Best Web Hosting Provider In India 2024

అవన్నీ చంద్రబాబు సృష్టిస్తున్న అపోహలు
అనూహ్య మార్పులకు నాంది పలికాం
అధికారం దుర్వినియోగం చేయలేదు
రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: ప్రచార లో భాగంగా పీఎన్ కాలనీ, ఐదో లైన్లో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరిచ్చిన అధికారాన్ని ఏనాడూ దుర్వినియోగం చేయలేదు. పాలన పరమైన సంస్కరణలు తీసుకుని వచ్చాం. అభివృద్ధి అన్నది ప్రజల తాలుకా జీవన ప్రమాణాలు పెంచేదిగా ఉండాలని భావించి తదనుగుణం అయిన చర్యలు చేపడుతూ, మెరుగైనా పాలనను అందించేందుకు కృషి చేశాం. ఈ పార్టీ,ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకే నిర్దేశిస్తూ.. సంబంధిత కార్యాచరణలను ఎప్పటికప్పుడు అమలు చేశాం.
గడిచిన 75 ఏళ్లుగా చాలా నిర్లక్ష్యానికి గురైన కుటుంబాల జీవన అవసరాలు తీర్చే పని చేశాం. కరోనాను మినహాయిస్తే మూడేళ్లలోనే ఎన్నో కార్యక్రమాలు చేసి పేదల కలలను నెరవేర్చాం. గతంలో ఏ ప్రభుత్వం పని చేయని విధంగా పనిచేశాం.
అలానే ఆ రోజు హైద్రాబాద్ ను అభివృద్ధి కేంద్రంగా మలచడం వల్ల వచ్చిన ఇబ్బందులు (కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్) ను దృష్టిలో ఉంచుకుని, నాటి పరిణామాలు, రాష్ట్ర విభజన కోరుతూ సంబంధిత సమయంలో రేగిన ఉద్యమాలు ఇవన్నీ చాలా వైఫల్యాలను పట్టి చూపాయి. తరువాత చంద్రబాబు మళ్లీ ఇదే తప్పిదం చేసేందుకు అమరావతి పేరిట రాజకీయం నడిపారు. వీటికి తక్షణ పరిష్కారంగా అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చాం. వైఎస్సార్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా రాజధాని వస్తుంది. అలానే న్యాయ,శాసన రాజధానులు కర్నూలు,అమరావతిలో ఉంటాయి. కానీ వీటికి చంద్రబాబు న్యాయ స్థానాల పేరిట
మొకాలడ్డుతూ రాజధాని ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.? ఇవాళ దేశంలో ఉన్న అభివృద్ధి సూచీలు చూడండి.
మన ప్రభుత్వం గతం కన్నా బెటర్ రిజల్ట్స్ అందుకుంది. వాటిని కేంద్రం ఇచ్చిన నివేదికలే చెబుతున్నాయి.
పాలన సంస్కరణలు అన్నవి జీవన ప్రమాణాలు పెంచాలి. ఇవి లేకుండా మాటలు చెప్పడం ఎంత వరకూ ప్రయోజనం. నిష్ప్రయోజనంతో కూడిన మాటలు చెప్పారు చంద్రబాబు. సాధ్యతతో కూడిన మాటలే చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇవాళ అంతా మాట్లాడుతున్నారు. 1989లో ప్రారంభం అయిన ఒక ఆలోచన ధోరణి ఈ దేశంలో సుప్రీం కోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. ఇప్పటివరకూ భారతదేశంలో ఉన్న చట్టాలేవీ కూడా కన్ఫర్మ్డ్ టైటిల్ ఏదీ ఇవ్వలేదు అని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చెబుతున్నది. మనకు అంతకు మించిన మార్గం ఏమీ లేదు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అంతే. ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాలలో ఉన్న రికార్డ్స్ ఏంటంటే ఇప్పటివరకూ ఉన్నవన్నీ ప్రిజమ్టివ్ టైటిల్ (Presumptive title)..కు సంబంధించినవే.
