మేలు చేసే ప్రభుత్వం మాది 

Best Web Hosting Provider In India 2024

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు 

విపక్షాల అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని మనవి 

వైయ‌స్ జ‌గ‌న్‌ భూములు లాక్కొంటాడని చేస్తున్న ప్రచారాలు అన్నీ  వాస్తవ దూరం అయినవే

వాటిలో నిజం లేదు. 30 లక్షల మంది పేదలకు పట్టాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది 

చంద్రబాబువి మతిలేని మాటలు..ఆయనొక చేతగాని దద్దమ్మ

ఎన్నికల ప్రచారంలో  ల‌బ్ధిదారులతో మంత్రి మమేకం 

శ్రీ‌కాకుళం:  రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి శ్రీకాకుళం శాసన సభకు పోటీ చేస్తున్న నన్నూ,శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను గెలిపించి,అత్యధిక మెజార్టీ అందించి ఆశీర్వదించాలని మంత్రి ధర్మాన కోరారు. 

 మండలంలోని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిలగాం – సింగువలసలో ఆయన మాట్లాడుతూ.. “ప్రభుత్వాలనేవి ప్రజల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడ్డాయా లేదా అన్నది చూడాలి. ఇతరత్రా చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని మన జీవితాలను బాగు చేస్తున్న ప్రభుత్వాలను వదులుకోకూ డదు. మార్చడం వలన ఏ కుటుంబం అవసరాలూ తీరవు. ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల వలన మన అవసరాలు తీరుతాయి. అభివృద్ధి లేదని కొన్ని విపక్ష శ్రేణులు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. మీ కళ్లెదుట ఉన్న స్కూలు ఎవరి వల్ల అభివృద్ధి చెందింది ? మీ ప్రాంతపు వ్యవసాయానికి నీరు ఎవరి వల్ల వచ్చింది ? మీ ఊళ్లో ఉన్న రైతు భరోసా కేంద్రం కానీ సెక్రటేరియెట్ కానీ ఎవరి వల్ల వచ్చింది. మీ కుటుంబ అవసరాలకు సరిపడిన డబ్బులు ఎవరి వల్ల వచ్చాయి.? మీ ఆరోగ్యాలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది ? మీకు అందించిన సరకులలో నాణ్యత ఎలా ఉంది ? ప్రభుత్వం అమలు చేస్తున్న అవినీతి ఏ మాత్రం ఉందా ? ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి.

మనం ఊరకనే ఇతరుల మాటలు నమ్మి మోసపోకూడదు అని కోరుతున్నాను. ఎంత దౌర్భాగ్యం అంటే ముఖ్యమంత్రి బొమ్మ పాసు పుస్తకం మీద ఉంది కనుక ఆ భూమిని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారని కొందరు చెబుతున్నారు. కారణం ఏంటంటే వాళ్లకు ఆరోపించడానికి ఏమీ లేదు. ఈ గ్రామంలో తెలుగుదేశానికి ఓట్లేస్తున్నారు కనుక మా వాళ్లకు పథకాలు అందలేదని చెప్పగలరా ? చెప్పలేరు. పథకాలు అమలు చేస్తున్నారు కనుక లంచాలు అడిగారు అని డబ్బులు తీసుకున్నారు అని చెప్పగలరా ? చెప్పలేరు. వ్యవసాయానికి సహాయం చేయలేదని చెప్పగలరా ? చెప్పలేరు. అలాంటప్పుడు ఏమౌతుంది అంటే ఏమీ చెప్పడానికి ఏమీ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కొంటారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు విపక్షానికి చెందిన నాయకులు. భూములు తీసుకునేవాళ్లయితే మీ దగ్గర నయా పైసా కూడా తీసుకోకుండా సర్వేలు చేయించి,హద్దు రాళ్లు పాతించి పాసు పుస్తకాలు అందించే పని చేస్తారా ? భూములు తీసుకునే వాడయితే 31లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు 12,800 కోట్లు ఖర్చు పెట్టి భూమి కొని, లే ఔట్లు వేసి ఇళ్ల పట్టాలు ఇస్తారా ? 
ఎప్పుడో 75 ఏళ్ళ  కిందట ఇచ్చిన భూమికి పూర్తి హక్కులు రాలేదని అసైన్డ్ ల్యాండ్స్ కు పూర్తి హక్కులు బీదలకు ఇస్తారా ? చెప్పేవాటికి అర్థం ఉండాలి. లేదంటే పిచ్చివాళ్లయి వాగుతుండాలి. లేదా ఏమీ తెలియని అమాయకత్వంతో అయినా మాట్లాడాలి. భూమిని తీసుకునే అర్హత ఎవ్వరికైనా ఉంటుందా ? అసలు భూమి ప్రభుత్వ పరంగా తీసుకుంటే 2013లో చేసిన పార్లమెంట్ యాక్ట్ ప్రకారం తీసుకోవచ్చా లేదా అన్నది చూడాలి. ఆ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. నష్ట పరిహారం ఎంత రెండున్నర రెట్లు ఖరీదు ఇచ్చి తీసుకోవాలి. అదే కాని ఆ భూమి తప్ప ఏ భూమి రైతుకు లేకపోతే ప్రభుత్వం కూడా తీసుకునేందు కు లేదు. జగన్మోహన్ రెడ్డే కాదు ఎవ్వరూ తీసుకునేందుకు వీల్లేదు. ఇది చట్టం. మళ్లీ అధికారంలోకి జగన్ వస్తే భూములు తీసుకుంటారు అనే మాట  ఎంత దిక్కులేనటువంటి వ్యక్తులు చెబుతారో అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. 

