Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

Best Web Hosting Provider In India 2024

Bezawada Caste Politics: పై ఫోటో చూడండి. ఓవైపు రోడ్డు సిక్స్‌లేన్‌ మార్గంగా ఉంటే మరోవైపు ఎలా ఉందో.. ఓ వైపు వాహనాలు వేగంగా పరుగులు తీస్తే మరోవైపు కచ్చ రోడ్డు మీద వెళ్లాల్సిన దుస్థితి. రెండు ఒకే రోడ్డులో భాగాలు. కాకపోతే ఒకటి పేదలు, దళితులు నివసించే ప్రాంతంలో ఉన్న భాగమైతే మరొకటి అగ్రవర్ణాలు నివసించే ప్రాంతం. అందుకే ఆ రెండు రోడ్లు అలా ఉన్నాయి

దేశంలో ఎక్కడైనా కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఉద్యమాలు, పోరాటాలు జరుగుతాయి. బెజవాడలో మాత్రం రెండు దశాబ్దాల క్రితం వందల ఏళ్లుగా ఉన్నబందరు రైల్వే లైన్‌ పీకేసి అప్పటికి విస్తరించని ఊరవతలకు మార్పించారు.

రైల్వే ట్రాక్‌ పీకేసిన ప్రాంతంలో ఆరు వరుసల రోడ్డును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా రుణం తీసుకుని బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ పేరుతో ఓ విఫల ప్రయోగాన్ని కూడా చేపట్టారు. బెజవాడ కులం రాజకీయాలకు అద్దంపట్టే వ్యవహారం ఇది.

ట్రాక్‌నే మార్చించారు…

రెండున్నర దశాబ్దాల క్రితం విజయవాడ అప్పడప్పుడే విస్తరిస్తున్న దశలో నాయకులకు ఓ ఆలోచన వచ్చింది. నగరం మధ్య నుంచి వెళుతున్న బందరు రైల్వే ట్రాక్ వల్ల నగరం ఎదగడం లేదని, ప్రజలకు తరచూ రైళ్ల రాకపోకలకు చిక్కులు కలుగుతున్నాయని, లెవల్ క్రాసింగుల వల్ల సమయం వృధా అవుతోందని, రైలు కూతలతో ఆరోగ్యం పాడవుతోందని ఇలా రకరకాల సాకులతో విజయవాడ బందరు రైల్వే లైన్‌‌కు స్థాన భ్రంశం కల్పించాలనే డిమాండ్‌ విజయవాడ ఎంపీగా పర్వతనేని ఉపేంద్ర ఉన్న సమయంలో మొదలైంది.

పర్వతనేని ఉపేంద్ర సైతం మాజీ రైల్వే ఉద్యోగి కావడంతో స్థానికుల డిమాండ్లకు తలొగ్గారు. ఆ తర్వాత ఎన్నికైన గద్దె రామ్మోహన్ అదే డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లారు. మొత్తానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి సత్యనారాయణ పురం మీదుగా రామవరప్పాడు వెళ్లే రైల్వే లైన్‌ అలైన్‌మెంట్ మార్చాలని నిర్ణయించారు. 2002లో రైల్వే లైన్‌ తొలగించి దానికి పరిహారం 100ఎకరాల నగరపాలక సంస్థ స్థలాన్ని అజిత్‌సింగ్‌నగర్‌లో రైల్వేకు అప్పగించారు. ఈ కథ అక్కడితో ఆగిపోలేదు.

బందరు రైల్వే లైన్‌ తొలగించి విజయవాడ-విశాఖ మార్గంలో మధురా నగర్‌ మీదుగా మరో లైన్‌ నిర్మాణం చేపట్టారు. దానిని గుణదల సమీపంలో పాత లైన్‌కు కలిపారు. పాత రైల్వే లైన్ తొలగించిన ప్రాంతంలో విజయవాడ కార్పొరేషన్ రోడ్డు నిర్మాణం చేపట్టింది.

2004-09 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్ పాత రైల్వే లైన్ మార్గంలో బస్‌ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ తీసుకొస్తానని హంగామా చేశారు. దీని కోసం ఆరు వరుసల రోడ్డు నిర్మాణాన్ని కేంద్ర నిధులతో చేపట్టారు. బిఆర్‌టిఎస్‌ విజయవాడకు సాధ్యపడదని ఆ తర్వాత మధ్యలోనే ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఏలూరు కాల్వ పాత సీతన్న పేట గేటు నుంచి గుణదల వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం మాత్రం పూర్తైంది.

