కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా?!

Best Web Hosting Provider In India 2024

పేదల కడుపుకొట్టే నిర్ణయాలా?

మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్

పథకాలకు మోకాలడ్డు.. లబ్ధిదారులకు నరకం

కూటమికి ఎన్నికల సంఘం వత్తాసు

ఫిర్యాదు చేసినా వెంటనే స్పందన!

ఈసీ ఎందుకలా వ్యవహరిస్తోంది?

ఇకనైనా ఈసీ విజ్ఞతతో వ్యవహరించాలి

 మంత్రి  బొత్స సూచన

గతి తప్పుతున్న చంద్రబాబు ప్రసంగాలు

వ్యక్తిగత దూషణలు, నిందల పర్వం

అయినా స్పందన లేని ఎన్నికల సంఘం

బాబు భాషపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోదు?

సూటిగా ప్రశ్నించిన మంత్రి  బొత్స

ఇన్‌పుట్‌ సబ్సిడీ వద్దన్నారు. విద్యాదీవెనకూ బ్రేక్‌

రైతులు నష్టపోతే ఎవరిది బాధ్యత?

విద్యాదీవెనకూ, ఎన్నికలకూ ఏం సంబంధం?

వాటిని ఆపడం ఎంత వరకు సబబు?

 ఈసీ తీరుపై మంత్రి బొత్స ఆక్షేపణ

కూటమి.. ఓ తోడు దొంగల కూటమి

కూటమి స్క్రిప్ట్‌ను ప్రధాని చదివేస్తున్నారు

అందుకే మా ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు

నాడు బాబుపై విమర్శలు. నేడు ప్రశంసలు

ప్రధాని మాటలకు ఒక పవిత్రత ఉండాలి

 ప్రెస్‌మీట్‌లో మంత్రి బొత్స స్పష్టీకరణ

విశాఖపట్నం:  టీడీపీ కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా? అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. వారి చ‌ర్య‌ల‌తో పేదల కడుపుకొట్టే నిర్ణయాలా? అని ప్ర‌శ్నించారు. విశాఖపట్నంలో మీడియాతో  మంత్రి మాట్లాడారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..:

