Best Web Hosting Provider In India 2024
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవర సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో హైప్ విపరీతంగా ఉంది. అలాగే, వార్ 2 చిత్రంతో బాలీవుడ్‍లోనూ ఎన్టీఆర్ అడుగుపెడుతున్నారు. హృతిక్ రోషన్‍తో కలిసి ఈ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇక స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తోనూ ఎన్టీఆర్ ఓ మూవీ చేయనున్నారు. కాగా, ఈనెల (మే) 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉంది. దీంతో ఆ రోజు ఈ సినిమాల నుంచి అప్‍డేట్స్ రానున్నాయి. ఆ వివరాలివే..
ఎన్టీఆర్ – నీల్ మూవీ అప్‍డేట్
కేజీఎఫ్, సలార్ సినిమాలతో ఫుల్ ఫామ్‍లో ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో మూవీ చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ చిత్రం గతంలోనే ఖరారైనా.. దేవర ఆలస్యమవడంతో పెండింగ్ పడుతూ వస్తోంది. అయితే, ఎన్టీఆర్, నీల్ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చేందుకు సిద్ధమైంది. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఈ సినిమా గురించి అప్‍డేట్ వస్తుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ – నీల్ కాంబినేషన్‍లో ఈ చిత్రం కూడా హైవోల్టేజ్ యాక్షన్ మూవీగానే ఉంటుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మించనున్నారు. మే 20న ఈ చిత్రం గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రానుందో చూడాలి.
వార్ 2 నుంచి ఫస్ట్ లుక్
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‍లోనూ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీని ఉండనుంది.
వార్ 2 చిత్రం నుంచి మే 20వ తేదీన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజైన ఆ తేదీన సర్‌ప్రైజ్ రానుంది.
దేవర నుంచి..
దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దేవర సినిమా ఏప్రిల్‍లో విడుదల కావాల్సి ఉండగా.. ఏకంగా అక్టోబర్‌కు వెళ్లింది.
కాగా, ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20వ తేదీన దేవర నుంచి తొలి పాట వస్తుందంటూ కొంతకాలంగా రూమర్లు ఉన్నాయి. అయితే, మూవీ టీమ్ నుంచి ఈ విషయంపై ఇప్పటి వరకు సంకేతాలు రాలేదు. మరి, ఈ చిత్రం నుంచి మే 20న సాంగ్ వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ పాట తీసుకురాకపోతే ఎన్టీఆర్ కొత్త లుక్ అయినా మూవీ టీమ్ కచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా దేవర నుంచి కూడా ఆరోజున ఏదో ఒక అప్‍డేట్ రావడం పక్కాగా కనిపిస్తోంది. ఇలా.. ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులు ట్రిపుల్ ట్రీట్ పక్కాగా కనిపిస్తోంది.
దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‍గా చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.