Weight Loss Drink : ఇంట్లో తయారుచేసిన డ్రింక్.. ఈజీగా బరువు తగ్గవచ్చు

Best Web Hosting Provider In India 2024

శరీర బరువు చాలా మందికి మొదటి శత్రువు అని చెప్పాలి. దీనిని తగ్గించుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఎందుకో తగ్గట్లేదు అనే భావన చాలా మందికి ఉంటుంది. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు. మీరు వ్యాయామం గురించి ఆలోచించలేని పని, అలసట చుట్టూ జీవితం తిరిగితే ఇంకా సమస్యలే. మీరు తినే ఆహారంలో కొద్దిగా అల్లం కలిపితే చాలు. మీరు మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు.

అల్లం మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. అందుకే అల్లం వాడితే బరువు తగ్గడం ఖాయం. అయితే అల్లం ఎలా వాడాలి? ఎంత ఉపయోగించాలి? ఈ విషయాల గురించి చూద్దాం..

ఒత్తిడిని తగ్గిస్తుంది

అల్లంలో జింజెరోల్స్, షోకల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎన్నో మంచి పనులు చేస్తాయి. మీకు తెలుసా అధిక బరువు ఒత్తిడిని కలిగిస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది అన్ని విధాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గుండెకు నష్టం. అందుకే అల్లం వాడాలి.

పొట్ట చుట్టూ కొవ్వు

ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించాలంటే అల్లం ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి కూడా అల్లం వాడుకోవచ్చు. ఎందుకంటే అల్లం మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ ను సరిగ్గా ఉంచుతుంది. సరే ఈ అల్లంతో బరువు తగ్గేందుకు ఏం చేయాలో చూద్దాం..

ఎలా చేయాలి

20 గ్రాముల అల్లం తరిగి మిక్సీలో వేసి, అరకప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. అల్లంలోని రసమంతా నీటిలో కలిసిపోతుంది. నీటిని వడకట్టి అందులో సగం నిమ్మరసం కలపాలి. దీన్ని రోజూ రెండు లేదా మూడు సార్లు తాగాలి. నిమ్మరసం కూడా మన ఆకలిని చంపుతుంది. అల్లం రసం, నిమ్మరసం రెండూ మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. మనం ఎక్కువగా ఆహారం తీసుకోం. ఫలితంగా బరువు తగ్గుతారు.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పైన చెప్పిన అరకప్పు అల్లం రసంలో నాలుగు చుక్కల ఈ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి. అల్లం, నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగవచ్చు. దీన్ని ఎలా తాగినా బరువు తగ్గడం గ్యారెంటీ.

అల్లం టీతో ప్రయోజనాలు

కొందరు అల్లం టీ తాగుతారు. అల్లం ముక్కలు లేదా అల్లం ముద్దను నీళ్లలో వేసి మరిగించి పది నిమిషాలు మరిగించి వడగట్టి అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేసి తాగితే బరువు తగ్గుతారు. దీనిని తేనె, నిమ్మరసంతో కూడా కలపవచ్చు. రోజూ ఉదయాన్నే ఈ టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

అల్లం ఒత్తిడిని తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. శరీరం శక్తి స్థాయిలు పెరుగుతాయి. గుండెకు మంచిది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అల్లం శరీరం నుండి విషాన్ని తొలగించడం ద్వారా శరీర బరువును తగ్గించగలదని మీకు తెలుసా? ఇది కొవ్వును కూడా కరిగిస్తుంది. రాత్రి భోజనానికి ముందు అల్లం టీ తాగడం మంచిది. ఎందుకంటే రాత్రిపూట శరీరం నుంచి విషాన్ని బయటకు పంపే పని చేస్తుంది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024