The Boys 4 OTT: సూపర్ హీరోలపై సెటైరికల్‌, వయెలెంట్ సిరీస్- ఓటీటీలోకి ది బాయ్స్ 4- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

The Boys 4 OTT Streaming: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్ విన్నింగ్, సూపర్ హిట్ డ్రామా సిరీస్ ది బాయ్స్. ఈ సిరీస్‌కు వరల్డ్ వైడ్‌గా ఎంతో గుర్తింపు వచ్చింది. అలాగే ఈ సిరీస్‌కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి నాలుగో సీజన్ రాబోతుంది. తాజాగా ది బాయ్స్ సీజన్ 4 ట్రైలర్‌ను అభిమానుల మధ్య విడుదల చేశారు.

మెక్సికోలోని సీసీఎక్స్‌పీ ఇనాగ్రేషన్ వేడుకకు హాజరైన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ ది బాయ్స్ 4 ట్రైలర్ లాంచ్ చేశారు. దాంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమంలో సీజన్ నటీనటులు ఆంటోనీ స్టార్, ఎరిన్ మొరియార్టీ, చాస్ క్రాఫోర్డ్, కరెన్ ఫుకుహరా, క్లాడియా డౌమిట్ పాల్గొన్నారు.

ది బాయ్స్ సీజన్ 4లో ప్రపంచం ఉలిక్కిపడేలా సూపర్ హీరోస్ చర్యలు ఉంటాయని చూపించారు. విక్టోరియా న్యూమన్ గతంలో కంటే ఓవల్ కార్యాలయానికి దగ్గరగా, తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్న హోమ్ ల్యాండర్ ముసుగులో ఉండటం చూపించారు. బాయ్స్ లీడర్‌షిప్‌ను పోగొట్టుకున్న బట్చర్‌కు బతకడానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అతని అబద్ధాలతో మిగతా జట్టు విసిగిపోవడం చూపించారు.

ప్రపంచాన్ని రక్షించేందుకు మునుపెన్నడూ లేనంతగా పవర్ ఫుల్ సూపర్ హీరోస్ కొత్తగా వస్తున్నట్లు తెలుస్తోంది. అంతా కలిసి పనిచేస్తూ ఆలస్యం కాకముందే ప్రపంచాన్ని రక్షించడానికి ఒక మార్గాన్ని కనుగొనడం వాళ్ల లక్ష్యంగా తెలుస్తోంది. అలాగే ట్రైలర్‌లో డైలాగ్స్ బాగానే ఉన్నాయి. కానీ, వయెలెన్స్ మరి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ను రక్తపాతంతో నింపేశారు. ట్రైలర్‌ చివర్లో ఫXX వెల్ కమ్ అని చెప్పడం ఊహించినదానికంటే ఎక్కువ వయెలెన్స్ ఉంటుందని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ది బాయ్స్‌లో కార్ల్ అర్బన్, జాక్ క్వైడ్, ఆంటోనీ స్టార్, ఎరిన్ మొరియార్టీ, జెస్సీ టి అషర్, లాజ్ అలోన్సో, చాస్ క్రాఫోర్డ్, టోమర్ కాపోన్, కరెన్ ఫుకుహర, కోల్బీ మినీఫీ, క్లాడియా డౌమిట్, కామెరాన్ క్రోవెట్టి నటించారు. ఈ సీజన్ 4లో సుసాన్ హేవార్డ్, వలోరీ కర్రీ జెఫ్రీ డీన్ మోర్గాన్ కొత్తగా ఎంట్రీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ది బాయ్స్ 4 సీజన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ముందు మూడు ఎపిసోడ్స్‌తో ఈ సీజన్‌ను ప్రసారం చేయనున్నారు. అనంతరం ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్‌తో జూలై 18 వరకు కొనసాగనుంది. జూన్ 13 నుంచి మొదలై జూలై 18న ది బాయ్స్ 4 సీజన్‌లోని అన్ని ఎపిసోడ్స్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. 8 ఎపిసోడ్స్‌తో ఉన్న ఈ నాలుగో సీజన్‌ను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ది బాయ్స్ సిరీస్ సూపర్ హీరోలపై సెటైరికల్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ది బాయ్స్ సీజన్ 4 ట్రైలర్‌ను ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో అభిమానులు ఇంటర్నెట్‌లో ఉత్సాహాన్ని ఆపుకోలేక కామెంట్స్, ట్వీట్స్ చేస్తున్నారు.

“రియల్ సినిమా ఈజ్ బ్యాక్” అని ఒక ఎక్స్ యూజర్ కామెంట్ చేశాడు. ‘సూపర్ మ్యాన్‌తో క్రాస్ ఓవర్ చాలా బాగుంటుంది’ అని మరొకరు పోస్ట్ చేశారు. “ఇక్కడ చూపించడానికి ఇంకా చాలా ఉంది” అని మరో అభిమాని కామెంట్ చేశారు. కాగా ది బాయ్స్ అనేది గార్త్ ఎన్నిస్, డారిక్ రాబర్ట్ సన్‌ల ది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ కామిక్ ఆధారంగా రూపొందించబడింది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024