Rajadhani Files: ఓటీటీ కాదు…డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైన రాజ‌ధాని ఫైల్స్‌- పొలిటిక‌ల్ మూవీని ఫ్రీగా చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

Rajadhani Files: రాజ‌ధాని ఫైల్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కాకుండా యూట్యూబ్‌లో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా రాజ‌ధాని ఫైల్స్ మూవీని యూట్యూబ్‌లో చూడొచ్చ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఏపీ రాజ‌కీయాల‌పై తీసిన ఈ మూవీ టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. భాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అఖిల‌న్‌, వీణ‌, వినోద్‌కుమార్‌, వాణి విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించాడు.

సినిమాపై కోర్టు స్టే…

అమ‌రావ‌తి విష‌యంలో రైతుల‌కు ఏపీ ప్ర‌భుత్వం చేసిన అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూ రాజ‌ధాని ఫైల్స్‌ మూవీ రూపొందింది. ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం చాలా ప్ర‌య‌త్నాలు చేసింది.

ఏపీ సీఏం జ‌గ‌న్‌, కొడాలి నానితో పాటు ప‌లువురు నాయ‌కుల వ్య‌క్తిత్వాల్ని కించ‌ప‌రిచేలా ఈ సినిమాలో సీన్స్ ఉన్నాయ‌ని, వాటిపై సినిమా యూనిట్ వివ‌ర‌ణ ఇచ్చే వ‌ర‌కు సినిమాను రిలీజ్ చేయ‌ద్దంటూ వైఎస్ఆర్‌సీపీ నాయ‌కులు కోర్టును ఆశ్ర‌యించారు. థియేట‌ర్ల‌లో రిలీజైన మొద‌టి రోజు నుంచే సినిమా స్క్రీనింగ్‌ను అడ్డుకున్నారు. చివ‌ర‌కు కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చి సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేశారు.

రాజ‌ధాని ఫైల్స్ క‌థ ఇదే…

అరుణ‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా అధికారాన్ని చేప‌ట్టిన కేఆర్ఎస్ పార్టీ అధినేత అయిరావ‌తి (అమ‌రావ‌తి) నిర్మాణాన్ని నిలిపివేస్తాడు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా అయిరావ‌తి నిర్మాణాన్ని స‌మ‌ర్థించిన నాయ‌కుడు సీఏం కాగానే అయిరావ‌తిని కాద‌ని రాష్ట్రానికి నాలుగు రాజ‌ధానుల‌ను ప్ర‌క‌టిస్తాడు.

రాష్ట్ర అధినేత నిర్ణ‌యాన్ని వ్య‌తిరేక‌తిస్తూ అయిరావ‌తి కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్య‌మ‌బాట ప‌డ‌తారు. రైతుల ఉద్య‌మాన్ని అణిచివేసేందుకు ముఖ్యమంత్రి ఏం చేశాడు. ఈ పోరాటాన్ని ముందుండి న‌డిపించిన న‌డిమిట్టి కేశ‌వులు (వినోద్ కుమార్‌) కుటుంబం ఎలాంటి క‌ష్టాలు ప‌డింది? ప్ర‌భుత్వం త‌ప్పుల‌ను కేశ‌వులు కొడుకు గౌత‌మ్ (అఖిల‌న్‌) ఎలా బ‌య‌ట‌పెట్టాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో..

ఏపీలో నెల‌కొన్న వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు భాను కిర‌ణ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. అధికారి పార్టీ తో పాటు ముఖ్య‌మంత్రి పేరు ను ద‌ర్శ‌కుడు సినిమాలో ఎక్క‌డ ప్ర‌స్తావించ‌కుండానే అమ‌రావ‌తి రైతుల‌కు ప్ర‌భుత్వం చేసిన అన్యాయాన్ని చూపించారు.

రైతుల ఆవేద‌న వ‌ర‌కు రాజ‌ధాని ఫైల్స్ సినిమాలో బాగానే చూపించిన ద‌ర్శ‌కుడు…సీఏం పాత్రను విమ‌ర్శించ‌డం కోస‌మే కావాల‌నే కొన్ని సీన్స్ పెట్ట‌డంతో క‌థ గాడి త‌ప్పింద‌నే విమ‌ర్శ‌లొచ్చాయి. ముఖ్య‌మంత్రి క్యారెక్ట‌ర్ విష‌యంలో చాలా క‌ల్పిత అంశాల‌కు చోటిచ్చాడ‌ని కామెంట్స్ వినిపించాయి. వైఎస్‌వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై నెల‌కొన్న వివాదంతో పాటు చాలా య‌థార్ఘ సంఘ‌ట‌న‌ల‌ను ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ట‌చ్ చేశాడు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024