Krishna mukunda murari serial today: కృష్ణ తెలివికి మురారి ఫిదా.. తమ ప్రేమ గెలవబోతుందని మురిసిపోతున్న ముకుంద

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial today may 8th episode: భవానీ స్నేహితురాలు అమృత ఎంట్రీ ఇస్తుంది. తను కృష్ణని చెక్ చేసి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుందని భవానీ అనేసరికి కృష్ణ, మురారి షాక్ అవుతారు. చెయ్యి పట్టుకుని నాడీ చూస్తే కృష్ణ గర్భవతి కాదని తెలిసిపోతుంది, నా సరోగసి ప్లాన్ బెడిసికొడుతుందేమోనని ముకుంద టెన్షన్ పడుతుంది.

అడ్డంగా బుక్కయిన కృష్ణ 

అంతలోనే తెలిస్తే తెలియనివ్వు సరోగసి గురించి మురారి అత్తయ్యకు చెప్తాడు నా విలువ పెరుగుతుంది. కృష్ణ విలువ తగ్గిపోతుందని అనుకుంటుంది. కృష్ణ చెక్ చేయించుకోవడానికి అంగీకరించదు. అవసరం లేదని అనేసరికి ఇంట్లో అందరూ షాకింగ్ గా చూస్తారు.

నేను కూడా డాక్టర్ ని అంటుంది. అవునా తనే డాక్టర్ అయితే ఇక నేను చూసేదీ ఏముందని అమృత అంటుంది. తను సీనియర్ గైనకాలజిస్ట్ తను టెస్ట్ చేస్తే తృప్తిగా ఉంటుందని భవానీ చెప్తుంది. అడ్డంగా బుక్కయిపోయారని ముకుంద సంతోషపడుతుంది.

తెలివిగా తప్పించుకున్న కృష్ణ 

పొద్దునే హాస్పిటల్ కి వెళ్ళి టెస్ట్ లు చేయించుకున్నానని చెప్తుంది. సరే మీ పెద్దత్తయ్య తృప్తి కోసం చూస్తాను ఆ రిపోర్ట్స్ ఇవ్వు అంటుంది. మన బెడ్ రూమ్ లో రిపోర్ట్స్ ఉన్నాయి వెళ్ళి తీసుకురండి అని మురారిని ఇరికిస్తుంది. మనసులో తిట్టుకుంటాడు. పెద్దమ్మ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్తే ఇలా ఇరికించావ్ ఏంటి తింగరి అనుకుంటాడు.

కృష్ణ ఎక్కడ ఉన్నాయో చెప్పి రిపోర్ట్స్ ఇప్పిస్తుంది. ముందు జాగ్రత్తకు హ్యాట్సాఫ్ అనుకుంటుంది. అవి నిజమైన రిపోర్ట్స్ ఏంటా అని ముకుంద అనుకుంటుంది. రిపోర్ట్స్ అమృత చూసి ప్రాబ్లం ఏమి లేదు అంతా బాగానే ఉందని చెప్తుంది. దీంతో భవానీ హ్యపీగా ఉంటుంది.

మురారి ఇక నా వాడే 

పుట్టబోయే బిడ్డ బాగుండాలని పూజ చేస్తున్నామని రమ్మని పిలుస్తుంది.. ఇలా ఎన్ని రోజులు మ్యానేజ్ చేస్తుంది తర్వాత అయినా దొరికిపోతుంది కదా అప్పుడు అత్తయ్య తనని ఇంట్లో నుంచి తప్పని సరిగా గెంటేస్తుందని ముకుంద సంతోషపడుతుంది.

ఆదర్శ్ వచ్చి ముకుందతో మాట్లాడతాడు. రెండు మూడు రోజులుగా సంతోషంగా కనిపిస్తున్నావ్. నీ నవ్వు, నీ మొహంలో కనిపించే వెలుగు చెప్తుంది. నీ సంతోషానికి కారణం ఏంటో నాకు తెలుసు. ఆ సంతోషానికి కారణం రెండు రోజుల్లో నేనే చెప్తానని అంటాడు.