నీచంగా కూటమి ఆలోచన:
– ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసిన కూటమి ఆలోచనలు ఎంతో నీచంగా, దుర్మార్గంగా, మానవత్వం లేకుండా ఉన్నాయి.
– వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని, ఈసీ ద్వారా అడ్డుకున్న వారు.. తమ దుర్మార్గ చర్యల వల్ల.. గత నెల, ఈనెల 40 మంది వరకూ పొట్టన పెట్టుకున్నారు. 
– ఇంత మానవత్వం లేకుండా కూటమి ఎందుకు ఆలోచిస్తోంది? వాళ్ల ఆలోచనలు చాలా కఠోరంగా ఉన్నాయి.
– వైఎస్సార్‌ ఆసరా పథకంలో సుమారు 79 లక్షల మంది లబ్ధిదారులున్నారు. పథకంలో చివరి విడతలో ఇంకా, సుమారు రూ.1839 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం వద్ద డబ్బున్నా విడుదల చేయవద్దని టీడీపీ, వారి కూటమి ఫిర్యాదులు చేసి ఆపించేశారు.
– గత నెల 24న, ఆ చెల్లింపులు చేయాల్సి ఉండగా, దానిపై పలు దఫాలుగా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అనుమతి కోరినా, ఈసీ ఒప్పుకోలేదు. 
– ఇదొక్కటే కాదు.. విద్యాదీవెన కూడా అలానే చేశారు. 28 లక్షల మంది లబ్ధిదారులకు రూ.703 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. 
– నిజానికి, ఇవన్నీ ఆన్‌ గోయింగ్‌  ప్రోగ్రామ్‌లే. అందుకే ఎన్నికల సంఘాన్ని గత నెలలోనే అనుమతి కోరినా, అమలుకు అంగీకరించలేదు.
– విద్యాదీవెన కోసం ఒకవైపు విద్యార్థులు ఎదురు చూస్తుండగా, మరోవైపు యాజమాన్యాలు కూడా నిధుల కోసం మమ్మల్ని సంప్రదించాయి.
– అసలు ఈ పథకాలకు, ఎన్నికలకు ఏం సంబంధం?. విద్యాదీవెనకు, ఎన్నికలకు ఏం సంబంధం? ఇవన్నీ సాధారణంగా జరగాల్సిన కార్యక్రమాలు. 
– దీనికి కూటమి ఇంత నీచంగా ఫిర్యాదులు చేయడం, ఎన్నికల కమిషన్‌ దాన్ని ఆపడం జరిగింది.
 – ఇంకా తుఫానులు, కరవు పరిస్థితులు వచ్చినప్పుడు ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఆగిపోయింది. 
– గత ప్రభుత్వాల్లా కాకుండా ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో నష్టపరిహారం ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం.
– గత ప్రభుత్వాలైతే నష్టం జరిగిన రెండేళ్లకు కానీ ఇచ్చేవి కావు.
– ఇటీవల వచ్చిన తుఫాను, కరవు వల్ల 13.60లక్షల మందికి రూ.1294 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
– బ్యాంకుల్లో డబ్బు ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని చెప్పినా వినిపించుకోలేదు.
– మరి రైతులు ఆర్థికంగా నిలదొక్కకుంటారు. ఇది కూటమి కర్కశమైన ఆలోచన.
– వైఎస్సార్‌ చేయూత కూడా మూడు విడుతలు ఇచ్చాం. నాలుగో విడుత బటన్‌ నొక్కారు.
– లబ్ధిదారులు 33 లక్షల మందికి ఆ నిధులు విడుదల చేస్తామంటే, దానికీ ఒప్పుకోలేదు. రూ.565 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 
– ఈబీసీ నేస్తం కింద 4.20లక్షల మంది లబ్ధిదారులున్నారు. వారికి రూ.629 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
– అసలు ఈ కూటమి ఏమనుకుంటోంది? పేదవాడు బతకొద్దా? 
– ఎన్నికలు వచ్చాయని సామాన్యుడి రోజు వారీ కార్యక్రమాలు జరగొద్దా? 
– ఎన్నికలు వచ్చిన మూడు నెలలు వాళ్లు గౌరవంగా బతకనక్కర్లేదా? 
– ఇంతటి దుర్మార్గపు ఆలోచన ఎప్పుడైనా జరిగిందా? 

ఆరోజు మేము అడ్డుకోలేదే?.
– 2019లో పసుపు కుంకుమ అనే కార్యక్రమాన్ని ఎన్నికల నోటిఫికేషన్‌ తరవాత ఇచ్చారు. 
– మేం ఆరోజు ఏమైనా అడ్డుపెట్టామా? ఇవ్వకూడదని మేమేమన్నా ఫిర్యాదులు చేశామా? 
– మీకు ఇలాంటి బుద్ధులేంటి? 
– దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళలు, రైతులు, విద్యార్థులను వారి చేష్టలు చూడమని కోరుతున్నాం. 
– ఈ కూటమి నీచమైన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, వారి కర్కశమైన, మానవత్వం లేని ఆలోచనలు గమనించాలి. 
– ఏది ఏమైనా ఎన్నికలైన మరుక్షణమే బ్యాంకుల్లో ఉన్న డబ్బును విడుదల చేస్తాం. 
– ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న కూటమికి ప్రజలు బుద్దిచెప్పాలని కోరుతున్నా.

చంద్రబాబు మాటలు సభ్యసమాజం హర్షించేవేనా?:
– చంద్రబాబు అండ్‌ కో సహనం కోల్పోయారు. అసహనం ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటి కుయుక్తులను పాల్పడుతున్నారు. 
– ఓవైపు వృద్ధుల్ని హింసిస్తున్నారు.. మరో వైపు మహిళలకు గౌరవంగా అందుతున్న లబ్ధిని అడ్డుకుంటున్నారు. 
– విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందకుండా చేస్తున్నారు. 
– ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్న మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న ఈబీసీ నేస్తానికి మోకాలడ్డుతున్నారు. 
– ఎన్నికలు ఉన్న ఈ మూడు నెలలు వారు గాలికి బతకాలా? 
– ఏరకంగా వారు వాళ్ల గౌరవాన్ని కాపాడుకుంటారు?
– దీనికి తోడు జగన్‌మోహన్‌రెడ్డి గారిపై సహనం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 
– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ సభ్యసమాజంలో ఒక ముఖ్యమంత్రిని అలాంటి మాటలు మాట్లాడవచ్చా? 
– ఎవరికైనా తల్లి తల్లే కదా? ఆ భాష ఏంటి? 
– నీ అమ్మ మొగుడు, నీ బాబు అంటూ వాడుతున్న పదజాలాన్ని సభ్యసమాజం హర్షిస్తుందా?
– ఆ మాటలు మాకు ఎవరికీ రావనుకున్నారా? మాకు సభ్యత సంస్కారం ఉంది.
– చంద్రబాబు..నువ్వు అలాంటి మాటలతో ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నావు?
– ఛీ..ఛీ.. అతని పేరెత్తడానికే చాలా అసహ్యంగా ఉంది.

