Brahmamudi May 4th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ- నిజం రాబట్టిన కావ్య- అత్త దగ్గర కోటి కొట్టేసిన స్వప్న

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రుద్రాణి, రాహుల్‌పై స్వప్న రివేంజ్ ప్లాన్ వేస్తుంది. తాగిన వాళ్లతో కలిసి రూమ్‌లో డ్యాన్స్ చేస్తుంది. ఆస్తి దక్కిందని, స్వప్న త్వరలో ఇంట్లోంచి వెళ్లిపోతుందని సంతోషంగా మై మరిచిపోయి డ్యాన్స్ చేస్తుంటారు రాహుల్, రుద్రాణి. ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్లిద్దరిని విడిపించుకున్న స్వప్న వాళ్లు తాగే మందు గ్లాస్‌లో ఏదో పౌడర్ కలుపుతుంది.

రాహుల్ చెంపపై కొట్టి

రుద్రాణి, రాహుల్ మాత్రం సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటారు. పౌడర్ కలిపిన గ్లాస్‌లో మరింత డ్రింక్ కలిపి రుద్రాణి, రాహుల్‌కు ఇస్తుంది స్వప్న. దాన్ని వాళ్లు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అనంతరం పౌడర్ మొత్తాన్ని మందు బాటిల్‌లో కలిపి వాళ్లకు పోస్తూ ఉంటుంది స్వప్న. అది చూసి స్వప్నకు రుద్రాణి ముద్దు పెడుతుంది. మరి నాకు అని రాహుల్ అంటే చెంపపై ఒక్కటి కొడుతుంది స్వప్న. దాంతో రాహుల్ షాక్ అయి చూస్తాడు.

దాన్ని కవర్ చేసేందుకు అబ్బనీ తీయని దెబ్బ అని పాట పడి మళ్లీ ఎంజాయ్ మూడ్‌లోకి తీసుకొస్తుంది స్వప్న. మెల్లిగా మాటల్లోకి దించి తనను ఎలా మోసం చేశారో వాళ్లతోనే చెప్పిస్తుంది స్వప్న. మరి ఆ డబ్బు కొట్టేసి ఏం లాభం. ఎక్కడో పెట్టారో ఏమో. ఎలుకలు కొట్టేస్తాయి అని స్వప్న అంటుంది. స్టుపిడ్.. ఆ డబ్బును జాగ్రత్తగా నా లాకర్‌లో పెట్టి కీ నా పాకెట్‌లో పెట్టుకున్నాను. ఇదిగో చూడు అని చెప్పిన రుద్రాణి పాకెట్ నుంచి కీ తీసి స్వప్నకు ఇస్తుంది.

తన్నుకుని చావండి

తర్వాత మత్తుగా రుద్రాణి బెడ్‌పై పడిపోతుంది. రాహుల్ కూడా మమ్మీ.. ఐ లవ్ యూ అంటూ బెడ్‌పై పడిపోయి అరుస్తాడు. దొంగ మొహాలు నాతోనే తాగించి మోసం చేస్తారా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి అని స్వప్న లాకర్ తెరిచి డబ్బు చూస్తుంది. పిచ్చత్తా మీ వెలితే మీ కన్నే పొడిచాను. మీకు కోటి రూపాయల అప్పు ఇస్తున్నాను. మీరు మీకు అప్పు ఇచ్చినవాడు తన్నుకుని చావండి అని తాళాన్ని మళ్లీ రుద్రాణి పాకెట్‌లో పెట్టి వెళ్లిపోతుంది స్వప్న.

