Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్..దీప, కార్తీక్ కి అక్రమ సంబంధం అంట గట్టిన నరసింహ..ప్లేటు ఫిరాయించిన అనసూయ

Best Web Hosting Provider In India 2024

Karthika deepam 2 serial today may 4th episode: ఊరు వెళ్తున్న ఆడవాళ్ళని వెనక్కి తీసుకొచ్చి బాధ్యత కూడా తీసుకున్నారట వెరీ గుడ్ అంటూ శ్రీధర్ కార్తీక్ ని వెటకారంగా అడుగుతాడు. నీకు ఉన్న పనులు చాలవన్నట్టు ఇవన్నీ ఎందుకని కాంచన కూడా అంటుంది.

కేసు పెడతానన్న సుమిత్ర

మానవత్వం కింద అలా చేశానని కార్తీక్ చెప్తాడు. సుమిత్ర దీప మీద చాలా కోపంగా ఉంటుంది. నీకు ఇంత అన్యాయం జరిగితే నాకు ఎందుకు చెప్పలేదని తిట్టాలా? లేదంటే నేను నిన్ను కూతురిలా చూసుకుంటున్నా నన్ను నువ్వు పరాయి దానిలా చూస్తున్నావని బాధపడాలా? అంటుంది.

కావాలనే చెప్పలేదని దీప అంటుంది. నన్ను వెనక్కి తీసుకురాకపోయి ఉంటే ఈపాటికి మా ఇంట్లో ఉండేదాన్ని. నా పాత జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టేదాన్ని. ఇక నా బిడ్డ గురించి తప్ప నా గురించి నాకు ఏ ఆశలు లేవని దీప బాధగా అంటుంది.

సుమిత్ర నరసింహని తిడుతుంది. నా కొడుకు మీకు కూడా తెలుసా అనసూయ అంటుంది. తెలుసు ఊరికి వెళ్లకపోతే చంపుతానని బెదిరించాడు. ఆరోజే అడిగాను చెప్పి ఉంటే వాడి మీద పోలీసు కేసు పెట్టి జైలులో కూర్చోబెట్టేదాన్ని. ఇప్పుడు మాత్రం వదులుతానని అనుకుంటున్నావా పోలీసులకు చెప్పి చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తానని సుమిత్ర అంటుంది.

కోడలికి న్యాయం చేస్తానన్న అనసూయ

అంత పని చేయవద్దని అనసూయ బతిమలాడుతుంది. పోలీస్ కేసు పెడితే వీళ్ళ బతుకులు వీధిన పడటం తప్ప ఏం ఉండదు. దీపకు న్యాయం నేను చేస్తాను. వాడి దగ్గరకు వెళ్ళి రెండు చెంపలు వాయించి బుద్ధి చెప్తానని అనసూయ అంటుంది. చెప్తే వినే పరిస్థితిలో లేడని దీప అంటుంది.

వినకపోతే నేనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నా కోడలికి అన్యాయం చేశాడని కేసు పెడతానని అనసూయ ఆవేశంగా చెప్తుంది. మీరు గట్టిగా నిలబడితే దీప జీవితానికి న్యాయం జరుగుతుందని సుమిత్ర అంటుంది. దీప నా కోడలే కాదు నా తమ్ముడి కూతురు కూడా. వాడే బతికి ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? నేను అదే పని చేస్తానని అంటుంది.

తల్లిని చూసి పారిపోయిన నరసింహ

దీపకు నేనున్నానని సుమిత్ర ధైర్యం చెప్తుంది. శోభ నరసింహని మళ్ళీ తిట్టడం మొదలుపెడుతుంది. దీపని పంపించిన తర్వాత ఏదైనా అంటూ తిడుతుంది. దీని నోరు మూయించాలంటే దాన్ని ఊరు పంపించాలి. ఈరోజు దాని కథ ఏంటో తేల్చాలని అనుకుంటాడు.

అప్పుడే దీప నరసింహ ఇంటికి రావడం చూస్తాడు. నీకు రెండు తగిలిస్తే నేనంటే భయం వస్తుందని అనుకుంటాడు. దీప వస్తుంటే కర్ర పట్టుకుని రావే అంటాడు. వెనుక అనసూయ రావడం చూసి బిత్తరపోతాడు. అమ్మకి దొరికితే చచ్చానే అని ఇంట్లోకి పారిపోయి తలుపు వేసుకుంటాడు.