జరగాల్సిన మేలుకు మోకాలడ్డి.. చావులకు కారణం అవుతున్నాడు:
– ఒక పక్క  జరుగుతున్న మేలుకు మోకాలడ్డి వాళ్ల చావులకు కారణం అవుతున్నాడు చంద్రబాబు.
– మరో పక్క ప్రజలకు అందుతున్న లబ్ధిని ఎన్నికల పేరు చెప్పి అడ్డుకుంటున్నావు.
– కూటమి ఫిర్యాదు చేస్తే తానా అంటే తందాన అన్నట్లు ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోంది.
– ఎన్నికల నిబంధనలకు, రాజ్యాంగానికి మేము వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలను పరిశీలించాలి.
– అంతే కానీ.. వాళ్లు ఫిర్యాదు ఇస్తే.. దాని వల్ల సమజానికి, వ్యక్తులకు, వ్యవస్థను నష్టమా అనేది ఆలోచించకుండా వాళ్ల చావులకు కారణం అవ్వడం భావ్యమా? 
– చంద్రబాబు అటువంటి భాష మాట్లాడినప్పుడు ఎన్నికల కమిషన్‌ ఎటువంటి చర్యలు తీసుకుంది? 
– వృద్ధుల చావులకు కారణమైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? 
– ఇన్‌పుట్‌ సబ్సిడీ అందక రైతులు నష్టపోతే ఎవరిది బాధ్యత?
– విద్యార్థులకు ఫీజులు అందక వాళ్లను పరీక్షలు రాయనివ్వకపోవడం, టీసీలు ఇవ్వకపోవడం జరిగితే ఎవరిది బాధ్యత? 
– గౌరవంగా మహిళలు బతకాలని ఇస్తున్న చేయూత కార్యక్రమాన్ని ఆపడానికి ఎవరిది బాధ్యత? 
– వీటన్నిటి కూటమి బాధ్యత కాదా? ఎన్నికల కమిషన్‌ బాధ్యత కాదా?
– గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేస్తే మాత్రం వీళ్లు ఓకే అంటున్నారు. 
– అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు సజావుగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానం వ్యక్తం చేశారు.

కొంచెం ఓపిక పట్టండి:
– కొద్దిగా ఓపికపట్టండి. మీ గర్వం మీరు కాపాడుకోండి. ఈ పదిహేను రోజులు వెళ్లిన తర్వాత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.
– అప్పుడు ఏ కూటమి దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. చట్టం, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.
– దీనిపై కొన్ని సంస్థలు హైకోర్టుకు వెళ్లాయి. అవసరమైతే ప్రభుత్వం కూడా వెళ్తుంది.

కూటమి గెలిచే అవకాశాలు ఎక్కడున్నాయ్‌..?:
– మొన్నామధ్య ఆ సెలబ్రిటీ నాయకుడు ముఖ్యమంత్రిగారిపై నోటికొచ్చినట్లు మాట్లాడాడు.
– నిన్న సాక్షాత్తు చంద్రబాబునాయుడే ఆ భాష మాట్లాడాడు. దాన్ని ఏమనుకోవాలి? 
– రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు సబబేనా? ఆ భాష ఎదుటి వారికి రాదా?
– మా పార్టీ నాయకత్వానికి సభ్యత, సంస్కారం ఉంది కాబట్టి, మా ముఖ్యమంత్రి గారు మాకు నేర్పిన సభ్యత వల్ల మాట్లాడటం లేదు.
– మోడీ గారు చెప్పినా..ఇంకెవరు చెప్పినా..కూటమి గెలిచే అవకాశాలు ఎక్కడున్నాయి? 

