చంద్ర‌బాబు, ఈనాడుపై ఈసీకి ఫిర్యాదు

Best Web Hosting Provider In India 2024

 అమ‌రావ‌తి: ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు,ఈనాడు లపై వైయ‌స్ఆర్‌సీపీ  ఫిర్యాదు చేసింది. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీగ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి లు ఎన్నికల కమీషన్ అధికారులకు ఇందుకు సంబధించి ఆధారాలను అందచేశారు.

చంద్రబాబు ఈనెల 6 వతేదీన అనకాపల్లి,పాణ్యం నియోజకవర్గాలలో బహరంగసభలలో ప్రసంగిస్తూ సీఎం వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచితవ్యాఖ్యలు చేశారు.ఇధి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 ఈనాడు దినపత్రికలో సీఎం వైయస్ జగన్ పై మార్పింగ్ ఫోటోలు వేస్తూ న్యూస్ ఆర్టికల్ రాసి వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచినందుకు గాని ఈనాడు యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. 

Best Web Hosting Provider In India 2024