Patang: ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి హీరోయిన్‌గా పతంగ్- కామెడీ స్పోర్ట్స్ డ్రామా- డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Buchi Babu Sana About Patang Movie: ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలను ప్రేక్ష‌కులు చూసి ఉంటారు. కానీ, తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ప‌తంగ్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌ హీరోయిన్‌గా చేస్తోంది. జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ హీరోలుగా నటిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను గురువారం (ఏప్రిల్ 2) ప్ర‌సాద్ ఐమ్యాక్స్‌లో జ‌రిగిన వేడుక‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేశారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌తో పాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కిస్తున్న బుచ్చిబాబు సానా పతంగ్ టీజ‌ర్‌ను విడుదల చేశారు. మ‌రో అతిథి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య ఈ సినిమా కాంటెస్ట్‌లో విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్రణ‌వ్ కౌశిక్‌, ప్రీతి ప‌గ‌డాల‌, వంశీ పూజిత్, ప్ర‌ణీత్ ప‌త్తిపాటి, ఆట సందీప్ మాస్ట‌ర్‌, మాజీ ప్లార్ల‌మెంట్ సభ్యుడు సిరిసిల్ల రాజ‌య్య, న‌టి శాన్వి, ర‌విప్ర‌కాష్‌, చైత‌న్య త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పతంగ్ సినిమాపై డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

“కంటెంట్ చూస్తుంటే సినిమా షూర్ షాట్ హిట్ అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆ యూత్‌ఫుల్ వైబ్ క‌నిపిస్తుంది. మ‌రో హ్య‌పీడేస్‌లా ఘ‌న‌విజయం సాధిస్తుంద‌ని అనిపిస్తుంది. నాని నేను మా గురువు గారు సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న‌ప్పటి నుంచి నాకు తెలుసు. మంచి టెక్నిక‌ల్ నాలెడ్జ్ ఉంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించి అంద‌రికి మంచి పేరును తీసుక‌రావాలి” అని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు.

“ఎంతో బిజీగా రెహ‌మాన్ గారితో మ్యూజిక్ సిట్టింగ్‌లో ఉన్న డైరెక్టర్ బుచ్చిబాబు గారు మా మీద ప్రేమ‌తో వ‌చ్చినందుకు కృత‌జ‌జ్క్షత‌లు తెలియ‌జేస్తున్నాను. త‌ప్ప‌కుండా ఈ సినిమా అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమాతో థియేట‌ర్స్‌లో యూత్‌ ఫెస్టివ‌ల్స్ జ‌రుగుతాయి” అని క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాని బండ్రెడ్డి అన్నారు.

“సినిమా టీజ‌ర్ న‌చ్చితే అంద‌రికి సినిమా న‌చ్చిన‌ట్టే. ఒక తెలుగు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. త‌ప్ప‌కుండా సినిమా అందరికీ న‌చ్చుతుంది. టీజ‌ర్‌లో చెప్పిన‌ట్లుగా మ్యాచ్‌లో క‌లుద్డాం” అని పతంగ్ డైరెక్టర్ ప్రణీత్ చెప్పారు.

“ఈ సినిమా చాలా వ్య‌య ప్ర‌యాసాల‌తో జ‌రిగింది. ఈ గాలిప‌టం దారం తెగ‌కుండా చూసుకున్నాడు నాని. ఈ రోజు సినిమా బాగా రావ‌డానికి టీమ్ అంతా కృషి చేశారు. టీజ‌ర్‌లో ఉన్నట్లు అంద‌రూ మ్యాచ్ కోసం ఈ సినిమా మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తారు” అని నిర్మాత సంపత్ మక చెప్పుకొచ్చారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024