అది ధర్మం కాదు:
– ఈసీని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడించడం ధర్మం కాదు.
– మోడీ ఎవరో చెప్పింది మాట్లాడతారు. నేను స్థానికంగా ఉన్నవాడ్ని. వాస్తవాలు ఏంటో మాట్లాడతాను.
– ముగ్గురూ తోడు దొంగలే. ఒక దొంగ మరొక దొంగకు సహకరించుకుంటున్నారు. 
– ల్యాండ్‌ టైటిలింగ్‌యాక్ట్‌పై బీజేపీ సోదరులే మంచి కార్యక్రమమని చెప్తున్నారు. 
– విస్తృతంగా చర్చించి, చట్టాన్ని రూపొందించాలని కేంద్రమే చెప్తోంది.
– సామాన్య ప్రజలకు కాపాడటానికి ఇది బ్రహ్మాస్త్రం అని న్యాయవాదులు కూడా చెప్తున్నారు.
– స్థానికంగా ఉన్న స్టీల్‌ ప్లాంట్, ప్రజల అవసరాలు వారికి అక్కర్లేదు. 
– ఈ తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్‌ ఇస్తే ఆది చదివేసి వెళ్తారు..అంతే! 
– వీళ్లా మా గురించి మాట్లాడేది? ఆయనొచ్చి మాకు శుద్ధులు చెప్తాడా? 
– ఆయన అదే నోటితో చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడని చెప్పాడుగా? 
– ఇప్పుడు మర్చిపోయాడా? ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడటమేనా? 
– వాస్తవాలు, నిజాలు అవసరం లేదా? ఆ పదవికి విలువ తీసేస్తున్నారు.
– ప్రధాన మంత్రి మాటలంటే దానికి ఒక పవిత్రత ఉండాలి. 
– ఈ దేశంలో ఎంతో మంది ప్రధానిమంత్రులుగా చేశారు. ఇంత దిగజారిపోయి మాట్లాడే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు.

పోలవరంలో అవినీతి జరిగిందంటే, విచారణ చేయించుకోవచ్చుగా?:
– పోలవరానికి ప్రధానమంత్రి.. రూ.15 వేల కోట్లకు ఈసీలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేశారా?
– అందులో అవినీతి జరిగింది అనే అనుమానం వస్తే తన టీంను పంపి విచారణ చేయించవచ్చు కదా?
– ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అంత వేక్‌గా మాట్లాడకూడదు కదా?
– లేదు వాళ్లు వచ్చి విచారణ చేసి నిజంగా ఏదన్నా జరిగిందని చెప్తే అప్పుడు మేం సమాధానం చెప్పుకోవాలి.
– అది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం సహకారం ఉంటే తప్పకుండా అవుతుంది.
– చంద్రబాబు హయాంలో పునరావాసానికి ఇవ్వాల్సిన సొమ్మును ఫ్రీజ్‌ చేశారని షెకావత్‌ చెప్పారు. 
– అప్పట్లో చూపిన లబ్ధిదారులు సరైనవాళ్లు కాదని వాస్తవ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
– మరి నిర్వాసితులకు ఎవరు డబ్బు ఇస్తారు? ఆ బాధ్యత కేంద్రానిదే.
– చంద్రబాబు నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడం మనందరికీ తెలుసు.
– ఆయన తప్పులను కూడా సరిచేసే కార్యక్రమం చేస్తున్నాం.

చట్టమే లేదు. మరి బాధితుడు ఎలా అయ్యాడు?:
– యాక్ట్‌ లేకుండా పీవీ రమేష్‌ బాధితుడు ఎలా అవుతాడు?
– ఆయనకు, నాకు డిబేట్‌ పెట్టండి.. వాస్తవాలేంటో ప్రజలకు తెలుస్తాయి.
– ఈయన ఐఏఎస్‌ ఆఫీసర్‌గా చేశాడు కాబట్టి ఆవతలి వాడిపై జులుం చేసి కొట్టేయాలని చూస్తున్నాడేమో..ఎవరికి తెలుసు? 
– ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి పథకాల లబ్ధిని ఆపే దౌర్భాగ్యపు పనులు చేశారు?. అని మంత్రి శ్రీ బొత్స ఆక్షేపించారు.

Best Web Hosting Provider In India 2024