మరుసటి రోజు ఉదయం అప్పు, కావ్య కాల్ చేసుకుని బయలుదేరుతారు. అమ్మకు విషయం చెప్పకని, తెలిస్తే పెద్ద గొడవ చేస్తుందని కావ్య అంటుంది. సరే అని అప్పు బయలుదేరుతుంది. మరోవైపు హాల్లో అంతా ఉంటారు. వడ్డీ వ్యాపారి అయ్యా అనుకుంటూ వచ్చి సీతారామయ్య కాళ్లపై పడిపోతాడు. ఏంటీ వీడు ముందే వచ్చాడు. బుక్ చేసి పోతాడో ఏంటీ అని తల్లీకొడుకులు భయపడిపోతారు. వడ్డీ వ్యాపారిని అలా చూసి అంతా లేచి నిల్చుంటారు.

స్వప్న పుణ్యాత్మురాలు

రాహుల్ వచ్చి నీ డబ్బు నీకు ఇస్తామని చెప్పాం కదా అని అంటే.. ఛీ పాపాత్ముడా.. ముందు ఆ పుణ్యాత్మురాలిని పిలు. ఎవరు బాధపడితే మాతాజీ ఊరుకోదో.. మాతాజీకి పరమ భక్తురాలు. ఆ స్వప్నను పిలవండి. నా పాపాన్ని కడిగేసుకుంటాను అని వడ్డీ వ్యాపారి అంటాడు. ఆ స్వప్న ఏంటీ పుణ్యాత్మురాలు అని రుద్రాణి అంటే.. స్వప్న ఎంట్రీ ఇచ్చి.. నేను కాకుంటే నువ్వా అని అంటుంది. స్వప్న దగ్గరికి పరుగెత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ధన్యుడను అంటూ పొగుడుతుంటాడు.

నిన్నే నువ్వే వచ్చి అప్పు అన్నావ్. ఇప్పుడేంటీ భజన చేస్తున్నావ్ అని అపర్ణ అంటుంది. అప్పు లేదు సొప్పు లేదు. నాకు బుద్ధి వచ్చింది. మీరు ఏ అప్పు చేయలేదు. మీ పేపర్స్ మీరు తీసుకోండి. నేను పెట్టిన సంతకం లేదు. చింతకాయ లేదు అని వడ్డీ వ్యాపారి అంటాడు. రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. మీరు పేపర్స్ తీసుకోండి చాలు. వారం వారం వచ్చి మీ కాళ్లకు నమస్కరిస్తాను. నన్ను దీవిస్తే చాలు అని వడ్డీ వ్యాపారి అంటాడు.

దొంగ వెధవలు వస్తారు

నాకు అవసరం లేదు. నేను అప్పు తీసుకున్నాను అన్నావ్. సంతకం చూపించావ్. ఇప్పుడు నాపై పడ్డ మచ్చ ఎలా పోతుంది. ఇంట్లో ఉండాల్సిన పత్రాలు మీకు ఎలా వచ్చాయి. నా సంతకం ఎలా వచ్చింది అని స్వప్న అడుగుతుంది. దాంతో రాహుల్‌ను చూసి నీళ్లు నములుతాడు వడ్డీ వ్యాపారి. చెప్పకు అని సైగ చేస్తాడు రాహుల్. నా దగ్గరికి దొంగ వెధవలు చాలా మంది వస్తారు. వాళ్లు సంతకం ఫోర్జరీ కూడా చేస్తారు. నేను ఆస్తి లాక్కునేందుకు ఇలా దరిద్రపుగొట్టు పనులు చేస్తాను అని వడ్డీ వ్యాపారి అంటాడు.

పేపర్స్ తీసుకోమ్మని స్వప్న చేతిలో పెడతాడు. నువ్ అప్పు చేయలేదంటున్నాడు కదా ఇంకెందుకు బెట్టు చేస్తున్నావ్ తీసుకో అని రుద్రాణి, రాహుల్ అంటారు. వీన్ని నువ్ క్షమించేసేయ్.. కానీ, నేను క్షమించను. పోలీసులకు పట్టిస్తాను అని రాహుల్ అంటాడు. దానికన్న ముందు ఇంటి దొంగ ఎవడో చెప్పాలి కదా అని ప్రకాశం అంటాడు. ప్రకాశం అడుగుతుంటే.. నేను పోలీసులతో చెప్పిస్తాను కదా అని వడ్డీ వ్యాపారిని లాక్కెళ్తాడు రాహుల్.