ఇదీ సుప్రీం కోర్టు వాదన అందుకే పర్మినెంట్ గా కన్ఫర్మ్డ్ టైటిల్ ఇచ్చే చట్టాలు తీసుకురండి. తీసుకుని రాకపోతే ఈ దేశంలో ఇతర దేశాలు నుంచి పెట్టుబడులు రావు. పరిశ్రమలు రావు. ఈ వివాదాలతో కోర్టులన్నీ వ్యాజ్యాలతో నలిగిపోతున్నాయి. ఇలాంటి సందర్భాన నీతి అయోగ్ ఒక డ్రాఫ్ట్ ఇచ్చింది. 1989 నుంచి 2022 వరకూ వివిధ దశలలో వివిధ కమిటీల పేరిట జరిగిన అధ్యయ నం తరువాత నీతి అయోగ్ ఒక డ్రాఫ్ట్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకూ ఇచ్చింది.ఇది మేం చేసిన చట్టం కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ ఆలోచన కాదు. ఆ డ్రాఫ్ట్ ను దృష్టిలో ఉంచుకుని శాసనసభలో చట్టం చేశాం. స్టేక్ హోల్డర్స్ రైతులు కానీ న్యాయవాదులు కానీ అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. చేశాక మేం దానిని నిలుపుదల చేశాం. కోర్టులో కూడా కొన్ని వాయిదాలు పడ్డాయి. కోర్టులో కూడా ప్రభు త్వం తరఫున చెప్పేశాం. ఈ చట్టాన్ని మేం అమలు చేయం. ఇది అమలు చేయాలంటే ఇంకా చాలా అంశాలు కోర్టులో వివరణ రావాలి. సర్వే అంతా కంప్లీట్ కావాలి. దేశం అంతా సమ్మతి రావాలి. వచ్చినప్పుడు మాత్రమే చేస్తాం ఇది దేశానికి సంబంధించిన చట్టం. దేశవ్యాప్తంగా ఏ ఆలోచన చేస్తుందో అదే ఆలోచన చేస్తాం అని కోర్టు కూడా చెప్పాం. కోర్టులో చెప్పి ఆపేశాం. చంద్రబాబులాం టోళ్లకు విమర్శించేందుకు ఏమీ లేదు కనుక అసలీ చట్టానికి భూములు తీసుకుంటారు అనేందుకు సంబంధం ఏమయినా ఉందా ? నా సీరియస్ అబ్జెక్షన్ ఏంటంటే అంత అమాయకంగా ప్రజలను నువ్వు చూస్తున్నావా ? మామూలుగా ప్రభుత్వానికి అవసరం అయి భూమి తీసుకోవాలంటేనే 2013 లో పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పరిహారం చెల్లించి తీసుకోవాల్సి వస్తుంది. ఈ చట్టం అనుసారం సరైన కారణం లేకపోతే భూ సేకరణను కోర్టు అనుమతించదు కూడా.
అలాంటిది ఎవరి భూమో తీసుకోవడానికి చట్టం చేశాం అని అనడం ఏంటి..? ఏమిటి ఈ అర్థపర్థం లేని మాటలు ? ఇంత బాధ్యత లేకుండా మాట్లాడతారా ? అసహ్యం వేస్తుంది ఇలాంటి మాటలు వింటుంటే. ఇంత అడ్డదిడ్డంగా సమాజాన్ని ఓ రాజకీయ పార్టీ మిస్ గైడ్ చేయవచ్చా ? రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం సమాజాన్ని చైతన్యవంతం చేయడం. తప్పుదారి పట్టించడం ఓ రాజకీయ పార్టీ పని కాదు కదా ! అపోజిషన్ లో ఉన్నా రూలింగ్ లో ఉన్నా సమాజాన్ని చైతన్యపరచడం అన్నది ఓ రాజకీయ పార్టీ ధ్యేయం కావాలి. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి రాజకీయ పార్టీలు అన్నవి ఓ స్వచ్ఛంద సంస్థల్లా పనిచేయాలి.
మన చంద్రబాబు వాలకం అలా ఉంది. అందుకోసమే అతడు (చంద్రబాబు) ఈ జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఏ మాత్రం ప్రయో జనకారి కాదు. విభజన తరువాత మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన 23 అత్యున్నత సంస్థలలో కనీసం రెండు మనకు రావాలి. న్యాయంగా అయితే ఇదే జరగాలి. కానీ ఇందుకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరించి మన జిల్లాకు ఎంతో అన్యాయం చేశారు. అతడికి ఓటు అడిగే హక్కు లేదు అని విన్నవిస్తున్నాను. ఇక రెండో విషయం ఎండోమెంట్ ల్యాండ్స్ కింద ఓ నోటిఫికేష న్ వచ్చింది. గతంలో ఇక్కడికి పార్క్ ఇనాగరేట్ చేసేందుకు వచ్చినప్పుడే నాకు చెప్పారు. అప్పటి నుంచీ కంటిన్యువస్ గా ఫాలో అప్ చేస్తున్నాను.
ఇప్పటికే రెండు సార్లు మన జిల్లా నుంచి రికమెండ్ చేయించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు పంపాను. ఇప్పుడు కూడా ఎండోమెంట్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడాను. నోట్ ఫైల్ వచ్చింది. జాయింట్ కలెక్టర్ ఫేవర్బుల్ గా రికమండ్ చేశారు. నేను మీకు సోమవారం ఎప్పుడు ఆర్డర్ ఇస్తాం అన్నది చెబుతాను అని అన్నారాయన. నాకు తెలిసి ఎలక్షన్ ముందుగానే దీనిపై క్లారిఫికేషన్ వస్తుందని,సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ వస్తుందని ఆశిస్తున్నాను. మా ఆఫీసు కూడా దీనిపై వర్క్ చేస్తుంది. మా ఓఎస్డీ కూడా దీనిపై ఇప్పటికే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్లి ఉన్న అబ్జక్షన్స్ అన్నింటినీ క్లియర్ చేశారు. మూడు సార్లు ఫైల్ వెనక్కు వస్తే రెండు సార్లు జాయింట్ సర్వే కంప్లీట్ చేయించి పంపించాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసినప్పుడు లెంగ్దీ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఉన్నప్పుడు అవ్వకపోవడం అన్న సమస్య లేదు. దీనిపై ఇక్కడున్న వారెవ్వరూ ఆ ప్రాపర్టీకి సంబంధించిన వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అని పేర్కొంటూ మంత్రి ధర్మాన తన ప్రసంగం ముగించారు. తనను మళ్లీ గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. అలానే పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను కూడా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తాను ఎన్నడూ సిద్ధంగానే ఉంటానని హామీ ఇచ్చారు. తన హయాంలోనే రోడ్లు, తాగునీటి వసతులు దక్కాయని గుర్తు చేశారు.