Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

Best Web Hosting Provider In India 2024

Koratala Siva – Devara: చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్న సినిమాల్లో దేవర మొదటి వరసలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిసున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవర చిత్రంపై పాన్ ఇండియా రేంజ్‍లో క్యూరియాసిటీ ఉంది. దీంతో ఈ మూవీ అప్‍డేట్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివకు దేవర అప్‍డేట్ ఇవ్వాలనే ప్రశ్న ఎదురవగా.. ఆయన స్పందించారు.

సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ చిత్రానికి కొరటాల శివ సమర్పకుడిగా ఉన్నారు. ఈ మూవీ మే 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో కృష్ణమ్మ మూవీ ప్రమోషన్ కోసం తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ పాల్గొన్నారు. అయితే, దేవర గురించి అప్‍డేట్ చెప్పాలని ఆయనకు ప్రశ్న ఎదురైంది.

స్పెషల్‍గా ఉంటుంది

అభిమానులు కాలర్ ఎగరేసేలా దేవర ఉంటుందని టిల్లు స్క్వేర్ ఈవెంట్‍లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటను గుర్తు చేస్తూ.. కొరటాల శివను ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్న అడిగారు. ఒక్క అప్‍డేట్ ఇవ్వాలని అడిగారు.

దేవర గురించి మాట్లాడడానికి చాలా టైమ్ ఉందని, అయితే ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని కొరటాల శివ అన్నారు. “ఆయనే (ఎన్టీఆర్) చెప్పారు. నేను ఇంతకు ముందే చాలా మాట్లాడా. ఇప్పుడు చాలా టైమ్ ఉంది. ఇది కచ్చితంగా నాకు, అభిమానులకు చాలా స్పెషల్ మూవీగా ఉంటుంది. అంత వరకు చెప్పగలను. ఇంకా చాలా టైమ్ ఉంది. వరుసగా అప్‍డేట్లు వస్తాయి” అని కొరటాల శివ అన్నారు.

తనతో పాటు తమ కృష్ణమ్మ మూవీ యూనిట్‍లో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులేనని సత్యదేవ్ అన్నారు. కృష్ణమ్మ డైరెక్టర్ వీవీ గోపాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ కాళభైరవ ఇలా చాలా తమ టీమ్‍లో చాలా మందికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. కృష్ణమ్మ చిత్రం మే 10న విడుదల కానుంది.

దేవర గురించి..

ఏప్రిల్‍లో రిలీజ్ కావాల్సిన దేవర సినిమా ఏకంగా అక్టోబర్‌కు వాయిదా పడింది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దేవర మూవీలో విలన్ పాత్ర చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలు భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ హిందీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్మ్స్ ఇప్పటికే భారీ ధరకు సొంతం చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడవడం ఖాయమే.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024