Best Web Hosting Provider In India 2024
Heeramandi Sex Scene: హీరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించింది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇందులో సోనాక్షి చేసిన ఓ బోల్డ్ సెక్స్ ఫోర్ ప్లే సీన్ వైరల్ అవుతోంది. ఓ మహిళతోనే ఆ పాత్ర ఈ పని ఎందుకు చేస్తుందన్న ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది.
మగాళ్లంటే ద్వేషం కనుకే..
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ హీరామండి వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా.. ఫరీదన్ అనే పాత్ర పోషించింది. ఇందులో ఒక సీన్ లో తన దగ్గర పనిచేసే మహిళతో ఫోర్ ప్లే చేసే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ ను మరీ ఎక్కువగా లాగకుండా వెంటనే కట్ చేశారు. తాజాగా న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాక్షి ఈ సీన్ పై స్పందించింది.
“ఆమెను 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మేస్తారు. అందుకే ఆమెకు మగాళ్లంటే అంత ద్వేషం ఉండొచ్చు. అదే కారణం కావచ్చు. దానిని అలా చర్చకు వదిలేశారు. అందుకే దానిని మరీ లాగకుండా అక్కడితో ముగించారు” అని సోనాక్షి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అది చాలా పెద్ద ప్రపంచం అని, భన్సాలీ సర్ కేవలం చిన్న చిన్న సీన్ల ద్వారా వివిధ కోణాలను స్పృశించడానికి ప్రయత్నించారని చెప్పింది.
హీరామండి ఫీడ్‌బ్యాక్‌పై..
ఇక ఈ వెబ్ సిరీస్ లో తన నటన, హీరామండికి వస్తున్న రెస్పాన్స్ పైనా సోనాక్షి స్పందించింది. ఓటీటీలోకి భన్సాలీ చేసిన తొలి వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్ లో తన నటనకుగాను లెజెండరీ రేఖ నుంచి తనకు ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉందని సోనాక్షి చెప్పింది. “అదొక మాయ. చాలా రోజుల తర్వాత ఇలాంటి స్క్రీనింగ్ చూశాను. నా మొత్తం కెరీర్లో నేను వెళ్లిన అతి పెద్ద ప్రీమియర్స్ లో ఇదీ ఒకటి. ఆ రోజు చాలా మందిని కలిశాను. కానీ రేఖ మేడమ్ కు మాత్రం హీరామండి చాలా నచ్చేసింది. అది నాకు చాలా ప్రోత్సాహంగా అనిపించింది” అని సోనాక్షి చెప్పింది.
ఈ షో చూసి ఆమె థ్రిల్ ఫీలైందని కూడా తెలిపింది. “ఆమె చెప్పిన అందమైన విషయాలు విని నేను అలా చూస్తుండిపోయాను. నన్ను రేఖ పొగుడుతుండటం చూసి నమ్మశక్యం కాలేదు. ఆమెతో జరిపిన ఆ సంభాషణను నేను మరవలేను. ఆమె నాకు మరో తల్లి అని మా అమ్మతో నేను ఎప్పుడూ చెబుతుంటాను. మా మధ్య చాలా ప్రేమ ఉంది” అని సోనాక్షి చెప్పింది.
సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హీరామండి వెబ్ సిరీస్ కు ఊహించినట్లే మంచి రెస్పాన్స్ వస్తోంది. 1940ల నేపథ్యంలో లాహోర్ లోని వేశ్యల విలాసవంతమైన జీవితం, స్వతంత్ర పోరాటంలో వాళ్ల పాత్ర గురించి ఈ సిరీస్ లో భన్సాలీ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సిరీస్ లో సోనాక్షితోపాటు మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, శేఖర్ సుమన్, ఫర్దీన్ ఖాన్ నటించారు.