Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి?
చంద్రబాబు పంచన చేరి..వైయస్ జగన్ గారిపై విషం చిమ్ముతారా?
చంద్రబాబు ఏ డాన్స్ చేయమంటే ఆ డాన్స్ చేస్తున్నావు: శ్రీ పేర్ని నాని
విన్నకోట గ్రామంలో 25 మంది రైతులు కలిసి ఓ చెరువును ఏర్పాటు చేసుకున్నారు.
అందులో పీవీ రమేష్ తండ్రి గారికీ భూమి ఉంది.
గాలంకి నాగేంద్ర అనే వ్యక్తికి, రమేష్‌కు కోర్టులో కేసులు నడుస్తున్నాయి.
పీవీ రమేష్ తనకున్న భూమికంటే అదనంగా లీజు పోందుతున్నారని ఆరోపణ ఉంది.
దీనికోసమే జనవరి నెలలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు.
ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా చెరువును కాళీ చేయిస్తున్నారు.
పోలింగ్ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి సమాచారం అందించారు.
ఇందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి సంబంధం ఏమిటి?
చంద్రబాబు కోసం మీరు ఇంత కిరాతకంగా మాట్లాడాలా?: పేర్ని నాని
తాడేపల్లి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి? అని ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌ను వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఐఏఎస్ చదువుకుని ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..? అంటూ ఆయన నిలదీశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి గారిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఏం మాట్లాడారంటే:
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?:
- – ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారు.
- – జగన్మోహన్రెడ్డి గారిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు.
- – తాను మాజీ ఐఏఎస్ అధికారిని అయినా కూడా జగన్ గారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నా పొలం మ్యుటేషన్ జరగట్లేదని పీవీ రమేష్ ట్వీట్ చేశారు.
- – పెద్ద పెద్ద చదువులు చదువున్న మీరు ఇంత అసహ్యంగా, దిగజారి మీరు ప్రవర్తించాలా?
- – పీవీ రమేష్‌ది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామం.
- – ఈ గ్రామంలో తన తండ్రి పేరుపై ఉన్న పొలం తన పేరుపైకి మార్చడం లేదంటూ అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడుతున్నారు.
- – రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారు.
- – 25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక చెరువు తవ్వి లీజుకు ఇస్తూ వస్తున్నారు.
- – ఏడాది క్రితం రమేష్ తండ్రి సుబ్బారావు గారు మరణించారు.
- – ఆయన మరణించిన తర్వాత రమేష్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారట. అప్పటి నుంచీ విచారణలు జరుగుతున్నాయి.
- – గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు, రమేష్‌కు కోర్టులో కేసులు నడుస్తున్నాయి.
- – వివాదాలున్నాయి. ఆ చెరువులో వీళ్లకి సంబంధించిన పొలం ఎంతో కొంత ఉంది.
- – దీనికోసమే జనవరి నెలలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు.
- – ఆ విచారణకు అందరు రైతుల్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మని చెప్పారు.
- – అయితే పీవీ రమేష్ మాత్రం తన గుమస్తాకు ఫోటోస్టాట్ కాపీలిచ్చి పంపారట.
- – ఫోటోస్టాట్ కాదు..ఒరిజినల్స్ పంపండి అని చెప్పారు. ఆయన రాడు..సరే గుమస్తాను పంపినా ఒరిజినల్స్ కావాలి కదా?
- – అక్కడ ఉన్న వివాదాన్ని తీర్చడం కోసమే మూడు నెలలుగా ఆ చెరువును అధికారులు ఎండబెడుతున్నారు.
- – ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిహద్దులు ఫిక్స్ చేసి ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
- – ఇంత కథ నడుస్తుంటే ఇంత విషం చిమ్మడం ధర్మమా పీవీ రమేష్?
మీ వివాదానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి?:
- – అక్కడున్న రైతులందరికీ, మీకు తగాదా ఉండటం ఏంటి? అక్కడున్న ల్యాండ్ కన్నా మీరు అదనంగా లీజు పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
- – ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. చెరువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కదా కొలతలు వేసి ఎవరి హద్దు ఏంటో చెప్పేది?
- – ఎటువంటి వివాదం లేకపోతే, అది వ్యవసాయ భూమి అయి హద్దులు క్లియర్ గా ఉంటే..ప్రభుత్వాన్ని విమర్శించినా ఒక అర్ధం ఉంది.
- – ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి?
- – చంద్రబాబు పంచన చేరి ఐఏఎస్ చదువుకుని పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా?
- – చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్ కట్టమంటే ఆ డాన్స్ కడుతున్నారు. ఏ ట్వీట్ చేయమంటే ఆ ట్వీట్ చేస్తున్నారు.
- – చంద్రబాబుకు అధికారం సంపాదించడం కోసం మీరు ఇలా తప్పుడు ప్రకటనలు చేసి జగన్‌గారి ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గమైన చర్య.
- – మీరు విన్నకోట గ్రామం రండి..అక్కడేం జరుగుతుందో చూడండి.
- – మీ కోసమే.. ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా వీఆర్వోలను కాపలా పెట్టి మరీ చెరువును కాళీ చేయిస్తున్నారు.
- – పోలింగ్ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి కూడా సమాచారం అందించారు.
- – ఆ చెరువు మధ్యలోనే ఆవుల దొడ్డి కింద ఓ 3.5 ఎకరాల వివాదాస్పద భూమి కూడా ఉంది.
- – మీతో ఉన్న ఆ 25 మంది రైతులు కూడా ఆ ఆవుల దొడ్డి భూమి మాదంటే మాది అని క్లెయిమ్ చేస్తున్నారు.
- – ఇలాంటి చరిత్ర కలిగిన భూమిని మీ నాన్నగారు మీకు అప్పజెప్పారు.
- – ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు మ్యుటేషన్ అవ్వడం లేదని ఇంతగా దిగజారడం అవసరమా?