
Best Web Hosting Provider In India 2024

Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్నారు. ఈ వ్యాధి వల్ల సినిమాల నుంచి సుమారు ఎనిమిది నెలలుగా ఆమె బ్రేక్ తీసుకుంటున్నారు. మయోసైటిస్‍కు ఆమె వివిధ రకాల చికిత్సలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం గ్రీస్‍లోని ఏథెన్స్ వెకేషన్‍కు ఆమె వెళ్లారు. ఈ క్రమంలో తాను ‘నియర్ ఇన్‍ఫ్రారెడ్ సునా’ అనే చికిత్స తీసుకున్నానని, దాని ప్రయోజనాలు ఇవే అంటూ ఓ ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ నేడు (మే 5) పోస్ట్ చేశారు సమంత. అయితే, ఆమె మరో ఫొటో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశారని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు.
బాత్‍టబ్ ఫొటో పోస్ట్ చేశారంటూ..
బాత్‍టబ్‍లో దుస్తులు లేకుండా ఉన్న ఫొటోను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా పెట్టి సమంత వెంటనే డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో కొందరు ఓ ఫొటో పోస్ట్ చేస్తున్నారు. ఇది తీవ్రంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో సెమీన్యూడ్‍గా ఉంది. ఇలాంటి ఫొటో పోస్ట్ చేస్తావా అంటూ సమంతపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా పోస్టులు చేస్తున్నారు. అయితే, ఈ ఫొటో ఫేక్ అని తెలుస్తోంది. దీన్ని సమంత డిలీట్ చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సమంత అభిమానుల ఆగ్రహం
సమంత బాత్‍టబ్‍లో ఉన్నట్టుగా వైరల్ అవుతున్న ఆ ఫొటో ఫేక్ అని ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత పోస్ట్ చేసి.. డిలీట్ చేశారంటూ ఫేక్ ఫొటోను వైరల్ చేస్తున్న వారిపై ఫైర్ అవుతున్నారు. సమంత కేవలం నియర్ ఇన్‍ఫ్రారెడ్ సునా గురించే ఫొటో పోస్ట్ చేశారని.. ఆ బాత్‍టబ్ ఫొటో ఫేక్ అని చెబుతున్నారు.
అరుదైన వ్యాధితో ధైర్యంగా పోరాడుతూ.. ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పిస్తున్న సమంతపై ఇలాంటి దుష్ప్రచారం సరికాదంటూ చాలా మంది పోస్టులు చేస్తున్నారు. “వ్యాధితో బాధపడుతున్న తన శరీరం కోలుకునేందుకు సమంత ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆ చీప్ ఫొటో ఆమెదే అనేందుకు ఇన్‍స్టాగ్రామ్ ఐడీ సహా ఎలాంటి ఆధారాలు లేవు. 100 శాతం అది ఫేక్. ఇప్పటికైనా దాన్ని ఆపండి” అని ఓ యూజర్ ట్వీట్ చేశారు.
సమంత ఫేక్ ఫొటో వైరల్‍పై సోషల్ మీడియాలో కొందరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ కూడా జరుగుతోంది. కొందరు హీరోల ఫ్యాన్స్.. ఒకరిపై ఒకరు తప్పును నెట్టుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో దుమారంగా మారింది.
సమంత పోస్ట్ చేసింది ఇదే
ఇండియాలో వేసవి కారణంగా తీవ్రమైన వేడి ఉండటంతో గ్రీస్‍లోని ఏథెన్స్ సిటీకి ప్రస్తుతం సమంత రూత్ ప్రభు వెళ్లారు. అక్కడ తాను తీసుకున్న నియర్ ఇన్‍ఫ్రారెడ్ సునా ప్రయోజనాల గురించి ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు. ఈ చికిత్స తీసుకుంటే కండరాలకు రక్తం ప్రసరణ, జీవక్రియలు మెరుగవుతాయని, శరీరంలో ఫ్యాట్ తగ్గి.. శక్తి పెరుగుతుందని తెలిపారు. మరికొన్ని లాభాలను రాసుకొచ్చారు. ఈ ఫొటోలో టవల్ కట్టుకొని ఉన్నారు సామ్. అయితే, దీంతో పాటు బాత్‍టబ్ ఫొటోను కూడా పోస్ట్ చేసి ఆమె డిలీట్ చేశారని కొందరు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామ్ ఫ్యాన్స్.
సమంత చివరగా గతేడాది సెప్టెంబర్‌లో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి చిత్రంలో కనిపించారు. ఆమె నటించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉంది. ఇక, తదుపరి మా ఇంటి బంగారం చిత్రంలో సమంత నటించనున్నారు. ఈ మూవీని ఆమెనే నిర్మిస్తున్నారు. తన పుట్టిన రోజైన ఏప్రిల్ 28న ఈ సినిమా టైటిల్, పోస్టర్‌ను సమంత రిలీజ్ చేశారు.