Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Best Web Hosting Provider In India 2024

Aa Okkati Adakku Box office Collections: అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్‍గా చేశారు. ఈ మూవీ హైప్‍తో మే 3వ తేదీన థియేటర్లలో రిలీజైంది. మూడేళ్ల తర్వాత అల్లరి నరేశ్ మళ్లీ కామెడీ ట్రాక్‍కు వచ్చేయటంతోనూ ఈ చిత్రానికి బజ్ బాగా వచ్చింది. అందుకు తగ్గట్టుగానే వసూళ్లను రాబడుతోంది.

రెండో రోజుల కలెక్షన్లు ఇలా..

ఆ ఒక్కటి అడక్కు సినిమా మొదటి రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.3కోట్ల 34లక్షల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ వసూళ్ల వివరాలను మూవీ టీమ్ అఫీషియల్‍గా వెల్లడించింది.

తొలి రోజు కంటే ఎక్కవ

ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫస్ట్ డే రూ.1.62 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు రూ.1.72 కోట్ల దక్కాయి. దీంతో ఓపెనింగ్ డే కంటే.. రెండో రోజు ఈ మూవీ జోరు పెరిగింది. వరల్డ్ వైడ్‍గా రెండు రోజుల్లో రూ.3.34 కోట్ల వసూళ్లతో ఈ చిత్రం అంచనాలను అందుకుంది. మూడో రోజు ఆదివారం కావడంతో వసూళ్ల జోష్ కొనసాగే అవకాశం ఉంటుంది. సోమవారం ఈ చిత్రానికి అసలు పరీక్ష ఉండనుంది.

పోటీలో ప్రసన్నవదనం

సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం సినిమా మే 3న ఆ ఒక్కటి అడక్కు చిత్రానికి పోటీగా రిలీజ్ అయింది. ఫేస్ బ్లైండ్‍నెస్ కాన్సెప్టుతో వచ్చిన థిల్లర్ ప్రసన్నవదనం చిత్రానికి మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. ఈ చిత్రానికి రెండు రోజుల్లో సుమారు రూ.1.5కోట్ల వసూళ్లు దక్కాయనే అనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ పోటీలో అల్లరి నరేశ్ మూవీదే ప్రస్తుతం పైచేయిగా ఉంది.

ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో అల్లరి నరేశ్, ఫారియా హీరోహీరోయిన్లుగా చేయగా.. వెన్నెల కిశోర్, జామీ లెవెర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ, రితూ చౌదరి కీరోల్స్ చేశారు. బాలీవుడ్ నటి లెవెర్ ఈ మూవీతోనే టాలీవుడ్‍లో అడుగుపెట్టారు.

ఆ ఒక్కటి అడక్కు చిత్రానికి మల్లీ అంకం దర్శకత్వం వహించారు. పెళ్లి కోసం ఓ యువకుడు పడే తంటాల చుట్టూ కథను రాసుకొన తెరకెక్కించారు. చిలక ప్రొడక్షన్ బ్యానర్‌పై రాజీవ్ చిలక ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి గోపీసుందర్ సంగీతం అందించారు.

ఆ ఒక్కటి అడక్కు స్టోరీ లైన్

ప్రభుత్వ ఉద్యోగం చేసే గణపతి (అల్లరి నరేశ్).. కొన్నేళ్లుగా పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఓ మాట్రిమోనీకి వెళతాడు. అక్కడ సిద్ధి (ఫారియా అబ్దుల్లా)ను గణపతి కలుస్తాడు. ఈ క్రమంలో సిద్ధిని ప్రేమిస్తాడు. అయితే, ఈ క్రమంలో సిద్ధి గురించి గణపతికి ఓ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. మరి గణపతి, సిద్ధి వివాహం అయిందా? ఈ సినిమా ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024