కాల్వకు అవతల అలా, ఇవతల ఇలా…

ఏలూరు కాల్వ మీదుగా సాగే బందరు రైల్వే లైన్‌ మార్గంలో కాల్వకు ఓ వైపు దళితులు నివసించే కాలనీలు ఉన్నాయి. అవతల వైపు ఇతరుల నివాసాలు ఉన్నాయి. అగ్రవర్ణాలు నివసించే ప్రాంతంలో బిఆర్‌టిఎస్ రోడ్డు నిర్మాణం పూర్తైతే దళితులు, పేదలు నివసించే మార్గంలో మాత్రం 22ఏళ్లుగా రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు.

ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోలేదు. పెజ్జోనిపేట, బాప్టిస్ట్ పాలెం, ఖుద్దుస్ నగర్‌, బొగ్గులైన్ క్వార్టర్స్, కేదారేశ్వరపేట వంటి ప్రాంతాలు నివసించే ఒకటిన్నర కిలోమీటర్ల మార్గాన్ని మాత్రం రెండు దశాబ్దాలుగా వదిలేశారు. ఈ ప్రాంతాల్లో మైనార్టీలు, దళితులు నివసిస్తుంటారు.

ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే విశాఖ-విజయవాడ, హైదరాబాద్-విజయవాడ మార్గంలో వచ్చే వాహనాలు నేరుగా రైల్వేస్టేషన్‌కు చేరుకోవచ్చు. రైల్వే శాఖ అభ్యంతరాలను సాకుగా చూపించి ఎంపీలు ఆ ప్రాంతాలను పూర్తిగా విస్మరించారు. 1999-2019 మధ్య కాలంలో ఐదుగురు ఎంపీలు మారినా ఈ రోడ్డుకు మాత్రం మోక్షం కలగలేదు.

లెవల్ క్రాసింగులు మూసేసినా అడిగే దిక్కే లేదు..

విజయవాడలో పేదలు నివసించే ప్రాంతాల్లో రైల్వే అధికారులు లెవల్ క్రాసింగుల్ని మూసేసినా ప్రజాప్రతినిధులు చోద్యం చూడటం తప్ప ఏమి చేయలేకపోయారు. బెజవాడకు అభివృద్ధి తీసుకొచ్చాం, ఫ్లైఓవర్లు తెచ్చామని జబ్బలు చరుచుకునే నేతలు పేదలు నివసించే ప్రాంతాల్లో మాత్రం ఏమి చేయలేకపోయారు.

నైజాంగేటు లెవల్ క్రాసింగ్ మూసేసి, అండర్‌ బ్రిడ్జి రోడ్డును రెండున్నరేళ్ల పాటు మూసేసినా ఎంపీ, ఎమ్మెల్యేలు వాటిని పునరుద్ధరించ లేకపోయారు. అండర్‌ పాస్‌ల నిర్మాణం విషయంలో కూడా పేదల కాలనీలపై వివక్ష కొనసాగింది. బందరు రైల్వే లైన్ తొలగించిన కొత్తగా ఏర్పాటు చేసిన మధురానగర్‌ రైల్వే లైన్‌ మార్గంలో ఆరేళ్ల వ్యవధిలో అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేశారు.

రాజరాజేశ్వరిపేట, నైజాం గేట్ ప్రాంతాల్లో ఫుట్‌ బ్రిడ్జిలు, లెవల్‌ క్రాసింగ్‌లను మూసేసినా ప్రజాప్రతినిధులు స్పందించలేదు. పేదలు నివసించే ప్రాంతాలకూ న్యాయం, ఉన్నత వర్గాలు నివసించే ప్రాంతాలకో న్యాయం అమలు చేశారు.

ఓటర్లంటే చిన్న చూపు…

విజయవాడలో ఎన్నికయ్యే ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పనుల్ని కూడా కులం కోణంలో చేపడతారనే అపవాదు ఉంది.పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల ఓటర్లు ఉండే ప్రాంతాల అభివృద్ధి మీద పెద్దగా ఆసక్తి చూపరనే ఆరోపణలు ఉన్నాయి.

2014-19 మధ్య కాలంలో గుణదల ప్రాంతంలో తమకు ఓట్లు వేయలేదనే కారణంతో ఓ రోడ్డును ఐదేళ్ల పాటు గుంతలతోనే ఉంచేశారు. క్రీస్తు రాజపురం, గుణదల, లయోలా కాలేజీ వెనుక ఉన్న రోడ్డులో ప్రజలు తమకు ఓట్లు వేయలేదని రోడ్ల నిర్మాణం చేయకుండా ప్రజల్ని వేధించారు. తాజా ఎన్నికల నేపథ్యంలో బెజవాడ ప్రజాప్రతినిధుల తీరు మరోమారు చర్చకు వచ్చింది. ఎన్నికల్లో హామీలివ్వడం తప్ప

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Ap PoliticsGovernment Of Andhra PradeshYsrcpTdpVijayawada
Source / Credits

Best Web Hosting Provider In India 2024