Best Web Hosting Provider In India 2024
The Goat Life OTT Release Date: మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన రెండో సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఆడుజీవితం. ది గోట్ లైఫ్ పేరుతో మిగతా భాషల్లోకి కూడా వచ్చింది. మంజుమ్మల్ బాయ్స్ తర్వాత ఈ ఏడాది మలయాళం నుంచి వచ్చి హిట్ మూవీ ఇది. ఇప్పటికే మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీలోకి వచ్చేయగా.. ఇప్పుడీ ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ కూడా రానుంది.
ఆడుజీవితం.. ఈ వారమే వస్తుందా?
సలార్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. అతడు నటించిన సినిమానే ఈ ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. మార్చిలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఇప్పుడీ మూవీ రానున్న శుక్రవారం (మే 10) నుంచే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఆడుజీవితం మూవీ మే 26 నుంచి హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందని కూడా సమాచారం. ఈ రెండు తేదీలపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా రాలేదు. ది గోట్ లైఫ్ మూవీలో పృథ్వీరాజ్ ఓ కేరళ వలస కూలి నిజ జీవిత పాత్రను పోషించాడు. 1990ల్లో సౌదీ వెళ్లి అక్కడి ఎడారిలో బానిసగా బతికిన నజీబ్ అనే కూలీ పాత్రలో పృథ్వీరాజ్ జీవించేశాడు.
ఈ సినిమాకు మలయాళంతోపాటు ఇతర భాషల్లోనూ మంచి రెస్పాన్సే వచ్చింది. ముఖ్యంగా సుకుమారన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సలార్ మూవీలో అతని పాత్రకు, ఈ పాత్రకు ఎంతో తేడా ఉంది. దీనినిబట్టే అతనిలో ఎంతటి పరిపూర్ణ నటుడు ఉన్నాడో మనకు అర్థమవుతోంది.
హాట్స్టార్లోని మలయాళం మూవీస్
ఈ మధ్యకాలంలో మలయాళం సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్ లో, ఓ కథను భిన్నంగా, మనసుకు హత్తుకునేలా చెప్పడంలో మాలీవుడ్ మేకర్స్ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి మలయాళం సినిమాలు డిన్నీ ప్లస్ హాట్స్టార్ లో చాలానే ఉన్నాయి. ఆదివారమే (మే 5) మంజుమ్మల్ బాయ్స్ కూడా వచ్చేసింది.
ఇది కాకుండా నేరు, ప్రేమలు, అబ్రహం ఓజ్లర్, ఫలిమి, రోర్షాక్, రోమాంచం, కన్నూర్ స్క్వాడ్, కింగ్ ఆఫ్ కోత, మలైకొట్టై వాలిబన్, నెయ్మార్ లాంటి సినిమాలు హాట్స్టార్ లో ఉన్నాయి. వీటిలో చాలా వరకూ సినిమాలు తెలుగులోనూ అందుబాటులో ఉండటం విశేషం. లేదంటే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనూ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు.
మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ తెలుగులోనూ వచ్చింది. ప్రస్తుతం హాట్స్టార్ తెలుగు ట్రెండింగ్ మూవీస్ లో ఈ సినిమా ఐదో స్థానంలో ఉండటం విశేషం. ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరిన్ని సూపర్ హిట్ మూవీస్ విషయానికి వస్తే అన్వేషిప్పిన్ కండెతుమ్ నెట్ఫ్లిక్స్ లో, భ్రమయుగం సోనీలివ్ ఓటీటీల్లో ఉన్నాయి.