Best Web Hosting Provider In India 2024
Karthika deepam 2 serial may 6th episode: శోభ తనకున్న ఆస్తి గురించి చెప్పేసరికి అనసూయ మనసు మార్చేసుకుంటుంది. నీ కొడుకు నన్ను మేపడం కాదు నేనే నీ కొడుకుని కూర్చోబెట్టి పందెం కోడిని మేపినట్టు మేపుతున్నాను. ఇంకా ఈ విషయాలు మా అమ్మకి చెప్పలేదు ఆవిడ మీలాంటిదే తెలిస్తే ఉతికి ఆరేస్తుందని అంటుంది.
శోభ తప్పు లేదు
ఇంత చేసిన శోభని ఏలుకోవాలా? లేదంటే వేరే వాడితో తిరుగుతున్న దీపని ఏలుకోవాలా? అని ఏమి తెలియని అమాయకుడిలా మాట్లాడతాడు. ఇంకోసారి అలా మాట్లాడితే నాలుక చీరేస్తానని దీప అంటుంది. వాడు తప్పు ఒప్పుకున్నాడు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈ పిల్లది ఏ తప్పు లేదని అర్థం అవుతుంది.
నువ్వు వచ్చింది మొగుడి కోసమే కదా వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలియగానే ఎలా వదిలిపెట్టి వెళ్లిపోయావు. ఆడది ఏది వదులుకున్నా సంసారం వదులుకోదు కదా. వాడు ఎన్ని మాటలు అన్నా కూడా కాపురం కావాలని అనుకుంటే వీడి గుమ్మం వదిలి పోయేదానివి కాదు.
ఈరోజు చేసినట్టే ఆరోజే నాకు విషయం చెప్పి ఉండేదానివి. కానీ చేయలేదంటే ఏంటి అర్థం అంటుంది. నాకంటే గొప్ప వాడు దొరికితే నాతో ఏం పని అంటే దీప నరసింహ అని చెయ్యి ఎత్తుతుంది. వాడి మాటల్లో ఎంతో కొంత నిజం ఉంది, నిజం లేకపోతే నీకు ఆ ఇంట్లో ఏం పని?
నేను నా కొడుకుతోనే ఉంటా
వీడు నాకు అబద్ధాలు చెప్పడం కాదు నువ్వే నాకు అబద్ధాలు చెప్పావు. అన్ని తెలిసి నువ్వు ఇలా అడిగితే ఏం చెప్పాలని దీప ఏడుస్తూ అడుగుతుంది. తప్పంతా దీప చేసినట్టుగా తన మీద నిందలు మోపుతాడు. మనం ఎన్ని చెప్పినా ఈ మనిషి మారడు, అవసరానికి తగినట్టుగా మారే ఈ మనిషితో నేను నా కూతురు బతకలేము పోదాం పద అత్తయ్య అని తన చేతిని పట్టుకుంటుంది.
అనసూయ దీప చేతిని విదిలించుకుంటుంది. నువ్వు వెళ్ళు నేను నా కొడుకుతోనే ఉంటానని అంటుంది. కొడుకుని చూడకండి ఆరేళ్ళ కష్టాన్ని, అప్పుల భారాన్ని, కోడలికి ఇచ్చిన మాటని మర్చిపోయారా అని దీప ఏడుస్తూ అడుగుతుంది. దీపని వెళ్లిపొమ్మని చెప్తుంది.
ఎక్కడికి వెళ్ళమంటావ్ అంటే ఊరు వెళ్లిపో అంటుంది. అప్పుల వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావ్ అంటుంది. అప్పులు మనమే చేశాం మనమే తీర్చుకుందామని నరసింహ నాటకం ఆడతాడు. అవును అత్తయ్య మా అమ్మని అడిగి డబ్బులు కూడా రెడీ చేశాడు ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మొత్తం నీ చేతుల్లోనే పెడతామని శోభ అనేసరికి అనసూయ తెగ మురిసిపోతుంది.
