Best Web Hosting Provider In India 2024
Thalaimai Seyalagam OTT: ప్రస్తుతం దేశమంతా ఎన్నికల హీట్ ఉండగా.. ఈ తరుణంలో ఓటీటీలోకి ఓ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. తలైమై సేయలగం పేరుతో ఈ సిరీస్ రానుంది. ఈ సిరీస్‍లో తమిళ నటుడు కిశోర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల సలార్ మూవీతో తెలుగులోనూ సూపర్ పాపులర్ అయిన తమిళ నటి శ్రీయారెడ్డి కూడా ఈ సిరీస్‍లో ఓ ప్రధాన పాత్ర చేశారు. అయితే, ఈ తమిళ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు రానుందని తాజాగా అప్‍డేట్ వచ్చింది.
స్ట్రీమింగ్ డేట్
తలైమై సేయలగం వెబ్ సిరీస్ మే 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ ఇటీవలే వెల్లడించింది. టీజర్ కూడా రిలీజ్ చేసింది. మొత్తంగా సీరియస్ పొలిటికల్ డ్రామాగానే ఈ సిరీస్ ఉండనుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది.
తలైమై సేయలగం వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్‍లోనూ జీ5 ఓటీటీలో మే 17వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై జీ5 ఓటీటీ ఓ పోస్టర్ కూడా తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమిళం, తెలుగుల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు వస్తుందని పేర్కొంది.
తలైమై సేయలగం సిరీస్ గురించి..
తలైమై సేయలగం వెబ్ సిరీస్‍కు జాతీయ అవార్డు దర్శకుడు వంసతబాలన్ దర్శకత్వం వహించారు. కథను రాసుకున్న ఆయనే ఈ సిరీస్‍ను రూపొందించారు. ఈ సిరీస్‍లో కిశోర్, శ్రీయారెడ్డి ప్రధాన పాత్రలు చేస్తుండగా.. భరత్, రమ్య నంబీషన్, ఆదిత్య మీనన్, కానీ కుస్రుతి, నిరూప్ నందకుమార్, దర్శ గుప్తా, సారా బ్లాక్, సిద్ధార్థ్ విపిన్, సంతాన భారతి కీలకపాత్రలు పోషించారు.
తలైమై సేయలగం వెబ్ సిరీస్‍ను రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ పతాకంపై రాధికా శరత్ కుమార్, శరత్ కుమార్ నిర్మించారు. ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందించగా.. రవిశంకర్ సినిమాటోగ్రఫీ చేశారు. ఇటీవలే వచ్చిన టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ సిరీస్‍పై మంచి అంచనాలు ఉన్నాయి.
8ఏఎం మెట్రో..
8ఏఎం మెట్రో అనే బాలీవుడ్ సినిమా థియేటర్లలో రిలీజైన సంవత్సరం తర్వాత జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మే 10వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తెలుగులో మల్లేశం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ.. ఈ 8ఏఎం మెట్రో చిత్రాన్ని తెరకెక్కించారు. 2023 మేలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. 8ఏఎం మెట్రో చిత్రంలో గుల్షన్ దేవాయ, సాయామీ కేర్ ప్రధాన పాత్రలు పోషించారు.
8ఏఎం మెట్రో సినిమా అధిక భాగం హైదరాబాద్ మెట్రోలోనే చిత్రీకరించారు మేకర్స్.. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చే ఓ గృహిణి, ఓ బ్యాంకు ఉద్యోగి మధ్య మెట్రోలో పరిచయం, వారి మధ్య స్నేహం చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా ఫీల్‍గుడ్ స్టోరీగా ఉంటుంది. 8ఏఎం మెట్రో చిత్రాన్ని జీ5 ఓటీటీలో మే 10వ తేదీ నుంచి చూసేయవచ్చు. ఈ విషయంపై ఆ ప్లాట్‍ఫామ్ ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది.