ఈ 59 నెలలకాలంలోనే భర్తీ చేయడం జరిగింది. నా అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేశాం. వారి పేరుమీదనే అందులో ఏకంగా 22 లక్షల ఇళ్లుకూడా ఈ 59 నెలలకాలంలోనే కడుతున్నాం.  

గతంలో ఎప్పుడు కూడా జరగనివిధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు.. మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఒక బైబిల్ అని ఆ భగవద్గీతకు విశ్వసనీయత తెచ్చి ఏకంగా 99 శాతం అమలు జరిగింది కూడా మీ బిడ్డ కాలంలోనే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

లంచాలు, వివక్ష లేని పాలన కోసం.
అన్నిరకాలుగా ప్రభుత్వ బడులు మారాయి. పిల్లల చదువులు మారాయి. చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడనివిధంగా లంచాలు లేని వివక్ష లేని ఇంటివద్దకే పాలన, ఇంటివద్దకే అందిన పెన్షన్, ఇంటివద్దకే అందిన పౌర సేవలు, ఇంటివద్దకే అందిన పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే చేయిపట్టుకుని నడిపిస్తున్న వైద్యం, చేయిపట్టుకుని నడిపిస్తున్న వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని సామాజిక న్యాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని మహిళా సాధికారత.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవాళ నేను ఇప్పుడు చెబుతున్న ఈ మాటలు గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా కేవలం ఈ 59 నెలలకాలంలోనే మీ బిడ్డ పాలనలో జరిగిన మార్పులు.

ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని కోరుతున్నాను. ఇప్పుడు నేను గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా జరిగాయా?, ఎప్పుడైనా చూశారా? అని మీరే ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎప్పుడైనా మీరు చూశారా? పిల్లల చేతుల్లో ట్యాబులు, ఎప్పుడైనా మీరు చూశారా? పిల్లల చేతుల్లో విద్యాకానుక, ఎప్పుడైనా మీరు చూశారా? పిల్లలకు గోరుముద్ద, ఎప్పుడైనా మీరు చూశారా? తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, ఓ ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఓ రైతుభరోసా, ఓ ఉచిత పంటబీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఓ వాహనమిత్ర, ఓ నేతన్ననేస్తం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తం, 25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్యఆసరా, ఓ ఫ్యామిలీ డాక్టర్, ఓ ఆరోగ్య సురక్ష వంటి పథకాలు గతంలో మీరు చూశారా?.

వీటన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా? మీ గ్రామంలోనే ఓ గ్రామ సచివాలయం, మీ గ్రామంలోనే ఓ నాడు-నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి, మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే, మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మీ గ్రామంలోనే మహిళా పోలీస్.. ఇవన్నీ రావడమే కాకుండా చెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ నేను చెప్పినవన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా? మిమ్మల్నే అడుగుతున్నాను.

చంద్రబాబు మేనిఫెస్టో మోసాలు.
ప్రతిఒక్కరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించి గమనించమని కోరుతున్నాను. 2014లో ఒకసారి చంద్రబాబును నమ్మారు, ఆ కూటమిని నమ్మారు, వారి మేనిఫెస్టోను నమ్మారు, వారికి ఓటు వేశారు. మరి చంద్రబాబు నాయుడి గారి మేనిఫెస్టో మాయలు, మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఆ 2014లో ఏం చెప్పాడో? 2014 నుంచి 2019 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసం, ఎంతటి దగా చేశాడో మీరే చూడండని ఈ సందర్భంగా అడుగుతున్నాను. 

ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) అక్కా ఇది గుర్తుందా? అన్నా ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి 2014లో ఎన్నికలవేళ పంపించాడు. నేను మిమ్మల్నే అడుగుతున్నా. ఈ ముఖ్యమైన హామీలను ఈయన సంతకం పెట్టి పంపించిన హామీలను ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆయన చేశాడా అని అడుగుతున్నాను. మీరే సమాధానం చెప్పండని అడుగుతున్నాను. అప్పట్లో గుర్తున్నాయా? వారి ఈ హామీలను ఇవ్వడమే కాకుండా, వారు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపించడమే కాకుండా అప్పట్లో వారి ఈటీవీలో, వారి ఏబీఎన్‌లో, వారి టీవీ5లో అడ్వర్టైజ్‌ మెంట్‌లు ఊదరగొట్టారు గుర్తుందా?.

అప్పట్లో వారు చెప్పినమాటలు రైతురుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతున్నాను. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ఇందులో ముఖ్యమైన హామీ అంటూ.. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి పంపించిన ఈ ఫాంప్లెట్‌లో రెండోది.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను ప్రతి అక్కచెల్లెమ్మను, వారి కుటుంబాలను అడుగుతున్నా.. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయైనా రద్దు అయ్యిందా? అని అడుగుతున్నా. మూడో హామీ.. ఇవన్నీ ముఖ్యమైన హామీలు.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నాను.. మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా? అని అడుగుతున్నాను. 

నాలుగో హామీ.. ఇంటింటికీ ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెలా రూ.2,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఎవ్వరికైనా ఇచ్చాడా? రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు, చేనేత పవర్‌ లూమ్‌ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు.

ఇక్కడున్న ప్రజలందరినీ అడుగుతున్నా…మీలో ఎవ్వరికైనా ఒక్క సెంటు స్థలం అయినా చంద్రబాబు ఇచ్చాడా? విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు అన్నాడు, సింగపూరుకు మించి అభివృద్ధి అన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ అన్నాడు, పెదకూరపాడులో కనిపిస్తోందా? ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ఇంటింటికీ పంపిన వీటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా అని ప్రజలు చెప్పాలి. ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురూ మళ్లీ మేనిఫెస్టో అని, ఈసారి సూపర్‌ సిక్స్‌ అని, సూపర్‌ సెవెన్‌ అని అంటున్నాడు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం, ఇంటింటికీ బెంజికారు కొనిస్తాం అంటున్నాడు..నమ్ముతారా? ఇలాంటి అన్యాయమైన మోసాలతో, అబద్ధాలతో మనం యుద్ధం చేస్తున్నాం. 


పేదవాడి భవిష్యత్ మారాలంటే ఫ్యాను గుర్తుకే ఓటు
ఈ 59 నెలల్లో మీ జగన్‌ పాలన చూస్తున్నారు. మీ బిడ్డ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేసాడు. వాలంటీర్లు మీ ఇంటికి రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి చదువులు, బడులు, బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్‌ మెరుగుపడాలన్నా… రెండు ఓట్లు.. రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. ఇక్కడో అక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడుతున్న మన అభ్యర్ధులపై మీ చల్లని దీవెనులు అందించాలని కోరుతున్నాను. 

ఇంతటి ఎండలో కూడా చెరగని చిరునవ్వుతో ఆప్యాయత చూపుతున్న అందరికీ రెండు చేతులూ జోడించి, పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అంటూ సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

కార్యక్రమంలో పెదకూరపాడు  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్ధి నంబూరి శంకరరావు, నరసారావుపేట ఎంపీ అభ్యర్ధి పి అనిల్ కుమార్‌ పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024