అనసూయ ఒక్క దెబ్బతో డోర్ తోసేస్తుంది. కొట్టబోతుంటే కొట్టకు అని కాళ్ళు పట్టుకుంటాడు. ఊర్లో అప్పులు చేసి వచ్చి ఇక్కడ అడ్డమైన వాళ్ళతో కులుకుతున్నావా అని తిడుతుంది. ఎవతివే నోటికొచ్చినట్టు వాగుతున్నావని శోభ వస్తుంది.

నీ కొడుకు అబద్ధాలు చెప్పాడు

మల్లెపందిరికి చీర కట్టినట్టు బాగానే ఉన్నావ్ రా అని తిడుతుంది. నీ మొగుడు నీ మాట వినడం లేదని అత్తని తీసుకొచ్చావా అని శోభ దీపని అంటుంది. నీ కొడుకు నాకు తాళి కట్టాడని శోభ చెప్తుంది. పెళ్లై కూతురు ఉన్న దాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా అని అనసూయ తిడుతుంది.

ఆ మాట అడగాల్సింది నన్ను కాదు నీ కొడుకుని. నాకు ఎన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నావో చెప్పు అంటుంది. నరసింహ నసుగుతుంటే శోభ అరుస్తుంది. నువ్వు లేకపోతే చస్తానని నీ కొడుకు నా వెంట పడ్డాడు. తల్లిదండ్రులు లేరు చచ్చారని చెప్పాడని అంటుంది.

దీప మంచిది కాదు

అప్పుల వాళ్ళని మాకు తగిలించి నువ్వు దీన్ని తగులుకున్నావా? ఇప్పుడు దీపకు ఏం సమాధానం చెప్తావని అనసూయ నిలదీస్తుంది. వద్దనే కదా వదిలేసి వచ్చిందని చెప్తాడు. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అంటుంది. నీ గోల పడలేక చేసుకున్నాను.

దీప తప్పులు చేసింది అందుకే కాపురం చేయలేక వదిలేశాను. దీప మంచిది కాదమ్మ. అది దర్జాగా ఇంకొకడితో తిరుగుతుంది. ఇలాంటి వాడిని చెప్పు తీసుకుని కొట్టాలని దీప అంటుంది. నోటికొచ్చినట్టు వాగితే నేను కొడతానని అంటుంది.

నేను తప్పు చేశాను కాదనడం లేదు. రెండు మూడు నెలల్లో ఊరు వచ్చి అప్పులు తీరుద్దామని అనుకున్నాను. జరిగింది చెప్పి ఊరు వెళ్లిపొమ్మని చేతులు పట్టుకుని బతిమలాడాను. నాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. నాకు ఆ తర్వాత తెలిసింది దీప ఎవరో డబ్బున్న వాడిని తగులుకుందని.

ఎవడితోనే తిరుగుతుంది

సంబంధం అంట గడితే చెప్పు తీసుకుని కొడతానని దీప తిడుతుంది. ఈ ఊర్లో బాగా డబ్బున్న వాడు ఉన్నాడు వాడితో కారులో తిరగడం నేను చూశానని అంటాడు. అనసూయ కార్తీక్ ని గుర్తు చేసుకుంటుంది. ఊరికి పోకుండా నీకు ఇవేం పనులు అంటే వాడితో నన్ను కొట్టించింది కావాలంటే అడుగు అంటాడు.

ఎందుకు కొట్టాడో నీ కొడుకుని అడగమని అంటుంది. ఇదంటే ఇష్టం ఉండబట్టే కదా నన్ను కొట్టడాని అంటాడు. వాడు నా కొడుకుని కొట్టాడా లేదా అని అనసూయ అడిగితే కొట్టాడని దీప చెప్తుంది. ఊరు పోకుండా వాడి ఇంట్లోనే చేరింది. బాధగా ఉండి వెళ్ళి ఊరి వెళ్ళమని అంటే అక్కడ కూడా ఒక పెద్దావిడతో నన్ను కొట్టించిందని చెప్తాడు.

మాట మార్చేసిన అనసూయ

జరిగింది ఇదైతే నాకు ఏం చెప్పావ్ దాన్ని బెదిరించానని కాకమ్మ కబుర్లు చెప్తావా అని శోభ తిడుతుంది. మా అమ్మ వీడితో పెళ్లి చేసి కోటి రూపాయలు ఇల్లు ఇచ్చింది. పది లక్షలు పెట్టి టాక్సీ కొనిచ్చింది. పది లక్షలు పెట్టి నగలు కూడా కొనిచ్చింది అంటుంది. అనసూయ వెంటనే దాని దగ్గరకు వెళ్ళి ప్రేమగా మాట్లాడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024