అబద్ధాలు చెప్పి ఓట్లేసి గెలిపించాక ఆ రోజు చంద్రబాబు చెప్పిన ఆ మాటలు మరిచిపోయి మోసం చేసి,మళ్లీ అదే వ్యక్తి  ఇప్పుడు తనకు ఓట్లు వేయాలని అడుగుతున్నాడు. అసలు చంద్రబాబు ఎక్కడున్నాడని ? చంద్రబాబు ఎక్కడ నివాసం ఉంటున్నాడని ? హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అతనికేం పని ఈ రాష్ట్రంలో.. చల్లగా ఉంటుందని వ్యాపారాలు బాగుంటాయి అని హైద్రాబాద్ లో నీ కుటుంబాన్ని పెట్టుకుంటావు. మాకేమో రాజకీయాలు చెప్పావా ? ఈ జిల్లాకు ఏం చేశావో చెప్పగలవా ? 14 ఏళ్ల కాల వ్యవధిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటయినా తీసుకుని వచ్చారని చెప్పగలవా ? మేం చెబుతాం. వంశధార ప్రాజెక్టు అని చెబుతాం. తోటపల్లి ప్రాజెక్టు అని చెబుతాం. మన రిమ్స్ ఆస్పత్రి అని చెబుతాం. మన రిమ్స్ మెడికల్ కాలేజీ అని చెబుతాం. మన  మార్కెట్ అని చెబుతాం. ఉద్దానంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్రాజెక్టు అని చెబుతాం. మూలపేట పోర్టు అని చెబుతాం. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ అని చెబుతాం. ఒక్కటేంటి ఎన్నో చెబుతాం. మీరు చెప్పండి అలా ఏమయినా ఒక్కటైనా చెప్పండి. విభజన తరువాత పరిహారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు ఇస్తే ఒక్క సంస్థైనా ఇక్కడ పెట్టలేదు కానీ ఇవాళ మాకే ఓట్లేయండని ఎలా అడుగుతారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. వచ్చే సంవత్సరం మీ అందరికీ శుభవార్త ఏంటంటే.. గొట్టా బ్యారేజీ దగ్గర లిఫ్టు పెట్టి రిజర్వాయర్ నింపి ఇలాంటి మండు వేసవిలో కూడా మీ గ్రామానికి వంశధార నీరు తీసుకు వస్తామని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. మీ అకౌంట్లలో ఐదు సంవత్సరాలలో తూచ తప్పక పడింది. ఇక్కడున్న మహిళలందరికీ చెబుతున్నాను. పొరపాటున ఈ ప్రభుత్వాన్ని వదులుకున్నారో ఆ రోజు నుంచే ఇవన్నీ ఆగిపోతాయి అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతకుముందు అనుభవం కూడా ఇదే. అతను ఇవన్నీ తప్పని చెబుతున్నాడు. అతడు ఇవన్నీ చేయకుండా ఎగొట్టాలని చూస్తున్నాడు. అందుకే చంద్రబాబు మాట విని మోస పోకుండా జాగ్రత్తపడమని చెబుతున్నాను.

వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీని మీ కోసం గెలిపించుకోండి 
తొలుత ఆయన అలికాం గ్రామంలో మంత్రి ధర్మాన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలికాం గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశాం. పొందర్లకు మేలు చేసిన ప్రభుత్వం ఇది. ఆ రోజు కూడా వైఎస్సార్ హయాంలో ఈ కులానికి మేలు చేశాం. అప్పుడు కృతజ్ఞతలు చెప్పేందుకు ఇక్కడి పొంద ర్లంతా వైఎస్సార్ ను కలిశారు. ఆ రోజు వైఎస్సార్ ఏమన్నారంటే..మీ కష్టాలను ధర్మానే నాకు చెప్పారు. మీరు ధర్మానకే కృతజ్ఞతలు చెప్పాలి అని అన్నారు ఆ రోజు వైఎస్సార్. మిమ్మల్ని ఆ విధంగా ఆ రోజు బీసీలలో చేర్చారు. ఆ వేళ ఈ గ్రామానికి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ ఇవాళ కొందరు పొందర్లు నాకు వ్యతిరేకంగా ఉన్నారని చాలా మంది అంటున్నారు. న్యాయమేనా అడుగుతు న్నాను. నేను ప్రతినిధిగా ఉంటే మీకు నష్టం జరుగుతుందని అనుకుంటున్నారా మీకు ప్రయోజనం లేదని అనుకుంటున్నారా ? మీరు ఇది తెలిసే చేస్తున్నారా ? లేదా తెలియక చేస్తున్నారా ? 

ఈ ఊళ్లో చదువుకుంటున్న పిల్లలయినా మీ తల్లిదండ్రులకు చెప్పాలని కోరుకుంటున్నాను. విమర్శించడం రాజకీయాలలో  విధానాల వరకూ విమర్శించండి పర్వాలేదు. వ్యక్తులను విమర్శించే పద్ధతి మంచిది కాదని మనవి చేస్తున్నాను. ఈ గ్రామానికి ఏం చేయలేదని విమర్శిస్తున్నారు. ఇప్పుడే ఇక్కడున్న స్థానిక నాయకులు చెప్పారు.  ఈ గ్రామానికి తాగు,సాగు నీరు ఇచ్చాం. కొంతమందికి పట్టాలు ఇచ్చాం. అన్ని కార్యక్రమాలూ చేశాం. ఇవాళ ప్రతి ఇంటికీ సహాయం అందేవిధంగా చేశాం. అందువల్ల ఈ గ్రామం అంటే నాకెటువంటి వ్యతిరేకత లేదు. ఇక్కడున్నటు వంటి కొందరు పక్కనున్న ఎగ్రికల్చర్ కాలేజీ లో పనిచేస్తున్నారు. వారి వేతనాలకు సంబంధించి టైం స్కేల్ ఫిక్స్ చేయలేదంటే సంబంధిత అధికారులతో మాట్లాడి,వారందరి సమస్యను తీర్చాను. టైం స్కేల్ ఫిక్స్ చేయించాను. వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాను. ఏ కార్యక్రమం మీకు సంబంధించింది నేను కాదన్నాను. వంశధార నీరు ఈ పొలాలన్నింటికీ చేరే విధంగా చేస్తే ఈ ప్రాంత రైతుల స్థితి గతులు అన్నవి పెరిగాయి. 2004 కు ముందు నేనిక్కడికి వచ్చేటప్పటికీ ఈ గ్రామంలో పురిపాకలు ఉండేవి. కానీ ఇప్పుడు అందమయిన భవంతులు వచ్చాయి. అందుకు కారణంగా వంశధార నీరు రావడం వల్ల.. గడిచిన పదిహేనుళ్లుగా వంశధార నీరు రావడం వల్ల ఈ ప్రభావం. తదనుగుణంగా మీ జీవన స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. ఈ మాట ఇప్పుడే కాదు అప్పుడే చెప్పాను. మళ్లీ ఇప్పుడు చెబుతున్నాను వచ్చే సంవత్సరానికి వంశధార రిజర్వాయర్ నింపడానికి గొట్టా బ్యారేజీ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి, వేసవిలో కూడా అలికాం గ్రామంలో నీరు ప్రవహింపజేసేందుకు,తియ్యటి వంశధార నీటిని మీకు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. 

ఇవాళ మీ కుటుంబాలు అన్నీ సంతోషంగా ఉండేందుకు కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకోసం మీరందరూ పెద్ద మనసుతో వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీని మీ కోసం గెలిపించుకోండి.  ప్రభుత్వం లేకపోతే మరుసటి రోజు నుంచే మీకు అందుతున్న తాయిలాలు అన్నీ,మీకు అందుతున్న సౌకర్యాలు అన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు అందుకు సిద్ధంగా ఉన్నాడని,సంక్షేమ పథకాల నిలుపుదలకు సిద్ధంగా ఉన్నాడని, పేదలకు వ్యతిరేకంగా చంద్రబాబు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
12:

Best Web Hosting Provider In India 2024