ముకుంద మాత్రం మురారి తన వాడు కాబోతున్నాడని సంబరపడుతుంది. మురారి సరోగసి మథర్ దొరికిందని సంతోషపడతాడు. ఒంటరిగా ఉండి ఆలోచిస్తుంటే ముకుంద వచ్చి మాట్లాడుతుంది. కృష్ణకి టెస్ట్ చేసి ఉంటే దొరికిపోయేది టెన్షన్ పోయింది లేదంటే ఏమయ్యేది. నటించలేకపోతున్నాం అందరినీ మోసం చేస్తున్నామని తట్టుకోలేకపోతున్నామని అంటాడు.

మురిసిపోతున్న ముకుంద 

ఇంట్లో ఏదో పూజ చేస్తున్నారు కదా అంతా సర్దుకుంటుందిలే అని ముకుంద సర్ది చెప్తుంది. అందరి దృష్టిలో మాకు పుట్టబోయే బిడ్డ కోసం పూజ చేస్తున్నట్టు. మా దృష్టిలో మా బిడ్డ, తనని మోసే తల్లి బాగుండటం కోసమని మురారి చెప్తాడు. అంటే నేను బాగుండాలని కదా అని ముకుంద అంటుంది.

అంతే కదా మీరా నువ్వు బాగుంటేనే మేము బాగున్నట్టు అంటాడు. ముకుంద మురిసిపోతుంది. కృష్ణ ఆలోచిస్తుంటే మురారి రిపోర్ట్స్ గురించి అడుగుతాడు. ఇలాంటివి ఉంటే ముందే చెప్పమని అంటాడు. అబద్ధాలు చెప్పడం వాటిని సమర్థించుకోవడం కోసం సాక్ష్యాలు సృష్టించుకోవడం ఏంటోనని కృష్ణ అనుకుంటుంది.

ఆదర్శ్ కి మురారి సపోర్ట్ 

పంతులు వచ్చి పూజ చేసేందుకు ముహూర్తం చూడమని భవానీ చెప్తుంది. మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. ఆదర్స్, ముకుంద అప్పుడే షాపింగ్ నుంచి వస్తారు. కృష్ణ మీరా వైపు అనుమానంగా చూస్తుంది. ఎక్కడికి వెళ్లారని భవానీ అడిగితే ముకుందకు చీరలు కొనడానికి తీసుకెళ్లానని చెప్తాడు.

రజిని వాళ్ళని చూసి రగిలిపోతుంది. మీరాకి చీరలు కొని మంచి పని చేశావని మురారి మెచ్చుకుంటాడు. మురారి మీరాని సపోర్ట్ చేయడం కృష్ణ సీరియస్ గా చూస్తుంది. అసలు మీరా ఉద్దేశం ఏంటి? సంగీతకు ఆదర్శ్ తో పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు తను ఇలా ఉండటం ఏంటని కృష్ణ తెగ ఆలోచిస్తుంది.

నీ ప్రేమలో పడ్డాను 

తింగరిని ఎలాగైనా కూల్ చేయాలని మురారి ప్లాన్ వేస్తాడు. మురారి కాలు నొప్పి అని డ్రామా ఆడతాడు. కృష్ణ పట్టుకుంటేనే నొప్పి అన్నట్టు తెగ నటించేస్తాడు. ఎక్కడైనా పడ్డారా అంటే నీ ప్రేమలో పడ్డానని అంటాడు. సరోగసి అంటూ టెన్షన్ గా ఉన్నాం కాస్త రిలీఫ్ కావాలి కదా అంటాడు.

మన ప్రేమకు గుర్తుగా బిడ్డని నేనే మొస్తే ఇంకెంత సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఆ దేవుడికి ఇష్టం లేదు అందుకే నాకు అదృష్టాన్ని దూరం చేశాడని బాధపడుతుంది. దేవుడు మనకు మంచి దారి చూపించాడు అందులో మనం జాగ్రత్తగా నడవాలని అంటాడు.

ఏం జాగ్రత్త సరోగసి మథర్ ఎవరో తెలియడం లేదని అంటుంది. మీరా సరోగసి మథర్ అని చెప్పాలని ఉంది కానీ నువ్వు తనని ఎక్కడ కాదంటావో, మళ్ళీ అలాంటి మంచి అమ్మాయి దొరకడం కష్టమని అనుకుంటాడు.అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది. 

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024