అసెంబ్లీ వేదిక‌గా ల్యాండ్ టైట్లింగ్‌పై ప‌య్య‌వుల ప‌చ్చి నిజాలు

Best Web Hosting Provider In India 2024

టీడీపీ తీరుపై ప్ర‌జ‌ల ఆగ్ర‌హం 

అమ‌రావ‌తి:  ఎన్నికల సమయంలో వైయ‌స్ జగన్ గారి వ్యక్తిత్వ హననం జరుగుతోంది.ఇందుకు సంబంధించి భారీ కుట్ర జరగుతోంది.  ఎక్కడా లేని ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని బయటకు తెచ్చి ఇది వచ్చిందంటే ఇక మీ భూములన్నీ ఉఫ్… జగన్ ఎత్తుకుపోతాడు.. అంటూ తన బ్యాచ్ తో కలిసి తెగ ప్రచారం చేసాడు… పత్రికలూ…మీడియా..చానెళ్లు ఇవన్నీ నాలుగురోజులపాటు  ఇదే పనిమీద ఉన్నాయ్.. పూనకం వచ్చినట్లు ఊగిపోయారు… ఎల్లో మీడియా సంస్థలన్నీ ఒళ్ళంతా సూదులతో గుచ్చుకుని కొరడాలతో కొట్టుకున్నారు… జనాన్ని భయపెట్టేసి కంగారు పెట్టేసి.. వామ్మో వాయ్యో అనేలా చేసి….సంబరపడుతున్న తరుణంలో మెల్లగా సీఎం వైయస్ జగన్ మైక్ అందుకున్నారు.

 
అసలు ఆ చట్టం ఆంటే ఏమిటి… దానిలోని లోటుపాట్లు…అంతా చిన్నపిల్లలకు వివరించినట్లు చెప్పారు… లక్షల ఎకరాల చుక్కల భూములను పేదలకు పంచింది మీ జగన్…. లక్షల ఎకరాల పోడు భూముల మీద గిరిజనులకు   హక్కులిచ్చాము… ఇంకా చంద్రబాబు గ్యాంగ్ అడ్డుకున్నా.. కోర్టుల్లో కేసులు వేసినా లక్షలమందికి వేలాది ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చాము…ఇదీ మీ జగన్ నిజాయితీ…ఇదీ మీ జగన్ కు మీ పట్ల ఉన్న ప్రేమ… అలాంటి జగన్ మీ భూములు లాక్కుంటాడా ? ఈ ఐదేళ్ల పాలనలో మీరు జగన్ను ఇదేనా అర్థం చేసుకున్నది… అంటూ వివరించారు. దీంతో జనానికి విషయం అర్థమైంది.

అంటే పెన్షన్ల విషయంలో కుట్రపన్నినట్లే ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం విషయంలోనూ చంద్రబాబు కావాలనే ప్రజలను తప్పుదోవపడుతున్నట్లు జనానికి అర్థం ఐంది… దీంతోబాటు అలంటి తప్పుడు ప్రకటనలు..ప్రసంగాలు చేస్తున్నందుకు ఎన్నికల సంఘం ఆదేశాలతో చంద్రబాబు, లోకేష్ సీఐడీ కేసు నమోదు చేసింది.

అయితే ల్యాండ్ టైట్లింగ్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప‌య్య‌వుల కేశ‌వ్ అసెంబ్లీ వేదిక‌గా మాట్లాడిన ప‌చ్చి నిజాలు తెర‌పైకి రావ‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు ప‌చ్చ బ్యాచ్ ఇలా త‌ప్పుడు ప్ర‌చారానికి తెర లేపింద‌ని ఏపీ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. 

అసెంబ్లీ వేదిక‌గా ప‌య్య‌వుల కేశ‌వ్ ఏమ‌న్నారంటే..

Best Web Hosting Provider In India 2024