చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు పవన్ కళ్యాణ్  విషం చిమ్ముతున్నారు

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్  

తాడేప‌ల్లి:  చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు ఆయన కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్  విషం చిమ్ముతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై మాట్లాడుతున్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్  విమ‌ర్శించారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు.  మీ భూములు జగన్ తాకట్టు పెట్టుకుంటారు.కేవలం మీ ఆస్దులకు జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారంటూ పవన్ అవాస్తవాలు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆదివారం నాగార్జున యాద‌వ్ మీడియాతో మాట్లాడారు.

 •  ఈ స్టాంప్ విధానం లోపభూయిష్టం అని భావిస్తే, పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ ఈ స్టాంప్ విధానంలో  ఎందుకు ఇచ్చాడు.
 •  నీవు చేస్తున్న ప్రచారం నిజమైతే పవన్ కల్యాణ్  మాన్యూవల్ గా కాకుండా ఈ స్టాంప్ విధానంలో ఇచ్చిన డాక్యుమెంట్ ఎలా ఇచ్చావు.
 •  నీవు అబద్దపు ప్రచారం చేస్తున్నావనేది ఇక్కడే అర్దమయిపోతుంది. 
 •  చంద్రబాబు కోసం ఇలాంటి విషప్రచారం చేయడానికి ఎంత మొత్తం తీసుకున్నాడో చెప్పాలి.
 •  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎన్డీయే కూటమి చేస్తున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.
 •  పచ్చమీడియా సహకారంతో చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు చేస్తున్న దుష్ప్రచారం పై రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
 •  చంద్రబాబు తన పాలనలో ఏ రోజూ కూడా ఒక్కరికి భూములు పంచలేదు.
 •  వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి కాగానే లక్షలాది మంది పేదలకు భూములు పంచారు.27,41,698 ఎకరాలను 15,21,160 మంది బడుగు,బలహీనవర్గాలకు చెందిన రైతులకు హక్కులు కల్పించారు.
 •  చంద్రబాబు లాగా రైతులనుంచి  భూములు లాక్కోవాల్సిన అవసరం జగన్ మోహన్ రెడ్డికి లేదు.జగన్ గారిది పెట్టేచేయి.
 •  వైయస్ జగన్ తెచ్చిన భూ సంస్కరణలపై ప్రజలకే కాదు పవన్ కల్యాణ్ కు కూడా ఎంత నమ్మకం అనేది పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిటే సమాధానం.ఆయన నామినేషనే సాక్ష్యం.
 •   పవన్ కల్యాణ్ 2019 – 24 మధ్య తెలంగాణా ప్రాంతంలో మూడు చోట్ల ప్రాపర్టీస్ కొన్నారు.
 •  మూడు చోట్ల కొన్న ఆస్తులు ఈ స్టాంపింగ్ విధానంలోనే కొన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
 •  ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టుకోరు.
 •  ఈ స్టాంప్ విధానం తప్పని భావిస్తే ఈ స్టాంప్ విధానంలో ఇచ్చిన తన నామినేషన్ తప్పని అఫిడవిట్ తోపాటు నామినేషన్ వెనక్కు తీసుకోవాలి.
   

Best Web Hosting Provider In India 2024