Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Best Web Hosting Provider In India 2024

Adivi Sesh About Aa Okkati Adakku: కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. సినిమాకు మొదటి రోజే వరల్డ్ వైడ్‌గా రూ. 1.62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు కూడా దూసుకుపోతోంది.

అయితే ఆ ఒక్కటి అడక్కు సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు మేకర్స్. మే 3న ఈ సినిమా విడుదల కాగా దానికంటే ముందు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా సినిమా గురించి, అల్లరి నరేష్ గురించి చెబుతూ చిట్టి ఫరియా అబ్దుల్లాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

“నరేష్ గారితో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. నా ఫస్ట్ ఆడియో లాంచ్ కి నరేష్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ రోజు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి. ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. ఆయన్ని ఎప్పుడూ కలసిన చాలా ఆత్మీయంగా ఉంటుంది” అని హీరో అడవి శేష్ తెలిపాడు.

“అబ్బూరి రవి గారు నా కెరీర్‌కి బ్యాక్ బోన్. ఇద్దరం కలసి ఏడు సినిమాలు చేశాం. రాజీవ్ గారు ఐకానిక్ యానిమేషన్ మూవీస్ పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారో అలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఫరియాని ఫస్ట్ టైం కలిశాను. చాలా అమాయకంగా కనిపించారు. అదే ఇన్నోసెన్స్ కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తారు” అని ఫరియా గురించి ఫన్నీ స్పీచ్ ఇచ్చారు అడవి శేష్.

“డైరెక్టర్ మల్లికి నా బెస్ట్ విషెస్. మా అన్నయ్య టీంలో ఆయన పని చేశారు” అని అడవి శేష్ తెలిపారు. “నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ బిగ్ థాంక్స్. నిర్మాత రాజీవ్ గారికి ధన్యవాదాలు. చాలా క్యాలిటీగా సినిమాని తీశారు. నరేష్ గారికి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. కో యాక్టర్‌గా చాలా సపోర్ట్ చేశారు” అని హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా తెలిపింది.

“ఈ సినిమాతో నరేష్ గారి రూపంలో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు మల్లిగారి ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. ఈ హోల్సమ్ ఎంటర్ టైనర్‌ని తెరపై చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఫరియా తన భావాలు పంచుకుంది.

కాగా ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించగా.. స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024