TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల – మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

Best Web Hosting Provider In India 2024

TS SET Notification 2024 Updates: తెలంగాణ సెట్ – 2024(Telangana State Eligibility Test) నోటిఫికేషన్ వచ్చేసింది. శనివారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించారు. 

ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ –  2024(Telangana State Eligibility Test Exam) పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(OU) నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. 

మే 14 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు…

మే14వ తేదీ నుంచి తెలంగాణ సెట్ దరఖాస్తులు(TS SET Applications 2024) ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ లోనే దరఖాస్తులను సమర్పించాలి. జూలై 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. ఫైన్ తో జూలై 26వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. 

ఆగస్టు 20వ తేదీ నుంచి సెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఆగస్టు 31వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయని తెలంగాణ సెట్ అధికారులు వెల్లడించారు. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణ సెట్ ను 2 పేపర్లలో(TS SET Exam 2024) నిర్వహిస్తారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు ఉంటాయి. ఇక పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో మూడు గంటల పాటు ప‌రీక్ష నిర్వహిస్తారు.

How to Apply TS SET 2024 : ఇలా దరఖాస్తు చేసుకోండి….

  • అభ్యర్థులు ముందుగా http://telanganaset.org/index.htm  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • TS SET Apply Online అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
  • మీ వివరాలతో పాటు విద్యార్హతలను ఎంటర్ చేయాలి. ఇందులోనే మీరు ఎగ్జామ్ సెంటర్ ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • నిర్ణయించిన అప్లికేషన్ రుసుం చెల్లించాలి. ఆన్ లైన్ పేమెంట్  అందుబాటులో ఉంటుంది.
  • ఫైనల్ గా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  • ప్రింట్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.

 

 

IPL_Entry_Point

టాపిక్

Ap SetOsmania UniversityTelangana NewsTrending TelanganaEducationEntrance Tests
Source / Credits

Best Web Hosting Provider In India 2024