
Best Web Hosting Provider In India 2024

Telangana Tourism Hyderabad Tirumala Tour : తిరుమల శ్రీవారి భక్తుల కోసం మంచి ప్యాకేజీ వచ్చేసింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ టూర్ ప్యాకేజీ పూర్తి అవుతుంది. దీన్ని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3,700గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2,960గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.
తిరుమల టూర్ ప్యాకేజీ వివరాలు :
- TIRUPATI – TIRUMALA TOUR పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
- హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
- కేవలం ఒకే ఒక్క రోజులోనే తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి.
- Day 1 – సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374)
- Day 2 – ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత స్థానంకంగా ఉండే ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు.
- తిరుపతిలో ఫ్రెషప్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
- Day 3 – ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
- తెలంగాణ టూరిజం బస్సు ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారు. మీ డబ్బులు వాపస్ కూడా ఇవ్వబడవు.
టాపిక్
IrctcIrctc PackagesTravelTourismAp TourismTelangana Tourism