AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు

Best Web Hosting Provider In India 2024

AP Rains : ఏపీలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిసింది. 

అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లో ధాన్యం తడిసిపోయిందని ఆవేదన చెందుతున్నారు. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి…ఇప్పుడు తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఏపీలో పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు,టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని తెలిపింది. 

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు , పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం నెల్లూరు, కోనసీమతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Ap RainsWeatherAndhra Pradesh NewsTrending ApAmaravatiWest Godavari
Source / Credits

Best Web Hosting Provider In India 2024