Kannappa: కన్నప్పలో ముగిసిన అక్షయ్ కుమార్ పార్ట్.. మిగిలింది ప్రభాస్? చాలా నేర్చుకున్నానంటూ మంచు విష్ణు

Best Web Hosting Provider In India 2024

Manchu Vishnu Kannappa Akshay Kumar: టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో కలెక్షన్ కింగ్ డా.మోహన బాబు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పాపులర్ యాక్టర్ శరత్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కామెడీ కింగ్ బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు.

రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా కన్నప్ప మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పంచుకున్నారు.

“అక్షయ్‌కుమార్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నో సార్లు కలవాలని కోరుకుంటున్నాను” అని మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో (గతంలో ట్విట్టర్) పోస్ట్ చేశారు. అక్షయ్ కుమార్‌తో కలిసి దిగిన ఫొటోను సైతం మంచు విష్ణు పంచుకున్నారు. విష్ణు మంచు చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అక్షయ్ కుమార్ పాత్ర షూటింగ్ పూర్తి కావడంతో నెక్ట్స్ ప్రభాస్‌తో షూటింగా అని నెటిజన్స్, ఫ్యాన్స్ అడుగుతున్నారు. మరి చూడాలి నెక్ట్స్ ఎవరితో షూటింగ్ ఉంటుందనేది కాగా, మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేసిన కన్నప్ప ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది.

కన్నప్ప” సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు.

మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను మరింత పెంచనున్నారు. ఇదిలా ఉంటే, సినిమాలతో ఎంటర్టేన్ చేస్తున్న మంచు విష్ణు చివరిగా జిన్నా మూవీతో అలరించాడు.

జిన్నా మూవీలో హాట్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్, శృంగార తార సన్నీ లియోన్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మంచు విష్ణు కెరీర్‌లో ప్రతిష్టాత్మక చిత్రంగా వస్తోంది కన్నప్ప. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకుంది.

అనంతరం కొద్ది రోజులకు కన్నప్ప సినిమాలో హీరోయిన్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన మోడల్ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్నో అడ్వర్టైజ్‌మెంట్స్ చేసిన ప్రీతి ముకుందన్ కన్నప్ప మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఇక బాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అక్షయ్ కుమార్. వరుసగా ఫ్లాప్స్ చూసిన అతని క్రేజ్ తగ్గట్లేదు. ఇటీవలే బడే మియా చోటా మియా సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్నాడు. అంతకుముందు కాంట్రవర్సీ చిత్రంగా వచ్చిన ఓ మై గాడ్ 2 మంచి హిట్ అందుకుంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024