నీకు నీ కూతురికి మాకు సంబంధం లేదు
శోభ మా అమ్మ దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయని అనేసరికి అనసూయ వెంటనే తనవైపు తిరిగిపోతుంది. దీపని అసహ్యించుకుంటుంది. అప్పులకు, ఆ ఇంటికి ఏ సంబంధం లేదు. అంతేకాదు నీకు మాకు కూడా ఏ సంబంధం లేదు. ఏ తోడు లేకుండా బతకడానికి అలవాటు పడిన దానివి కానీ నర్సిగాడు శోభ లేకుండా బతకలేడు. నీ బతుకు ఏంటో నువ్వు బతుకు అంటుంది.
నీ కొడుకు వదిలేసినా నేను నిన్ను వదలనందుకు బాగానే బుద్ధి చెప్పావు చెప్పుతో కొట్టినట్టు చాలా మర్యాదగా చెప్పావు. నిన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చినందుకు నాకు బుద్ధి లేదని అనుకుంటుంది. నువ్వు నా తమ్ముడికి పట్టిన దరిద్రానివి తల్లిని మింగేశావు, వాడిని మింగేశావు.
నువ్వు ఇప్పుడు మాకు పట్టావు. ఇన్నాళ్ళకు మాకు పట్టిన దరిద్రం వదిలింది. నీకు నీ కూతురికి మాకు ఏ సంబంధం లేదని అంటుంది. దీంతో దీప బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అత్తని బుట్టలో వేసుకునేందుకు షాపింగ్ అంటూ శోభ తెగ హడావుడి చేస్తుంది.
దీప వెళ్లిపోయేలా నువ్వే చేశావ్
ఇక ఊరు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవాలి. దీపతో ఇక తనకు సంబంధం లేదని అనసూయ మనసులో అనుకుంటుంది. జ్యోత్స్న ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే పారిజాతం వచ్చి పలకరిస్తుంది. ఫ్రెండ్స్ తో అలా సరదాగా బయటకు వెళ్ళి ఎక్కువ తాగకుండా కాస్త తాగి ఎంజాయ్ చేయమని అంటుంది.
శివనారాయణ వచ్చి ఏంటి చెప్తున్నావ్ అంటాడు. దశరథ, సుమిత్ర ఫ్రెండ్ ఎంగేజ్ మెంట్ కి వెళ్తున్నామని చెప్తారు. అందరి ఎంగేజ్ మెంట్ కి వెళ్ళడం కాదు మన ఇంట్లో ఎప్పుడు జరిపిస్తారని అంటుంది. అది తన అల్లుడు చెప్పాలని దశరథ అంటాడు. అప్పుడే కార్తీక్ శౌర్యని ఎత్తుకుని వస్తాడు.
ఏంటే అమ్మమ్మ మా అల్లుడు చంక ఎక్కావని సుమిత్ర అంటే మీ అల్లుడు కాదు మా కార్తీక్ అంటుంది. పారిజాతం శౌర్యని తిడుతుంది. దీప ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం కూడా నువ్వే అయి ఉంటావని శివనారాయణ అనుమానిస్తాడు.
గుండెలు పగిలేలా ఏడుస్తున్న దీప
శౌర్యని చూసి జ్యోత్స్న కోపంగా మొహం పెడుతుంది. అమ్మని పిలవమని శివనారాయణ అడుగుతాడు. చిన్న పని ఉండి బయటకు వెళ్ళిందని సుమిత్ర చెప్తుంది. దీపకు ఏవో చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి మా తరపున నువ్వు అడుగు అని శివనారాయణ అంటాడు.
కార్తీక్ శౌర్యని తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న అది చూసి రగిలిపోతుంది. దీప అనసూయ మాటలు తలుచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూ రోడ్డు మీద నడుస్తూ వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు భర్త చేతిలో మోసపోయిన భార్యని అనుకున్నాను ఇప్పుడు అత్త చేతిలో మోసపోయిన కోడలిని చేశావా అత్తయ్య. లేని ఆశలు మొలకెత్తించి మొదలుకే నరికేశావు మళ్ళీ జీవితంలో చిగురించకుండా చేశావని దీప బాధపడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.