Best Web Hosting Provider In India 2024
Aditya Roy Kapur, Ananya Panday: బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, హీరోయిన్ అనన్య పాండే రెండేళ్లుగా డేటింగ్‍లో ఉన్నారు. ఈ విషయంపై ఎన్ని రూమర్లు వచ్చినా తమ బంధం గురించి ఈ లవ్ బర్డ్స్ బయటికి ఎప్పుడూ చెప్పలేదు. హింట్లు మాత్రం ఇచ్చారు. చాలా పార్టీలకు, ఈవెంట్లకు, వెకేషన్లను కలిసే వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా చాలాసార్లు బయటికి వచ్చాయి. దీంతో వీరి ప్రేమ బంధం నిజమేనని తేలిపోయింది. అయితే, రెండేళ్లుగా డేటింగ్‍లో ఉన్న ఆదిత్య కపూర్, అనన్య పాండే ఇప్పుడు తమ రిలేషన్‍కు ఫుల్ స్టాప్ పెట్టారనే సమాచారం బయటికి వచ్చింది.
ఎప్పుడు బ్రేకప్ అయిందంటే..!
నెల కిందటే ఆదిత్య, అనన్య విడిపోయారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. “సుమారు నెల కిందటే వారిద్దరికీ బ్రేకప్ అయింది. వారి మధ్య బంధం చాలా బలంగా ఉండేది. వారి బ్రేకప్ మాకు అందరికీ షాకింగ్‍గా ఉంది. ఇద్దరూ ఒకరితో ఒకరు బాగుంటారు. అనన్య ఈ విషయం నుంచి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బాధ మాత్రం ఉంటుంది. ఆమె తన పెంపుడు జంతువులతో సమయం గడుపుతున్నారు. ఆదిత్య కూడా మెచ్యూరిటీతో పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని వారి క్లోజ్ ఫ్రెండ్ చెప్పినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది.
ఆ పోస్ట్‌తోనే హింట్ ఇచ్చారా..!
గత నెలలో అనన్య పాండే ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో ఆదిత్య, అనన్య బ్రేక్ గురించి హింట్ ఇచ్చారా అనే రూమర్లు వచ్చాయి. “ఒకవేళ అది మనకు చెందాల్సినదే అయితే.. కచ్చితంగా మళ్లీ తిరిగి వస్తుంది. సొంతంగా నేర్చుకోవాల్సిన పాఠాలను నేర్పేందుకే అది వదిలివెళుతుంది. ఒకవేళ అది మీకు దక్కాలని ఉంటే.. దూరంగా తోసేసినా మళ్లీ వస్తుంది. తిరస్కరించినా మళ్లీ వస్తుంది” అంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో సుదీర్ఘ పోస్ట్ చేశారు అనన్య పాండే. “ఒకవేళ మీకు దక్కాల్సిందే అయినా.. మీలో భాగం కాకపోవచ్చు. అది ఆత్మ లోతుల్లో ముడిపడి ఉండదు” అంటూ రాసుకొచ్చారు. ఇది దేని గురించోనని చర్చ సాగింది. ఆదిత్యతో బ్రేకప్ సందర్భంగానే ఇలా పోస్ట్ చేశారనే రూమర్లు వచ్చాయి.
అనన్యతో డేటింగ్ చేస్తున్నావా అని కాఫీ విత్ కరణ్ షోలో ఆదిత్య కపూర్‌కు గతేడాది ప్రశ్న ఎదురైంది. అయితే “నన్ను రహస్యాలు అడగొద్దు. నేను అబద్ధాలు చెప్పను” అని కరణ్ జోహార్‌తో ఆదిత్య చెప్పారు. దీంతో అనన్యతో ప్రేమ విషయాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు. అలాగే, మరో ఎపిసోడ్‍లో అనన్య కూడా ఈ విషయంపై ఇలానే స్పందించారు. అయితే, రెండేళ్ల డేటింగ్ తర్వాత ఇప్పుడు అనన్య, ఆదిత్య బ్రేక్ చెప్పుకున్నారని తెలుస్తోంది.
సినిమాల విషయం ఇలా..
అనన్య పాండే ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలను చేస్తున్నారు. కంట్రోల్, శంకర చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే, కాల్ మీ బీ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఇక, లైగర్ చిత్రంతో తెలుగులోనూ బాగా పాపులర్ అయ్యారు అనన్య.
ఆదిత్య రాయ్ కపూర్ ప్రస్తుతం మెట్రో అన్ డైనో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాలీ అలీ ఖాన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, నీనా గుప్తా, ఫాతిమా సనా షేక్ కీరోల్స్ చేస్తున్నారు.