Best Web Hosting Provider In India 2024
kAP Medical Services Recruitment Board Updates : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వివరాలను వెల్లడించింది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
కొత్తగా ప్రారంభించిన అయిదు కళాశాలల్లో 158 ట్యూటర్ పోస్టుల(Tutors posts) భర్తీకి ఈ ప్రకటన జారీ అయింది. అర్హతల కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు మే 15వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://dme.ap.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన – ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు.
- ఉద్యోగాలు – ట్యూటర్ పోస్టులు
- మొత్తం ఖాళీలు – 158
- కొత్త మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో(కేవలం ఒక్క సంవత్సరానికి) వీటిని భర్తీ చేస్తారు.
- అర్హతలు – దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
- వేతనం – నెలకు రూ. 70,000.
- ఎంపిక విధానం – వంద మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా 75 శాతం మార్కుల వరకు కేటాయిస్తారు. కాంట్రాక్ట్ సర్వీస్ చేసిన వారికి వెయిటేజీ ఉంటుంది.
- వయసు – దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 47 ఏళ్ల లోపు ఉండాలి.
- దరఖాస్తులు – ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభం – 4 మే 2024.
- దరఖాస్తులకు తుది గడువు – 15 మే 2024.
- దరఖాస్తు రుసుం – ఓసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
- అధికారిక వెబ్ సైట్ – http://dme.ap.nic.in
కింద ఇచ్చిన PDFలో డిపార్ట్ మెంట్ల వారీగా ఖాళీల వివరాలు చూడొచ్చు….
NOTE : ఈ లింక్ పై క్లిక్ చేసి ట్యూటర్ పోస్టులకు డైరెక్ట్ గా అప్లయ్ చేసుకోవచ్చు.
టాపిక్
Andhra Pradesh NewsRecruitmentAp JobsAp Govt