వడ్డీ వ్యాపారి వార్నింగ్

రేయ్ ఏంట్రా ప్లాన్ రివర్స్ చేశావ్ అని రాహుల్ అంటే.. ఆ పరమ భక్తురాలు నీకు భార్యగా దొరకండ నీ అదృష్టం. రోజు పాలాభిషేకం చేసిన నీ పాపం పోదు. రెండు రోజుల్లో నా అప్పు నాకు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇంటి దొంగ నువ్వేనని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. స్వప్న గనుక నీ గురించి మాతాజికి మొక్కుకుంటే త్రిశూలంతో చంపేస్తుందిరా అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోతాడు వడ్డీ వ్యాపారి.

అప్పు చెప్పిన అడ్రస్‌కు కావ్య వెళ్తుంది. అప్పు కూడా పోలీసులతో అటోలో వస్తుంది. అప్పును పక్కకు తీసుకెళ్లి ఏంటిది పోలీసులను తీసుకొస్తావా అని కావ్య అరుస్తుంది, నానా మాటలు అంటుంది. ఆపుతావా. వాళ్లేం నిజమైన పోలీసులు కాదు. సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్‌లు. బిల్డప్ ఉంటుందని పోలీస్ డ్రెస్ వేసి తీసుకొచ్చాం అని అప్పు చెబుతుంది. వాళ్లు కూడా పర్ఫామెన్స్‌తో చంపేస్తామని చెబుతారు. సీన్ చెప్పండి అల్లుకుపోతాం అని నకిలీ పోలీసులు అంటారు.

ఎన్ కౌంటర్ చేస్తాం

కావ్య ఇది వర్కౌట్ అయ్యేలా లేదంటే.. అక్కా భయపడకు. వాడిని భయపెట్టాలంటే వీళ్లు ఉండాల్సిందే అని అప్పు అంటుంది. రాజ్ పది లక్షలు ఇచ్చిన వ్యక్తిని భయపెడతారు కావ్య, పోలీసులు. దాంతో వీళ్లు పోలీసులకంటే పెద్ద ఆఫీసర్స్ లా ఉన్నారని అతను భయడిపోతాడు. రాజ్ సర్ మీకు ఎందుకు అంత డబ్బు ఇచ్చాడు అని కావ్య అడుగుతుంది. చెబితే సార్ చంపేస్తారని అతను అంటే.. లేకుంటే మేము చంపేస్తాం. మేము చేస్తే ఎన్ కౌంటర్ అంటారు అని పోలీసులు అంటారు.

రాజ్ సర్‌కు తెలిసిలేపే పారిపోండి అని కావ్య అంటుంది. ఈ ఐడియా బాగుందని అతను చెబుతాడు ఫిబ్రవరి 18న రాజ్ సర్ వచ్చాడని అతను చెబితే.. అంటే మా పెళ్లి రోజు అని అప్పుతో కావ్య అంటుంది. మాయ అనే ఒక ఆవిడ తన బాబును రెండు గంటలు మా కేర్ సెంటర్‌లో పెట్టేందుకు వచ్చేది. కానీ, ఆరోజు బాగా ఆలస్యంగా వచ్చింది. బాబును తీసుకుని బయటకు వెళ్లింది. నా పని ముగించుకుని నేను వెళ్లేసరికి రాజ్, మాయ మాట్లాడుకుంటున్నారు అని అతను చెబుతాడు.

అనుమానం వచ్చి

వాళ్లను చూడగానే నాకు అనుమానం వచ్చి వినడం మొదలు పెట్టాను అని అతను చెబుతాడు. ఏం మాట్లాడుకున్నారని కావ్య అడుగుతుంది. అప్పుడు రాజ్, మాయ మాట్లాడుకునేది కేర్ సెంటర్ అతను చూడటం చూపించారు. కావ్య షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024